ముంబై: కరోనా వైరస్ ప్రభావం బలహీనపడిన తర్వాత పర్యాటక రంగంలో కార్యకలాపాలు ఊపందుకున్నాయి. దేశ, విదేశీ పర్యటనలకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. విమాన ప్రయాణికుల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఇదే తరుణంలో ఆన్‌లైన్ ట్రావెల్ స్కామ్‌లు (మోసాలు) కూడా పెరుగుతున్నట్టు మెకాఫీ కార్ప్ ‘సేఫ్ హాలిడేస్ ట్రావెల్’ నివేదిక వెల్లడించింది. పర్యాటకులు తమ విహారం కోసం ఆన్‌లైన్‌లో పలు సేవలను బుక్ చేసుకోవడం తెలిసిందే. ఇలా బుక్ చేసుకునే సమయంలో మోసపోతున్న కేసులు గణనీయంగా పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. దీనిపై ఓ సర్వే నిర్వహించి వివరాలను వెల్లడించింది.
సర్వే వివరాలు..
- తాము బుకింగ్ సమయంలో ఆదా చేసుకునేందుకు ప్రయత్నించగా, మోసపోయినట్టు 51 శాతం మంది చెప్పారు.
- వీరిలో 77 శాతం మంది సగటున ఒక్కొక్కరు వెయ్యి డాలర్లు (సుమారు రూ.82,000) నష్టపోయినట్టు తెలిపారు.
- మొత్తం 7,000 మందిని సర్వే చేయగా, అందులో భారత్ నుంచి 1,010 మంది ఉన్నారు.
- 27 శాతం మందిని చెల్లింపుల సమయంలో వేరే ప్లాట్‌ఫామ్‌లకు మళ్లించి మోసపుచ్చారు.
- 36 శాతం మంది గుర్తింపు చోరీకి గురైంది. ఇందులో 13 శాతం మంది పాస్‌పోర్ట్ వివరాలు పంచుకోగా, 27 శాతం మంది వ్యక్తిగత గుర్తింపు వివరాలను నకిలీ సైట్లకు వెల్లడించారు.
- డిజిటల్ మోసాల ముప్పు ఎక్కువని 59 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు.
- వైఫై నెట్‌వర్క్‌లకు కనెక్ట్ అవడం, ఎయిర్‌పోర్ట్ లేదా రైల్వే స్టేషన్లలో ఉచిత యూఎస్‌బీ చార్జింగ్ పోర్ట్ వాడుకోవడం, డిజిటల్ అకౌంట్‌ను లాగవుట్ చేయకుండా వదిలివేయడం రిస్క్‌ను పెంచుతోంది.
ఇదీ చదవండి: రియల్ ఎస్టేట్ జోరు.. 5.6 లక్షల ఇళ్ల నిర్మాణం! హైదరాబాద్ సహా ఏడు నగరాల్లో..
Comments
Please login to add a commentAdd a comment