సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్ తర్వాత సేవలు ప్రారంభించిన రవాణా శాఖకు తొలిరోజు రూ. 1.82 కోట్ల ఆదాయం సమకూరింది. గురువారం నుంచి పూర్తి స్థాయిలో రవాణా శాఖ సేవలు మొదలయ్యాయి. రవాణా శాఖ కమిషన ర్ ఎంఆర్‌ఎంరావు.. గురువారం ప్రధాన కార్యాలయంలో సేవలను దగ్గరుండి ప ర్యవేక్షించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా వివిధ జిల్లాల్లోని అధికారులతో సమీక్షించారు. రవాణా కార్యాలయాల కు వచ్చే వారు కచ్చితంగా మాస్కులు ధరించటంతోపాటు, భౌతికదూరాన్ని పాటించేలా ఏ ర్పాట్లు చేయాలని ఆదేశించారు. లైసెన్స్, రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణకు వచ్చే వారు కచ్చితంగా శా నిటైజర్ వినియోగించాలని, వాటిని అందుబా టులో ఉంచాలని ఆయన ఆదేశించారు. కార్యాలయాలకు వచ్చే వారిని కచ్చితంగా థర్మల్ స్క్రీనింగ్ చేసి లోనికి అనుమతించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment