McAfee
-
ట్రావెలింగ్ చేసేవారికి అలర్ట్! పెరుగుతున్న ఆన్లైన్ ట్రావెల్ స్కామ్‌లు
ముంబై: కరోనా వైరస్ ప్రభావం బలహీనపడిన తర్వాత పర్యాటక రంగంలో కార్యకలాపాలు ఊపందుకున్నాయి. దేశ, విదేశీ పర్యటనలకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. విమాన ప్రయాణికుల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఇదే తరుణంలో ఆన్లైన్ ట్రావెల్ స్కామ్‌లు (మోసాలు) కూడా పెరుగుతున్నట్టు మెకాఫీ కార్ప్ ‘సేఫ్ హాలిడేస్ ట్రావెల్’ నివేదిక వెల్లడించింది. పర్యాటకులు తమ విహారం కోసం ఆన్లైన్లో పలు సేవలను బుక్ చేసుకోవడం తెలిసిందే. ఇలా బుక్ చేసుకునే సమయంలో మోసపోతున్న కేసులు గణనీయంగా పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. దీనిపై ఓ సర్వే నిర్వహించి వివరాలను వెల్లడించింది. సర్వే వివరాలు.. తాము బుకింగ్ సమయంలో ఆదా చేసుకునేందుకు ప్రయత్నించగా, మోసపోయినట్టు 51 శాతం మంది చెప్పారు. వీరిలో 77 శాతం మంది సగటున ఒక్కొక్కరు వెయ్యి డాలర్లు (సుమారు రూ.82,000) నష్టపోయినట్టు తెలిపారు. మొత్తం 7,000 మందిని సర్వే చేయగా, అందులో భారత్ నుంచి 1,010 మంది ఉన్నారు. 27 శాతం మందిని చెల్లింపుల సమయంలో వేరే ప్లాట్‌ఫామ్‌లకు మళ్లించి మోసపుచ్చారు. 36 శాతం మంది గుర్తింపు చోరీకి గురైంది. ఇందులో 13 శాతం మంది పాస్‌పోర్ట్ వివరాలు పంచుకోగా, 27 శాతం మంది వ్యక్తిగత గుర్తింపు వివరాలను నకిలీ సైట్లకు వెల్లడించారు. డిజిటల్ మోసాల ముప్పు ఎక్కువని 59 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. వైఫై నెట్‌వర్క్‌లకు కనెక్ట్ అవడం, ఎయిర్పోర్ట్ లేదా రైల్వే స్టేషన్లలో ఉచిత యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ వాడుకోవడం, డిజిటల్ అకౌంట్‌ను లాగవుట్ చేయకుండా వదిలివేయడం రిస్క్‌ను పెంచుతోంది. ఇదీ చదవండి: రియల్ ఎస్టేట్ జోరు.. 5.6 లక్షల ఇళ్ల నిర్మాణం! హైదరాబాద్ సహా ఏడు నగరాల్లో.. -
గూగుల్ హెచ్చరికలు, ఈ 16 యాప్స్ చాలా డేంజర్..వెంటనే డిలీట్ చేసుకోండి!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ వినియోగదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రమాదకరమైన 16 యాప్స్‌ను తొలగించినట్లు తెలిపింది. ఆ యాప్స్‌ను యూజర్లు వినియోగిస్తున్నట్లైతే వెంటనే వాటిని డిలీట్ చేయాలని కోరింది బ్యాటరీని నాశనం చేయడం, డేటా వినియోగం ఎక్కువ అయ్యేలా చేసే 16 యాప్స్ ప్లేస్టోర్‌లో ఉన్నట్లు గూగుల్ గుర్తించింది. ఇప్పటికే 20 మిలియన్ల మంది ఇన్స్టాల్ చేసుకున్న సదరు యాప్స్ యూజర్లు ఉపయోగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తెలిపింది. తమ యాప్స్ ఓ భద్రతా సంస్థ నుంచి గుర్తింపు పొందినవని చెబుతూ తప్పుడు ప్రకటనలతో యూజర్లను ఏమార్చే ప్రయత్నం జరుగుతున్నట్లు గూగుల్ పేర్కొంది. ఆర్స్ టెక్నికా నివేదిక ప్రకారం.. గూగుల్ ప్లే స్టోర్ నుండి 16 అప్లికేషన్లను తొలగించింది. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ (McAfee) గుర్తించిన ఈ ప్రమాదకరమైన యాప్స్‌ను గతంలో ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లలో డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉన్నట్లు తెలిపింది. క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడానికి, మొబైల్, లేదంటే టాబ్లెట్లలో ఫ్లాష్‌ను టార్చ్‌గా ఆన్ చేయడానికి లేదా వివిధ రకలా అవసరాల కోసం వినియోగించేందుకు ఉపయోగపడినట్లు తెలిపింది. ఇప్పుడు అవే యాప్స్ యూజర్లకు నష్టం కలిగిస్తున్నట్లు మెకాఫీ ప్రతినిధులు తెలిపారు. తొలగించిన యాప్స్ తొలగించిన యాప్స్‌లలో BusanBus, Joycode, Currency Converter, High speed Camera, Smart Task Manager, Flashlight+, K-Dictionary, Quick Note, EzDica, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ డౌన్లోడర్, ఈజెడ్ నోట్స్ వంటివి ఉన్నాయి. చదవండి👉 భారత్‌లో కస్టమర్లు, వ్యాపారాలకు పెద్ద ఎదురుదెబ్బ -
గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్, వెంటనే ఈ ఎక్స్‌టెన్షన్స్‌ను డిలీట్ చేయండి!
ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ (McAfee) గూగుల్ క్రోమ్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. సైబర్ నేరస్తులు ఈ కామర్స్ సైట్‌లోని అఫిలియేషన్ లింక్స్‌ను అడ్డుపెట్టుకొని యూజర్లను ఫిషింగ్ సైట్లకు మళ్లిస్తున్నట్లు తెలిపింది. గూగుల్ క్రోమ్‌లో ఉన్న ఐదు ఎక్స్ టెన్షన్లను 1,400,000 కంటే ఎక్కువ మంది ఇన్ స్టాల్ చేసుకున్నారని, తద్వారా యూజర్ల డేటాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చింది. మెకాఫీ వెల్లడించిన ఎక్స్ టెన్షన్లలో నెట్ ఫ్లిక్స్ పార్టీ (800,000 యూజర్లు), నెట్ ఫ్లిక్స్ పార్టీ 2 (300,000 యూజర్లు), ఫ్లిప్ షోప్ ప్రైస్ ట్రాకర్ ఎక్స్ టెన్షన్ (80,000 యూజర్లు), ఫుల్ పేజీ స్క్రీన్ షాట్ క్యాప్చర్ స్క్రీన్ షాట్ (200,000 యూజర్లు), ఆటోబ్యూయ్ ఫ్లాష్ సేల్స్ (20,000 యూజర్లు) ఉన్నట్లు వెల్లడించింది. క్రోమ్ స్టోర్‌లో ఎక్స్ టెన్షన్ లు లభ్యం కావడం లేదు. అయితే యూజర్లు వాటిని తమ పర్సనల్ కంప్యూటర్లలలో ఇన్ స్టాల్ చేసుకున్నట్లయితే, వెంటనే డిలీట్ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఫిషింగ్ దాడులు తెలివి మీరిన సైబర్ నేరస్తులు యూజర్ నేమ్, పాస్ వర్డ్‌లను దొంగిలించేందుకు ఫిషింగ్ దాడులకు పాల్పడుతున్నారు. ఈ-కామర్స్ సైట్లు అందించే అఫిలియేట్ కమిషన్ లింక్స్‌ను క్లిక్ చేస్తే..వారికి అనుకూలమైన సైట్లకు మళ్లిస్తున్నారు. అనంతరం యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ డీటెయిల్స్‌ను కాజేస్తున్నారు. ఇదే విషయాన్ని మెకాఫీ గుర్తించింది. యూఆర్ఎల్ క్లిక్ చేస్తే అందులో అక్షర దోషాల్ని గుర్తించాలి. అక్షర దోషాలున్న లింక్స్‌ను క్లిక్ చేయోద్దంటూ సూచించింది. -
2021 రౌండప్: అస్తమించిన టెక్ మేధావులు వీళ్లే..
ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కొత్త సాంకేతికతను ప్రపంచానికి పరిచయం చేసింది. వీటిలో వాడుకలోకి వచ్చినవి కొన్నైతే.. మెటావర్స్ లాంటి సంచలనానికి బీజం పడింది కూడా 2021లోనే!. ఇదిలా ఉంటే ఈ ఏడాదిలో టెక్ రంగానికి విశిష్ట సేవలు అందించిన దిగ్గజాలు కొందరు తనువు చాలించారు. ఏడాది ముగింపు సందర్భంగా వాళ్లను, వాళ్ల సేవలను ఓసారి గుర్తు చేసుకుంటూ.. పర్సనల్ కంప్యూటర్ సృష్టికర్త బ్రిటిష్ ఇన్వెంటర్ సర్ క్లయివ్ సిన్‌క్లెయిర్. జీఎక్స్(ZX) స్పెక్ట్రమ్ కంప్యూటర్ సృష్టికర్త. ఫస్ట్ పర్సనల్ కంప్యూటర్‌గా దీనికంటూ ఓ పేరుంది. అంతేకాదు కంప్యూటర్ వీడియో గేమ్‌లు, కోడింగ్ లాంటి విషయాల్ని జనాలకు దగ్గర చేసింది కూడా ఇదే. ఒకరకంగా ఇళ్లలో కంప్యూటర్ల వాడకానికి మూలకారకుడు ఈయనే. 1983లో సిన్క్లెయిర్కు నైట్‌హుడ్ గౌరవం దక్కింది. 1985లోనే బ్యాటరీతో నడిచే సింగిల్ సీటర్ వెహికిల్ C5ను ఈయన రూపొందించినప్పటికీ.. సేఫ్టీ కోణంలో ఆ వెహికిల్ ఆటోమొబైల్ మార్కెట్ దృష్టిని ఆకర్షించలేకపోయింది. 2021 సెప్టెంబర్‌లో 81 ఏళ్ల వయసులో సుదీర్ఘ అనారోగ్యంతో సర్ క్లైవ్ సింక్లెయిర్ కన్నుమూశారు. వీడియో గేమ్ రారాజు మసయుకి యుయిమురా.. ప్రపంచవ్యాప్తంగా వీడియో గేమ్‌లకు ఊపు తెచ్చిన మేధావి. జపాన్‌కు చెందిన ఈ గేమింగ్ ఇంజినీర్.. ప్రఖ్యాత గేమింగ్ కంపెనీలైన నిన్టెండో ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, సూపర్ నిన్టెండో ఎంటర్టైన్మెంట్ సిస్టమ్‌లో పాపులర్ గేమ్స్ రూపకర్తగా పేరుగాంచాడు. విశేషం ఏంటంటే.. 1981లో అప్పటి నిన్టెండో అధ్యక్షుడు యమౌచీ కోరిక మేరకు క్యాట్రిడ్జ్‌లలో సైతం గేమ్‌లు ఆడేలా వీడియో గేమింగ్ వ్యవస్థను డిజైన్ చేశాడు మసయుకి. అంతేకాదు 80వ దశకంలో నిన్టెండ్ను అమెరికాలో టాప్ గేమింగ్ కంపెనీల్లో ఒకటిగా నిలిపాడు. మూడు దశాబ్దాలపాటు నిన్టెండ్తో సాగిన ఆయన అనుబంధం.. 2004తో ముగిసింది. అప్పటి నుంచి ఆయన రిట్సుమెయికన్ యూనివర్సిటీలో గేమ్ స్టడీస్ పాఠాలు చెప్తూ వచ్చారు. చివరికి.. ఈ డిసెంబర్లోనే 78 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. అడోబ్, పీడీఎఎఫ్ రూపకర్త ప్రపంచంలో అతిపెద్ద సాప్ట్వేర్ కంపెనీల లిస్ట్‌లో(300 బిలియన్ డాలర్ల) ఉంది అడోబ్. టెక్ దిగ్గజం జాన్ వార్నోక్‌తో కలిసి అడోబ్‌ను స్థాపించాడు ఛార్లెస్ మాథ్యూ గెస్చ్‌క్లె. అంతేకాదు ఈయన పోర్టబుల్ డాక్యుమెంట్ ఫైండర్ (PDF) సహ రూపకర్త కూడా. చక్ అని ముద్దుగా పిల్చుకునే ఈ అమెరికన్ టెక్ దిగ్గజం.. వార్నోక్‌తో కలిసి 1982లో అడోబ్ PostScript(ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్) ఉత్పత్తి ద్వారా డెస్క్‌టాప్ పబ్లిషింగ్ పరిశ్రమలో సంచలనానికి తెరలేపారు. ఆ తర్వాత అడోబ్ ప్రొడక్టులు సృష్టించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. 1992లో ఇద్దరు దుండగులు ఆయన్ని కిడ్నాప్ చేయగా.. ఆయన సురక్షితంగా బయటపడి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో 81 ఏళ్ల వయసులో చక్ అనారోగ్యంతో కన్నుమూశారు. టేప్ రికార్డ్.. ఆడియో క్యాసెట్ లొయు ఒటెన్స్.. డచ్ ఇంజినీర్. కానీ, పుట్టింది బెర్లిన్‌లో. క్యాసెట్ టేప్ తయారు చేసిన మహా మేధావి. అంతేకాదు సుదీర్ఘ కాలం పిలిప్స్ కంపెనీలో పని చేసిన ప్రొడక్ట్ ఇంజినీర్‌గా కూడా ఆయన పేరిట ఒక రికార్డు ఉంది. ఈ కాలంలోనే ఆయన ఎన్నో సంచలన ఆవిష్కరణలకు మూలం అయ్యాడు. పిలిప్స్ కంపెనీ నుంచి పోర్టబుల్ టేప్ రికార్డ్ మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది ఈయన హయాంలోనే. అయితే ఒట్టెన్ కెరీర్లో సంచలనం మాత్రం.. 1963(ఆగష్టు) బెర్లిన్ ఎలక్ట్రానిక్ ఫెయిర్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఆడియో క్యాసెట్ రిలీజ్ కావడం. ఆ తర్వాతే ఈ ఐడియాను జపాన్ కంపెనీలు కాపీ కొట్టాయి. అయితే ఒట్టెన్ చొరవతో ప్రపంచ మార్కెట్లో సోనీ, పిలిప్స్ క్యాసెట్లు స్టాండర్డ్ మోడల్స్‌గా నిలవగలిగాయి. డెబ్భై దశకంలో కాంపాక్ట్ డిస్క్(CD) టెక్నాలజీ డెవలప్ చేయించింది ఈయనే. ఈ ఏడాది మార్చ్‌లో ఆయన నెదర్లాండ్స్‌లోని తన స్వగృహంలో అనారోగ్యంతో కన్నుమూశారు. విలాసం టు విషాదం మెక్అఫీ యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ సృష్టికర్తగా జాన్ మెక్అఫీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంగ్లాండ్‌లో పుట్టి, అమెరికాలో పెరిగిన మెక్అఫీ.. ప్రపంచంలోనే మొట్టమొదటి కమర్షియల్ యాంటీ వైరస్‌ను(1987)లో రూపొందించాడు. తద్వారా సాఫ్ట్వేర్ ప్రపంచంలోనే ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు. అయితే ఈ లెగసీని ఆయన ఎంతో కాలం కొనసాగించలేకపోయాడు. 2011లో ఇంటెల్ కంపెనీ ఏకంగా 7.68 బిలియన్ డాలర్లు చెల్లించి.. మెక్అఫీ యాంటీ వైరస్ హక్కుల్ని కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఆయన పతనం మొదలైంది. రాసలీలలు, డ్రగ్స్, తుపాకులు.. విలాసవంతమైన జీవితానికి కేరాఫ్‌గా పేరున్న మెక్అఫీ.. టెన్నెస్సెలో పన్నుల ఎగవేత, న్యూయార్క్‌లో క్రిప్టో కరెన్సీ మోసాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు(అదనంగా ఓ హత్య కేసు విచారణ తప్పించుకునే క్రమంలో అరెస్టయ్యి).. బార్సిలోనా(స్పెయిన్) జైల్లో శిక్ష అనుభవించాడు. అయితే పన్నుల ఎగవేత నేరంపై ఆయన్ని తిరిగి అమెరికాకు అప్పగించాలని ఈ ఏడాది జూన్‌లో స్పెయిన్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో జైల్లో మగ్గిపోవడం ఇష్టం లేక అదేరోజు మెక్అఫీ (75) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -సాక్షి, వెబ్‌స్పెషల్ -
యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ సృష్టికర్త మెకఫీ ఇకలేరు
మాడ్రిడ్: యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ‘మెకఫీ’ సృష్టికర్త జాన్ మెకఫీ(75) బుధవారం స్పెయిన్ జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. బార్సిలోనా నగర సమీపంలోని జైలులో తన గదిలో మెకఫీ నిర్జీవంగా కనిపించారు. ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య సిబ్బంది ధ్రువీకరించారు. పన్నుల ఎగవేత కేసులో ఆయనను అమెరికాకు అప్పగించవచ్చని స్పెయిన్ నేషనల్ కోర్టు ఇటీవలే తీర్పునిచ్చింది. ఈ కేసులో నేరం రుజువైతే మెకఫీకి 30 ఏళ్లదాకా జైలు శిక్ష పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని అధికారులు చెప్పారు. మెకఫీ మృతిపై న్యాయ విచారణ జరపనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే, ఇందులో మెకఫీ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ 75 ఏళ్ల అమెరికా పౌరుడు, పన్నుల ఎగవేత కేసులో నిందితుడు అని పేర్కొన్నారు. అమెరికా పౌరుడైన జాన్ మెకఫీ క్రిప్టోకరెన్సీ ప్రమోటర్‌గానూ వ్యవహరించారు. -
విషాదం.. జైల్లోనే ‘మెక్అఫీ’ ఆత్మహత్య!
