On 8th
-
8న జిల్లా అర్చక సమావేశం
అనంతపురం కల్చరల్ : ఉరవకొండలోని కరిబసప్ప సత్రంలో ఈనెల 8న జిల్లా అర్చక సమావేశం నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర అర్చక సమాఖ్య సభ్యులు వాస్తు వెంకటరామయ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్చకుల భూముల వివరాల గురించి చర్చ ఉంటుందని అన్నారు. అర్చకులందరూ హాజరు కావాలని, మరిన్ని వివరాలకు 7799258399 నంబర్లో సంప్రదించాలన్నారు. -
8న ఆర్టీఏలో వాహనాల వేలం
అనంతపురం సెంట్రల్ : వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఈనెల 8న ఉప రవాణా కమిషనర్(డీటీసీ) కార్యాలయంలో వేలం వేస్తున్నట్లు డీటీసీ సుందర్‌వద్ది ఒక ప్రకటనలో తెలిపారు. 235 ఆటో రిక్షాలు, 47 గూడ్స్ వాహనాలు, 14 ద్విచక్ర వాహనాలు, 14 ట్రాక్టర్ ట్రాలీలు, 26 మ్యాక్సిక్యాబ్‌లు వేలం వేస్తున్నట్లు తెలిపారు. ఈ వేలంలో పాల్గొను వారు రూ. 5 వేలు ధరావత్తు చెల్లించాలన్నారు. వాహనాలకు సంబంధించిన యజమానులు ఎవరైనా ఉంటే తగిన అపరాధ రుసుం చెల్లించి వెంటనే విడిపించుకోవాలని కోరారు. -
8న విద్యుత్ వినియోగదారుల సదస్సు
సంగారెడ్డి మున్సిపాలిటీ: విద్యుత్ వినియోగ దారుల సమస్యలను పరిష్కరించేందుకు గాను ఈనెల 8న తుక్కాపూర్‌లో విద్యుత్ వినియోగ దారుల జిల్లా సదస్సును నిర్వహించానున్నట్లు ట్రాన్స్‌కో ఎస్సీఈ సధానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంలకు తుక్కాపూర్‌లో నిర్వమించే విద్యుత్ వినియోగదారుల సదస్సులో పలు సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని వినియోగ దారులు అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫారలో అంతరాయము, చార్జీల హెచ్చు తగ్గులు, మిటర్ల సమస్యలు, కోత్త సర్వీసు జారీ చేయడంలో జాప్యం వంటీ సమస్యలను ఈ సదస్సులో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. -
8న ‘స్వచ్ఛ తెలంగాణ’కు శ్రీకారం
రాష్ట్రంలోని 67 పట్టణాల్లో అమలు హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఈ నెల 8న ‘స్వచ్ఛ భారత్-స్వచ్ఛ తెలంగాణ’ కార్యక్రమం ప్రారంభించనున్నామని రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు బి.నాగిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 67 మున్సిపాలిటీల్లో ఏకకాలంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ తెలంగాణ ఏర్పాట్లపై మేయర్లు/చైర్మన్లు, మునిసిపల్ కమిషనర్లతో మంగళవారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కింద వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం, ఘన వ్యర్థాల నిర్వహణతో పాటు పారిశుధ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఈ కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు ప్రతి పట్టణానికి ఒక నోడల్ అధికారిని, ప్రతి వార్డుకు వార్డు స్థాయి అధికారిని నియమించామన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేసుకునే లబ్ధిదారులకు ఈ నెల 8న ప్రారంభోత్సవం రోజు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు. రెండు విడతల్లో పునాది వరకు నిర్మిస్తే రూ.6 వేలు, పూర్తిగా నిర్మిస్తే మిగిలిన రూ.6 వేలను లబ్ధిదారులకు చెల్లిస్తామన్నారు. -
8న దక్షిణ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రద్దు
హైదరాబాద్: న్యూఢిల్లీ సమీపంలోని తుగ్లకాబాద్ రైల్వేస్టేషన్ వద్ద నిర్మాణ పనుల దృష్ట్యా ఈ నెల 8న హైదరాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ (12721) దక్షిణ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 10న హజ్రత్ నిజాముద్దీన్-హైదరాబాద్ దక్షిణ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12722) కూడా నిలిచిపోనున్నట్లు పేర్కొన్నారు. అలాగే విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ వరకు ఈ ట్రైన్‌కు లింక్ ఎక్స్‌ప్రెస్‌గా నడిచే సర్వీసులు కూడా పై రెండు తేదీల్లో నిలిచిపోనున్నాయి.