బెంగళూరు హైవేపై ఆర్టీఏ తనిఖీలు | RTA seized 20 bus in hyderabad | Sakshi
Sakshi News home page

బెంగళూరు హైవేపై ఆర్టీఏ తనిఖీలు

Published Sat, Jan 17 2015 8:30 AM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

RTA seized 20 bus in hyderabad

హైదరాబాద్: నగర శివారులోని రాజేంద్రనగర్ గగన్ పహాడ్ వద్ద గల బెంగళూరు జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 20 బస్సులను అధికారులు సీజ్ చేశారు. అనంతరం ఆ బస్సులపై కేసు నమోదు చేశారు.

సంక్రాంతి పండగ నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ అధికంగా ఛార్జీలు వసూల్ చేస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో అధికారులు తనిఖులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement