8న ఆర్‌టీఏలో వాహనాల వేలం | vehicle auction in rta on 8th | Sakshi
Sakshi News home page

8న ఆర్‌టీఏలో వాహనాల వేలం

Published Sun, Nov 6 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

vehicle auction in rta on 8th

అనంతపురం సెంట్రల్‌ : వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఈనెల 8న ఉప రవాణా కమిషనర్‌(డీటీసీ) కార్యాలయంలో వేలం వేస్తున్నట్లు డీటీసీ సుందర్‌వద్ది ఒక ప్రకటనలో తెలిపారు. 235 ఆటో రిక్షాలు, 47 గూడ్స్‌ వాహనాలు, 14 ద్విచక్ర వాహనాలు, 14 ట్రాక్టర్‌ ట్రాలీలు, 26 మ్యాక్సిక్యాబ్‌లు వేలం వేస్తున్నట్లు తెలిపారు. ఈ వేలంలో పాల్గొను వారు రూ. 5 వేలు ధరావత్తు చెల్లించాలన్నారు. వాహనాలకు సంబంధించిన యజమానులు ఎవరైనా ఉంటే తగిన అపరాధ రుసుం చెల్లించి వెంటనే విడిపించుకోవాలని కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement