బండి తాళం లాక్కునే అధికారం లేదు | Policemen have no right to take out key of your vehicle during checking | Sakshi
Sakshi News home page

బండి తాళం లాక్కునే అధికారం లేదు

Published Mon, Feb 22 2016 7:56 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

బండి తాళం లాక్కునే అధికారం లేదు - Sakshi

బండి తాళం లాక్కునే అధికారం లేదు

హైదరాబాద్ : రోడ్డు మీద వెళుతున్న బైక్‌ను ఆపి.. పోలీసులు బైక్ తాళాన్ని లాక్కోవడం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనలో చాలామందికి అనుభవమే. సిగ్నల్స్ వద్ద, చెకింగ్ పాయింట్స్ వద్ద పోలీస్ కానిస్టేబుల్స్ వాహనాలను ఆపిందే తడవుగా మన బండికున్న తాళాన్ని లాక్కుంటుంటారు. ఆ తర్వాతే మన దగ్గరున్న లైసెన్స్, ఇతర ధృవీకరణ పత్రాలు పరిశీలిస్తారు. అయితే అలా బండి తాళాన్ని లాక్కునే అధికారం పోలీస్ కానిస్టేబుల్‌కే కాదు ఏ ఇతర పోలీస్ అధికారికి కూడా లేదని రవాణా శాఖ స్పష్టం చేసింది.

హర్యానాలోని సిర్ఫా ప్రాంతానికి చెందిన పవన్ పారిఖ్ అనే లాయర్ ఇలా బైక్ కీ లాక్కునే హక్కు పోలీసు కానిస్టేబుల్‌కి ఉందా అని ఆర్‌టీఏని ప్రశ్నించాడు. దానిపై స్పందించిన రాష్ట్ర హోం శాఖ ‘అలా కీ తీసుకొనే హక్కు కానిస్టేబుల్‌కే కాదు, ఏ పోలీసు అధికారికి లేదు’ అని తెలిపింది. పోలీసులకి ఈ విషయం తెలియక వారు అలా ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. పవన్ కూడా ఇలాంటిదే అనుభవమైనందున సూటిగా రవణా శాఖను ప్రశ్నించాడు.

వాస్తవానికి ఇది చాలా మందికి అనుభవమే. బండి ఆపకముందే తాళాన్ని లాక్కుంటారు, బండి కాగితాలు చూపించేదాక కూడా వెయిట్ చేయరంటూ గతంలో కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ మీద చాలా అభియోగాలొచ్చాయి , అంతేకాదు అర్హతతో సంబంధం లేకుండా ఎవరు పడితే వారు రశీదు పుస్తకాన్ని చేత పట్టి ఫైన్‌లు వేసిన రోజులు కూడా గతంలో అనేకం ఉన్నాయి.

ఇవి తెలుసుకోండి..
1) బండిని ఆపి తాళం లాక్కునే అధికారం ఏ పోలీస్ అధికారికీ లేదు.
2) ఏ పోలీస్ అధికారికి ఫైన్‌ను బై హ్యాండ్‌గా చెల్లించాల్సిన అవసరం లేదు.
3) లైసెన్స్ లేని పరిస్థితిలో లైసెన్స్ నెంబర్ చెప్పినా చాలు
4) ఎస్సై పైస్థాయి వ్యక్తులు తప్ప ఇతర అధికారులు చలానా వేయడానికి అర్హులు కారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement