మెగాస్టార్ చిరంజీవి తనయుడు, సినీ హీరో రామ్చరణ్ శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు.
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి తనయుడు, సినీ హీరో రామ్చరణ్ శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా కొనుగోలు చేసిన తన వాహనం మెర్సిడెస్ బెంజ్ రిజిస్ట్రేషన్ కోసం ఆయన స్వయంగా వచ్చి, డిజిటల్ ప్యాడ్పై సంతకం చేశారు.
రూ.10వేల రుసం చెల్లించి 'టీఎస్ 09, ఈబీ 2727' నెంబర్పై వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణ అధికారి దశరథం వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇక చిరంజీవి పుట్టినరోజునే రామ్చరణ్ కొత్త వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవటం గమనార్హం. ఇక నాన్న పుట్టినరోజు కానుకగా రామ్చరణ్...ఆయనకు ఓ కారును బహుమతిగా ఇచ్చారు. చిరంజీవి ప్రతి బర్త్‌డేకి ఏదో ఒక గిప్ట్ ఇచ్చే చెర్రీ ...ఈసారి ల్యాండ్ క్రూజర్ను ప్రజెంట్ చేశాడు.