మరో మేధావి జీవితం విషాదంగా ముగిసింది. మెక్అఫీ యాంటీ వైరస్ సృష్టికర్త జాన్ మెక్అఫీ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అమెరికాలో పన్నుల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న మెక్అఫీ.. కిందటి ఏడాది అక్టోబర్ నుంచిస్పెయిన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. బుధవారం ఆయన తన గదిలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. బార్సిలోనా: డెబ్భై ఐదేళ్ల మెక్అఫీ.. అమెరికన్ టెక్నాలజీ ఎంట్రెప్రెన్యూర్‌గా పేరుగాంచాడు. 80వ దశకంలో యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ మెక్ అఫీని కనిపెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడాయన. అయితే టెన్నెస్సెలో పన్నుల ఎగవేత, న్యూయార్క్‌లో క్రిప్టో కరెన్సీ మోసాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి.ఈ ఆరోపణల కేసులో అమెరికా నుంచి పారిపోయిన ఆయన్ని.. కిందటి ఏడాది అక్టోబర్‌లో స్పెయిన్ పోలీసులు అరెస్ట్ చేసి బార్సిలోనా జైలుకి తరలించారు. ఇక పన్నుల ఎగవేత ఆరోపణల కేసులో మెక్అఫీని అమెరికాకు అప్పగించే స్పెయిన్ కోర్టు బుధవారం నాడే కీలక తీర్పు వెలువరించింది. ఆయన్ని అమెరికాకు అప్పగించాలని స్పెయిన్ పోలీసులను ఆదేశించింది. ఈ తరుణంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ‘అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉన్నా.. జైల్లో మగ్గేందుకు ఆయన మనసు అంగీకరించలేదు. సొసైటీ ఆయన మీద పగ పట్టింది’ అని ఆయన తరపు లాయర్ జవెయిర్ మీడియా ముందు భావోద్వేగంగా మాట్లాడాడు. 2011లో తన కంపెనీని ఇంటెల్‌కు అమ్మిన మెక్అఫీ.. ఆ తర్వాత వ్యాపారాలకు దూరంగా ఉంటూ విలాసవంతమైన జీవితం అనుభవిస్తూ వచ్చాడు. లోగడ తాను 48 మంది పిల్లలకు తండ్రి చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు. 2012లో పొరుగింటి వ్యక్తి హత్య కేసులో పోలీసుల ఎంక్వైరీ నుంచి తప్పించుకునేందుకు పారిపోయాడు. తన సిద్ధాంతాలకు విరుద్ధంగా పన్నులు కట్టలేనని చెబుతూ.. కొన్ని ఏళ్లపాటు పన్నులు చెల్లించలేదు. ఒకానొక టైంలో క్యూబా సాయంతో అమెరికా అధ్యక్ష బరిలో పోటీ చేయాలనుకున్నా.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ట్విటర్లో ఆయన ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఒక మేధావి జీవితం ఇలా విషాదంగా ముగియడంపై ఆయన అభిమానులు కలత చెందుతున్నారు. చదవండి: ఒకప్పుడు విజేత.. ఇప్పుడు అవమానంతో వీడ్కోలు -
ఈ 8 యాప్స్ వెంటనే డిలిట్ చేయండి!
ప్రస్తుతం ప్రతీ ఒక్కరి అరచేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. వీరు తమ ఒక్కరూ తమ అవసరాల కోసం కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేస్తుంటారు. గూగుల్ ప్లేస్టోర్‌లో నుంచి డౌన్లోడ్ చేసే యాప్స్‌లో ఉపయోగపడేవి ఎన్ని ఉన్నాయో, యూజర్లకు హాని చేసేవి కూడా అన్నే ఉన్నాయి. వాటినే మాల్వేర్, యాడ్వేర్ యాప్స్ అంటారు. ఇలాంటి యాప్స్‌ని గుర్తించి గూగుల్ తొలగిస్తుంది. అలాగే, ప్రైవేట్ సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థలు కూడా మాల్వేర్ యాప్స్ లిస్ట్ రిలీజ్ చేస్తుంటాయి. వాటిని కూడా గూగుల్ తొలగిస్తూ ఉంటుంది. తాజాగా మెకాఫీ మొబైల్ రీసెర్చ్ సంస్థ మాల్వేర్ ఉన్న 8 ఆండ్రాయిడ్ యాప్స్‌ని గుర్తించి వాటి జాబితాను విడుదల చేసింది. ఆగ్నేయాసియా, అరేబియన్ పెనిన్సులా ప్రాంతాలకు చెందిన యూజర్స్‌ని ఎక్కువగా ఈ యాప్స్ టార్గెట్ చేసినట్టు తెలిపింది. మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఈ యాప్ లను 7,00,00 కంటే ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఫోటో ఎడిటర్స్, వాల్‌పేపర్స్, పజిల్స్, కీబోర్డ్ స్కిన్స్, కెమెరా యాప్స్ పేరుతో ఇవి యూజర్లను టార్గెట్ చేస్తున్నాయి. మొదట గూగుల్ పరిశోదన సమయంలో వీరు మొదట క్లీన్ వర్షన్‌ని గూగుల్ ప్లే స్టోర్‌కు సమర్పించి, ఆ తర్వాత అప్డేట్స్ రూపంలో మాల్వేర్ ప్రవేశపెట్టినట్లు మెకాఫీ మొబైల్ రీసెర్చ్ పరిశోధనలో తేలింది. ఈ క్రింద పేర్కొన్న యాప్స్ ను వెంటనే డిలీట్ చేసుకోవాలని మెకాఫీ సూచిస్తుంది. మాల్వేర్ యాప్స్: com.studio.keypaper2021 com.pip.editor.digital camera org.my.favorites.up.keypaper com.tremendous.coloration.hairdryer com.ce1ab3.app.picture.editor com.hit.digital camera.pip com.daynight.keyboard.wallpaper Com.tremendous.star.ringtones చదవండి: Flipkart: ఆర్డర్ చేసిన గంటన్నరలో ప్రొడక్ట్ డెలివరీ -
ధోని, సచిన్ తర్వాతే.. గౌతమ్, సన్నీ లియోన్
హైదరాబాద్: భారత క్రికెట్లో ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ తమ ఆటతోపాటు అంతకుమించి గొప్ప మనసుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ దిగ్గజాలకు సంబంధించిన సమాచారం కోసం ఫ్యాన్స్ ఇంటర్నెట్లో తెగ వెతుకుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఓ సమస్య వచ్చిపడింది. వీరికోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నప్పుడు నకిలీ లింకులు దర్శనమిస్తున్నాయి. ఇంటర్నెట్ వాడకంపై అంతగా అవగాహన లేనివారు ఆ లింక్‌లపై క్లిక్ చేసి ప్రమాదంలో పడుతున్నారు. ధోని, సచిన్‌ల గురించి సెర్చ్ చేసినప్పుడు ఎక్కువగా మాలీసియస్ వెబ్సైట్లకు లింకులు రీడైరెక్ట్ అవుతున్నాయని తాజాగా ప్రముఖ యాంటీ వైరస్ సంస్థ మెకాఫీ వెల్లడించింది. ‘నెటిజన్లు ఎక్కువగా క్రీడలు, సినిమాలు, టీవీ షోల గురించి వెతుకుతుంటారు. అంతేకాకుండా తాము అభిమానించే సెలబ్రెటీల ఫోటోలు, వీడియోలకోసం ఎక్కువగా సెర్చ్ చేస్తారు. ఇదే అదనుగా భావించిన సైబర్ నేరగాళ్లు నకిలీ లింక్‌లను క్రియేట్ చేసి వారిని ఆకర్షించేలా చేస్తున్నారు. అవి ఓపెన్ చేస్తే అశ్లీల, ప్రమాదకర వెబ్సైట్లు ఓపెన్ అవుతాయి. ఇలా ఓపెన్ చేయడంతో కొన్ని సార్లు వారి మొబైల్/కంప్యూటర్ వైరస్/హ్యాక్‌కు గురవుతున్నాయి. దీంతో నెటిజన్లు జాగ్రత్తగా ఉండాలి’ అని మెకాఫీ వివరించింది. అయితే మెకాఫీ రూపోందించిన జాబితా ప్రకారం ప్రమాదకరమైన సెలబ్రెటీల జాబితాలో ఓవరాల్‌గా ధోని, సచిన్‌లు అగ్రస్థానంలో ఉన్నారు. వీరి తర్వాత హిందీ బిగ్‌బాస్-8 విన్నర్ గౌతమ్ గులాటీ, బాలీవుడ్ బోల్డ్ నటి సన్నీ లియోన్, రాధికా ఆప్టే, శ్రధ్దా కపూర్, పీవీ సింధు, హర్మన్‌ప్రీత్ కౌర్, క్రిస్టియానో రొనాల్డోలు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
కోలీవుడ్ లో సమంత రికార్డ్
అభిమానుల మనస్సును చూరగొన్న సమంత ఈ ఏడాది కోలీవుడ్ మోస్ట్ సెన్షేషనల్ సెలబ్రిటీగా నిలిచారు. ప్రముఖ మెకాఫే సంస్థ ఏటా కోలివుడ్ నటీనటులపై ఆన్ లైన్ సర్వే నిర్వహిస్తూ అభిమానుల ఇష్టాఇష్టాలను వెల్లడిస్తోంది. అందులో భాగంగా 11వ వార్షిక మెకాఫే మోస్ట్ సెన్షేషనల్ సెలబ్రిటీస్ 2017 సర్వేను చేపట్టి వివరాలను వెల్లడించింది. అందులో తమిళ నటుల్లో సంచలన సెలబ్రిటీగా 8.89 శాతంతో ప్రథమ స్థానంలో సమంతా నిలిచారు. జీవా (8.61శాతం), తాప్సీ(7.78శాతం), శివకార్తికేయన్ (7.50శాతం), ధనుష్(7.36) తరువాతి వరుస స్థానాల్లో నిలిచినట్లు మెకాఫే ఆర్ అండ్ డీ ఆపరేషన్స్ హెడ్ వెంకట్ కృష్ణపూర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది మెకాఫే సర్వేలో ప్రథమ స్థానంలో నిలిచిన నిక్కీ గల్రాణీ స్థానాన్ని ఈ ఏడాది సమంతా దక్కించుకుంది. -
వీళ్లిద్దరూ యమ డేంజర్!
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): సెర్చ్ ఇంజన్లో సెలబ్రిటీ పేర్ల సెర్చింగ్‌లో అత్యంత హానికారక వెబ్‌సైట్స్‌లోకి వెళ్లేందుకు కారణమయ్యే సెన్సేషనల్ సెలబ్రిటీ ప్రభు అని మెకాఫె వెల్లడించింది. ప్రపంచస్థాయి సైబర్ సెక్యూరిటీ కంపెనీలో ఒకటైన మెకాఫె... సెలబ్రిటీల పేర్ల మీద అందుబాటులో ఉన్న సైట్లు అవి ఎంత వరకూ సురక్షితం అనేదానిపై ఏటేగా అధ్యయనం చేసి ర్యాంకుల ద్వారా వెల్లడిస్తుంది. అదే క్రమంలో ఈ ఏడాది దక్షిణాదిలో ప్రముఖ నటుడైన ప్రభు (తమిళ నటుడు) పేరు తొలిస్థానంలో వచ్చిందని, రెండో స్థానంలో ప్రభాస్, మూడోస్థానంలో రానా దగ్గుబాటి నిలిచారని సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వీరి కోసం ఆన్లైన్లో వెతికెటప్పుడు అప్రమత్తంగా ఉండాలని నెటిజన్లకు సూచించింది. దేశం మొత్తం మీద తీసుకుంటే స్టార్ కమెడియన్ కపిల్ శర్మ ఈ ఏడాది అత్యంత ప్రమాదకరమైన ఆన్లైన్ సెలబ్రిటీగా నిలిచారు. ఎందుకంటే ఆయన పేరుతో సెర్చ్ ఇంజిన్లలో వెతికితే 9.58 శాతం హానికర వెబ్‌సైట్స్‌లోకి వెళ్తున్నాయని మెకాఫె తెలిపింది. కపిల్ తర్వాత సల్మాన్ ఖాన్ రెండో స్థానంలో, ఆమిర్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నారు. 8.75 శాతంతో ప్రియాంక చోప్రా నాలుగో స్థానంలో ఉన్నారు. -
బి అవేర్: కపిల్ శర్మ చాలా డేంజర్
కపిల్ శర్మ.. ప్రముఖ భారతీయ స్టాండప్ కమెడీయన్‌గా, నటుడిగా, టివి వ్యాఖ్యాతగా, నిర్మాతగా చాలా సుపరిచితం. భారత అతిపెద్ద కామెడీ షో కామెడీ నైట్స్ విత్ కపిల్‌తో ఆయన పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. అంత పెద్ద సెలబ్రిటీ అయిన కపిల్ శర్మ మాత్రం తన అభిమానులకు చాలా ప్రమాదకరమట. కపిల్ శర్మ మీకు ప్రమాదకరమంటూ ఆయన అభిమానులను సైబర్ సెక్యురిటీ సంస్థ మెకాఫీ హెచ్చరిస్తోంది. అసలు ఆయనెందుకు డేంజరో తెలుసా? కపిల్ శర్మ గురించి ఆన్లైన్లో సెర్చ్ చేసేటప్పుడు అనుమానిత లింకులు, ప్రమాదకర వెబ్సైట్లు, మాల్వేర్ వంటివి వెలుగు చూస్తున్నాయని మెకాఫీ తెలిపింది. 2017లో కపిల్ శర్మనే 'రిస్కీస్ట్ సెలబ్రిటీ సెర్చ్డ్ ఆన్లైన్'గా నిలిచినట్టు వెల్లడించింది. ఇటీవల కాలంలో డిజిటల్ ప్రపంచం ఎక్కువగా పెరుగుతుండటంతో, అభిమానులు తమకు నచ్చిన సెలబ్రిటీ గురించి తెలుసుకోవాలంటే ఆన్లైన్నే ఆశ్రయిస్తున్నారు. ఇలా సెర్చ్ చేసేటప్పుడు అనుమానిత లింక్‌లను క్లిక్ చేయాల్సి వస్తుందని, వాటివల్ల ఏర్పడే ప్రమాదాన్ని మెకాఫీ వెల్లడించింది. సోనాక్షి సిన్హాను వెనక్కి నెట్టేసి మెకాఫీ మోస్ట్ సెన్సేషనల్ సెలబ్రిటీల జాబితా 2017లో తొలి స్థానంలో శర్మ నిలిచారు. శర్మ గురించి ఆన్లైన్లో వెతికేటప్పుడు 9.58 శాతం ప్రమాదకర వెబ్సైట్లోకి వెళ్తున్నారని పేర్కొన్నారు. కపిల్ తర్వాత సల్మాన్ ఖాన్ రెండో స్థానంలో, అమీర్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నారు. 8.75 శాతం ప్రమాదకరంతో ప్రియాంక చోప్రా నాలుగో స్థానంలోకి ఎగిశారు. గతేడాది ఆమె ఏడో స్థానంలో ఉండేవారు. కపిల్ శర్మ కామెడీ షోలు కావాలంటే, అధికారిక ప్రసారాలు వచ్చేంత వరకు వేచిచూడాలని లేదా టెలివిజన్, అధికారిక వెబ్సైట్లలో మరోసారి ప్రసారం చేస్తారని మెకాఫీ ఆర్ అండ్ డీ ఆపరేషన్ల అధినేత వెంకట్ క్రిష్ణపుర్ చెప్పారు. థర్డ్ పార్టీల ద్వారా సందర్శిస్తే మాల్వేర్ చొచ్చుకుని వచ్చే ప్రమాదముందన్నారు. -
ప్రపంచంలో అత్యంత సెక్యూర్డ్ ఫోన్
న్యూఢిల్లీ: నేడు ప్రపంచం స్మార్ట్‌ఫోన్ రూపంలో అరచేతిలో ఉంది. మనం వాడే ఫోన్లకు తరచూ వైరస్ ఎటాక్ అవటం, డేటా నష్టపోవడం జరుగుతుంది. ఇప్పుడు వీటిగురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వీటన్నింటికి సరైన సమాధానం కోరుకునేవారికి ఓ గుడ్‌న్యూస్. ప్రముఖ యాంటీవైరస్ సంస్థ మెకాఫీ ఓ సరికొత్త ఫోన్ ను ఆవిష్కరిస్తోంది. ఫోన్ డేటాకు కట్టుదిట్టమైన రక్షణ కోరుకునే వారికి ఇది చాలా ప్రత్యేకం. ఈ ఏడాది చివరకు ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. జాన్ మెకాఫీ ఫ్రైవసీ ఫోన్‌గా దీనికి పేరుపెట్టారు. మన ఫోన్లోని ఉండే వైఫై, ఇంటర్నెట్ కనెక్షన్, బ్లూటూత్‌లను డిసేబుల్ చేసినా కుడా కొన్నిసార్లు హ్యాకర్లు వీటిని అడ్డుకొని ఫోన్లోని డేటాని తస్కరిస్తారు. ఈ నేపథ్యంలో మెకాఫీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బ్యాటరీ, వైఫై, బ్లూటూత్, కెమెరా, జీపీఎస్‌లకు ప్రత్యేకంగా బటన్లను ఏర్పాటు చేయబోతోంది. ఫోన్లపై నిఘాపెట్టే ప్రత్యేక పరికరాలను కూడా అడ్డుకుంటుంది. దీనిధర సుమారు రూ. 70,000 వరకూ ఉండొచ్చని అంచనా. -
ఆ ఐటీ కంపెనీలో కొత్త ఉద్యోగాలు
న్యూఢిల్లీ : ఐటీ కంపెనీల్లో నెలకొన్న ప్రతిష్టంభనకు కొత్త ఉద్యోగాలు వస్తాయో రావో అంటూ టెక్కీలు పడుతున్న ఆందోళనకు ఐటీ సెక్యురిటీ సంస్థ మెకాఫీ తీపి కబురు అందించింది. తన బెంగళూరు ఐటీ సెంటర్లో ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలని యోచిస్తున్నట్టు ఈ కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అంతేకాక స్థానిక బిజినెస్‌లను మరింత పెంచుకోవడానికి ఇండియాలో పెట్టుబడులను కొనసాగిస్తామని చెప్పారు. గ్లోబల్ చిప్ మేకర్ ఇంటెల్ గత ఏడాది సెప్టెంబర్ లోనే 51 శాతం షేరుతో ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ టీపీజీతో కలిసి మెకాఫీని ఓ ప్రత్యేక సంస్థగా రూపొందించింది. ఈ డీల్ 2017 రెండో క్వార్టర్లో ముగియనుంది. ''ప్రపంచంలో మాకున్న పెద్ద సైట్లలో బెంగళూరు ఒకటి. దానిలో పెట్టుబడులు కొనసాగిస్తాం. అక్కడ కొత్త కార్యకలాపాలను ప్రారంభిస్తాం'' అని ఇంటెల్ సెక్యురిటీ జనరల్ మేనేజర్ యంగ్ చెప్పారు. ఇంటెల్ కింద ఉన్నప్పుడు అది ప్రాథమిక అభివృద్ధి సంస్థగా ఉండేది. కానీ ప్రస్తుతం ఫైనాన్స్, ఐటీ, హెచ్ఆర్ వంటి కొత్త సైట్లను ఏర్పాటుచేసి, కొత్త యూనిట్ కు మద్దతిస్తామని వెల్లడించారు. అయితే ఎన్ని ఉద్యోగాలు సృష్టించబోతున్నారో ఆయన తెలుపలేదు. కొత్త ఉద్యోగాలు వస్తాయని మాత్రమే యంగ్ చెప్పారు. మెకాఫీ, ఇంటెల్ సెక్యురిటీ గ్రూప్ లో ఓ భాగం. 2016 నాటికి ఏడాదికి ఏడాది ఈ కంపెనీ 20 శాతం వృద్ధిని నమోదుచేస్తోంది. 2011లో మెకాఫీని ఇంటెల్ కొనుగోలు చేసింది. -
ప్రమాదకరమైన సైబర్ సెలబ్రిటీగా హాస్యనటుడు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ హాస్యనటుడు, హోస్ట్ జిమ్మీ కిమెల్... ప్రమాదకరమైన సైబర్ సెలబ్రిటీగా నిలిచాడు. కంప్యూటర్ సెక్యూరిటీ కంపెనీ మెక్ ఆఫీ- డేంజరస్ సైబర్ సెలబ్రిటీ 2014 జాబితాలో జిమ్మీ కిమెల్ అగ్రస్థానంలో నిలిచాడు. జిమ్మీ కిమెల్ కోసం ఆన్లైన్ లో ఐదుసార్లు వెదికితే అందులో ఒకసారి వైరస్ వ్యాపించే అవకాశముందని గుర్తించినట్టు మెక్ ఆఫీ తెలిపింది. ఆయన పేరుతో వైరస్ ముప్పు 19 శాతం అధికమని పేర్కొంది. గత ఎనిమిదేళ్లుగా డేంజరస్ సైబర్ సెలబ్రిటీ జాబితాను రూపొందిస్తోంది. -
మహేష్ పేరుతో ముప్పు!
'ప్రతివాడికి నా పేరుతోనే ప్రాబ్లమా?' అంటాడు ఖలేజా సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు. అవును నిజంగానే ఈ అందగాడి పేరుతో ప్రాబ్లం ఉంది(ట). అసలు మహేష్ పేరు చెబితే చాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోగా వెలుగొందున్న మహేష్ బ్రాండ్ విలువ ఇతర హీరోల కంటే ఎక్కువే. ఆయన చేస్తున్న వాణిజ్య ప్రకటనలే ఇందుకు నిదర్శనం. ఇక మహేష్ పేరు చుట్టూ తిరిగిన సినిమాలు లేకపోలేదు. 'మహేష్' పేరుతోనే రేపు ఓ సినిమా విడుదల కాబోతోంది. 'దూకుడు' నుంచి మహేష్ మానియా కొనసాగుతోంది. ఆయన పేరు బ్రాండ్‌గా చెలామణి అవుతోంది. అయితే మహేష్ పేరుతో ప్రమాదం కూడా పొంచివుంది అంటోంది సెక్యురిటీ టెక్నాలజీ కంపెనీ అయిన మెక్ ఆఫీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ మహేష్ అని తేల్చింది. మెక్ ఆఫీ జరిపిన అధ్యయనంలో ఈ విషయం రుజువయింది. సెలబ్రిటీల పేరుతో సైబర్ స్పేస్‌లో కలిగిస్తున్న నష్టాన్ని బట్టి ఈ అంచనా వేసింది. ప్రముఖుల పేరుతో వైరస్ వ్యాపింపజేయడం ఇంటర్నెట్లో ఇటీవల బాగా ఎక్కువయింది. ఆ మధ్య అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ పేరుతో ఇ-మెయిల్స్‌కు వైరస్లు పంపిన విషయం మనకు తెలిసిందే. ఈ విషయంలో మహేష్ బాబు ఇండియాలో రెండో స్థానంలో ఉన్నారని మెక్ ఆఫీ అధ్యయనం వెల్లడించింది. సైబర్ స్పేస్‌లో నష్టం కలిగించేందుకు హ్యాకర్లు ఎక్కువగా మహేష్ పేరును వాడుకుంటున్నారని వివరించింది. సినిమా సెలబ్రిటీల పేర్లకు కంప్యూటర్లకు నష్టం కలిగించే సమాచారాన్ని జోడించి ఇంటర్నెట్లో వదులున్నారని తెలిపింది. మహేష్ బాబుతో పాటు పలువురు అగ్రహీరోలు, హీరోయిన్ల పేర్లతో ఆన్లైన్లో ముప్పు పొంచివుందని మెక్ ఆఫీ హెచ్చరించింది. దీనికి సంబంధించిన టాప్ టెన్ జాబితాను ప్రకటించింది. రామ్ చరణ్(2), పవన్ కళ్యాణ్(3), జూనియర్ ఎన్టీఆర్(6), అల్లు అర్జున్(7) ఈ లిస్ట్‌లో ఉన్న మిగతా హీరోలు. హీరోయిన్లు అంజలి(4), ఇలియానా(5), అమలాపాల్(8), కాజల్ అగర్వాల్(10) కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆశ్చర్యకరంగా మహేష్ సరసన నేనొక్కడినే..1లో నటిస్తున్న కృతి సనన్ ఈ లిస్ట్‌లో 9 స్థానంలో నిలిచింది. అభిమానించే హీరో పేర్లతో ఆనందమే కాదు హాని కూడా పొంచివుందని మెక్ ఆఫీ అధ్యయం తేటతెల్లం చేసింది. -
'మోస్ట్ డేంజరస్' జాబితాలో మహేశ్ బాబు!
టాలీవుడ్లో నెంబర్‌వన్ హీరో ఎవరు? ఈ విషయంలో ఏకాభిప్రాయం రావడం కష్టమే. ఎందుకంటే మా హీరోనే గొప్పంటూ అభిమానులు గోల చేస్తారు. అయితే తెలుగు సినిమాల్లో అత్యంత డేంజర్ సెలెబ్రిటి మాత్రం ప్రిన్స్ మహేశ్ బాబునేనట. దేశంలో ఎక్కువ మంది ఇష్టపడ్డ రెండో వ్యక్తి కూడా అతనే. ప్రపంచంలో అతిపెద్ద సెక్యూరిటీ టెక్నాలజీ కంపెనీ మెకాఫీ పరిశోధనలో ఈ విషయం తేలింది. 2003 ఏడాదిలో స్పోర్ట్స్, రాజకీయాలు, సినిమా రంగాలకు చెందిన అత్యంత ప్రముఖులపై మెకాఫీ అధ్యయనం నిర్వహించింది. సైబర్ క్రిమినల్స్ తమకు కావాల్సిన సమాచారాన్ని సంగ్రహించేందుకు సెలెబ్రిటీల పేర్లను ఉపయోగించుకుంటున్నట్టు మెకాఫీ వెల్లడించింది. ఇందులో హీరోల అభిమానుల్నికూడా వాడుకుంటున్నారు. అపరిచితుల్ని ఎరగా వేసి పాస్వర్డ్లు, కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇక ప్రముఖుల చిత్రాలు, వీడియోలు, నగ్న చిత్రాలు చూడటానికి ఎక్కువ మంది మొగ్గు చూపినట్టు పరిశోధనలో వెల్లడైంది. 'భారత్‌లో సెలెబ్రిటీలను దేవుళ్ల మాదిరిగా ఆరాధిస్తారు. సైబర్ క్రిమినల్స్ మోసాలు చేయడానికి వారి పేర్లను వాడుకుంటున్నారు' అని మెకేఫీ ఇండియా సెంటర్ ఇంజనీరింగ్-కంజూమర్, మొబైల్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ వెంకట సుబ్రమణ్యం చెప్పారు. మహేశ్ బాబు నటిస్తున్న వన్ (నేనొక్కడినే) చిత్రం ట్రైలర్‌ను రెండు లక్షల మందికి పైగా వీక్షించారని ఈ అధ్యయనంలో తేలింది. ఇక మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజకు రెండో ర్యాంక్ దక్కింది. వన్ ట్రైలర్ తర్వాత రామ్‌చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటించిన బాలీవుడ్ సినిమా 'జంజీర్'ను చూడటానికి నెటిజెన్లు ఎక్కువగా ఇష్టపడ్డారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'గబ్బర్‌సింగ్'కు మూడో ర్యాంక్ లభించింది. ఈ చిత్రం వీడియోలతో పాటు పవన్ వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు ఎక్కువగా మక్కువ చూపారు. కాగా జూనియర్ ఎన్టీయార్, అల్లు అర్జున్‌లు వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు.