రాష్ట్రంలోని 67 పట్టణాల్లో అమలు
హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఈ నెల 8న ‘స్వచ్ఛ భారత్-స్వచ్ఛ తెలంగాణ’ కార్యక్రమం ప్రారంభించనున్నామని రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు బి.నాగిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 67 మున్సిపాలిటీల్లో ఏకకాలంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ తెలంగాణ ఏర్పాట్లపై మేయర్లు/చైర్మన్‌లు, మునిసిపల్ కమిషనర్లతో మంగళవారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కింద వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం, ఘన వ్యర్థాల నిర్వహణతో పాటు పారిశుధ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు.
ఈ కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు ప్రతి పట్టణానికి ఒక నోడల్ అధికారిని, ప్రతి వార్డుకు వార్డు స్థాయి అధికారిని నియమించామన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేసుకునే లబ్ధిదారులకు ఈ నెల 8న ప్రారంభోత్సవం రోజు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు. రెండు విడతల్లో పునాది వరకు నిర్మిస్తే రూ.6 వేలు, పూర్తిగా నిర్మిస్తే మిగిలిన రూ.6 వేలను లబ్ధిదారులకు చెల్లిస్తామన్నారు.
8న ‘స్వచ్ఛ తెలంగాణ’కు శ్రీకారం
Published Wed, May 6 2015 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM
Advertisement
Advertisement