అభిమానుల మనస్సును చూరగొన్న సమంత ఈ ఏడాది కోలీవుడ్ మోస్ట్ సెన్షేషనల్ సెలబ్రిటీగా నిలిచారు. ప్రముఖ మెకాఫే సంస్థ ఏటా కోలివుడ్ నటీనటులపై ఆన్ లైన్ సర్వే నిర్వహిస్తూ అభిమానుల ఇష్టాఇష్టాలను వెల్లడిస్తోంది. అందులో భాగంగా 11వ వార్షిక మెకాఫే మోస్ట్ సెన్షేషనల్ సెలబ్రిటీస్ 2017 సర్వేను చేపట్టి వివరాలను వెల్లడించింది. అందులో తమిళ నటుల్లో సంచలన సెలబ్రిటీగా 8.89 శాతంతో ప్రథమ స్థానంలో సమంతా నిలిచారు.
జీవా (8.61శాతం), తాప్సీ(7.78శాతం), శివకార్తికేయన్ (7.50శాతం), ధనుష్(7.36) తరువాతి వరుస స్థానాల్లో నిలిచినట్లు మెకాఫే ఆర్ అండ్ డీ ఆపరేషన్స్ హెడ్ వెంకట్ కృష్ణపూర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గతేడాది మెకాఫే సర్వేలో ప్రథమ స్థానంలో నిలిచిన నిక్కీ గల్రాణీ స్థానాన్ని ఈ ఏడాది సమంతా దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment