ఆర్టీఏ అధికారుల దాడులు
ఆర్టీఏ అధికారుల దాడులు
Published Sun, Dec 11 2016 11:18 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
- వివక్షత చూపుతున్నారని తెలంగాణా ప్రాంత వాహన దారుల ఆందోళన
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం పరిసర ప్రాంతంలో ఆదివారం రవాణా శాఖ అధికారులు దాడులు చేశారు. స్పెషల్ స్క్వాడ్ ఆఫీసర్ కె. ఎల్‌ఎన్వీ ప్రసాద్ అటవీశాఖ కార్యాలయం వద్ద తెలంగాణా ప్రాంతం నుంచి వస్తున్న వాహనాలను నిలిపి పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని ఆరు వాహనాలకు అపరాధ రుసుం విధించారు. రాష్ట్ర పునర్విభజన అనంతరం ఆంధ్రప్రాంతంలోని సున్నిపెంట వద్ద బార్డర్ చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణా ప్రాంతానికి చెందిన వాహదారులపై వివక్ష చూపుతున్నారని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు సిబ్బంది మామూళ్లు తీసుకుంటూ వాహనాలను వదిలేశారని ఆరోపించారు. కాగా బార్డర్ చెక్‌పోస్టు వద్ద నిలుపుదల చేస్తున్నా ఆపకుండా వెళ్లిన వాహనాలను స్పెషల్ స్క్వాడ్ అధికారులు అడ్డుకుని జరిమానా విధించారని ఆర్టీఓ రఘునాథ్ తెలిపారు.
Advertisement