![Allari Naresh in RTA - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/22/1444.jpg.webp?itok=HEfwJl3-)
హైదరాబాద్: సినీ నటుడు అల్లరి నరేష్ శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని సందర్శించారు. కొత్తగా కొనుగోలు చేసిన కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి రాంచందర్ మోటారు వాహన నిబంధనల మేరకు వాహనం రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.
అల్లరి నరేష్ తన ఖరీదైన కొత్త కియా ఈవీ–6 బ్యాటరీ కారు కోసం ప్రత్యేక నంబర్‌ను సొంతం చేసుకున్నారు. టీఎస్ 09 జీబీ 2799 నంబర్ కోసం ఆయన ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా రూ.94,899 చెల్లించి నంబర్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment