ప్రపంచంలో అత్యంత సెక్యూర్డ్ ఫోన్
న్యూఢిల్లీ: నేడు ప్రపంచం స్మార్ట్‌ఫోన్ రూపంలో అరచేతిలో ఉంది. మనం వాడే ఫోన్‌లకు తరచూ వైరస్ ఎటాక్ అవటం, డేటా నష్టపోవడం జరుగుతుంది. ఇప్పుడు వీటిగురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వీటన్నింటికి సరైన సమాధానం కోరుకునేవారికి ఓ గుడ్‌న్యూస్. ప్రముఖ యాంటీవైరస్ సంస్థ మెకాఫీ ఓ సరికొత్త ఫోన్ ను ఆవిష్కరిస్తోంది. ఫోన్ డేటాకు కట్టుదిట్టమైన రక్షణ కోరుకునే వారికి ఇది చాలా ప్రత్యేకం. ఈ ఏడాది చివరకు ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.
జాన్ మెకాఫీ ఫ్రైవసీ ఫోన్‌గా దీనికి పేరుపెట్టారు. మన ఫోన్‌లోని ఉండే వైఫై, ఇంటర్నెట్ కనెక్షన్, బ్లూటూత్‌లను డిసేబుల్ చేసినా కుడా కొన్నిసార్లు హ్యాకర్లు వీటిని అడ్డుకొని ఫోన్‌లోని డేటాని తస్కరిస్తారు. ఈ నేపథ్యంలో మెకాఫీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బ్యాటరీ, వైఫై, బ్లూటూత్, కెమెరా, జీపీఎస్‌లకు ప్రత్యేకంగా బటన్లను ఏర్పాటు చేయబోతోంది. ఫోన్‌లపై నిఘాపెట్టే ప్రత్యేక పరికరాలను కూడా అడ్డుకుంటుంది. దీనిధర సుమారు రూ. 70,000 వరకూ ఉండొచ్చని అంచనా.