హైదరాబాద్లో 6 ప్రైవేట్ బస్సులు సీజ్ | Six private travels buses seized at hyderabad - bangalore highway | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో 6 ప్రైవేట్ బస్సులు సీజ్

Published Wed, Dec 18 2013 8:57 AM | Last Updated on Tue, Nov 6 2018 4:55 PM

Six private travels buses seized at hyderabad - bangalore highway

ప్రైవేట్ ట్రావెల్స్పై ఆర్టీఏ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులు బుధవారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆరు బస్సులను సీజ్ చేశారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలో ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతి అయింది.

 

ఆ ఘటనలో 45 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు మొద్దు నిద్రలో ఉన్న రవాణా శాఖ అధికారులు ఆ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అదికాక ఆ దుర్ఘటనపై సర్వత్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సులపై నిరంతరం దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement