అక్రమ రవాణాపై ఆర్టీఏ కొరడా | special check in RTA | Sakshi
Sakshi News home page

అక్రమ రవాణాపై ఆర్టీఏ కొరడా

Published Thu, Mar 23 2017 4:16 AM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM

అక్రమ రవాణాపై ఆర్టీఏ కొరడా

అక్రమ రవాణాపై ఆర్టీఏ కొరడా

సాక్షి, సిటీబ్యూరో: అక్రమ రవాణా పై  ఆర్టీఏ కొరడా ఝళిపిచింది. బుధవారం తెల్లవారు జామున నగరంలోని వివిధ  ప్రాంతాల్లో నిర్వహించిన   ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా  తిరుగుతున్న వాహనాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. రంగారెడ్డి ఉప రవాణా కమిషనర్‌  ప్రవీణ్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక బృందాలు  రాజేంద్రనగర్, ఆరాంఘర్‌ చౌరస్తా, గగన్‌పహడ్‌లలో  పోలీసులతో కలిసి  ప్రైవేట్‌ బస్సులను తనిఖీ చేశాయి. సీనియర్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయరావు సారథ్యంలో చేపట్టిన ఈ దాడుల్లో  బెంగళూరు నుంచి  హైదరాబాద్‌ వస్తున్న 90 బస్సులను తనిఖీ చేసి, కాంట్రాక్ట్‌ క్యారేజీలుగా అనుమతి తీసుకొని స్టేజీ క్యారేజీలుగా నడుపుతున్న 33 బస్సులపై కేసులు నమోదు చేశారు.  నిబంధనలకు విరుద్ధంగా అదనపు సీట్లు  ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున సరుకు రవాణాకు పాల్పడినందుకుగాను 11 బస్సులను సీజ్‌ చేశారు. అలాగే  ప్రైవేట్‌ బస్సులతో పాటు అదే మార్గంలో  నగరంలోకి ప్రవేశిస్తున్న  50 లారీలను తనిఖీ చేసి డ్రైవర్‌లకు డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించారు. 6 గురు లారీ డ్రైవర్లు  మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి  కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

ఓవర్‌లోడ్‌పై  ఉక్కుపాదం...
మరోవైపు  హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మియాపూర్, రాజేంద్రనగర్‌లలో  పరిమితికి మించి వస్తులను తరలిస్తున్న  21 ఓవల్‌ లోడ్‌ లారీలపై కేసులు నమోదు చేశారు. ఇసుక, కంకర పొడి,బియ్యం, తదితర వస్తువులను  నిబంధనలకు విరుద్ధంగా  ఓవర్‌లోడ్‌ చేస్తున్నట్లు డీటీసీ ప్రవీణ్‌రావు తెలిపారు. రహదారి భద్రతకు  విఘాతం కలిగిస్తున్న  డ్రైవర్ల  డ్రైవింగ్‌ లైసెన్సులను 6 నెలల పాటు సస్పెండ్‌ చేసినట్లు  పేర్కొన్నారు. ఓవర్‌లోడ్‌పై  దాడులను మరింత విస్తృతం చేయనున్నట్లు  తెలిపారు. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపే సరుకు రవాణా, ప్రయాణికుల రవాణా వాహనాలు, వాటి యాజమాన్యాలు, డ్రైవర్లను సహించబోమని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement