సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): సెర్చ్ ఇంజన్‌లో సెలబ్రిటీ పేర్ల సెర్చింగ్‌లో అత్యంత హానికారక వెబ్‌సైట్స్‌లోకి వెళ్లేందుకు కారణమయ్యే సెన్సేషనల్ సెలబ్రిటీ ప్రభు అని మెకాఫె వెల్లడించింది. ప్రపంచస్థాయి సైబర్ సెక్యూరిటీ కంపెనీలో ఒకటైన మెకాఫె... సెలబ్రిటీల పేర్ల మీద అందుబాటులో ఉన్న సైట్లు అవి ఎంత వరకూ సురక్షితం అనేదానిపై ఏటేగా అధ్యయనం చేసి ర్యాంకుల ద్వారా వెల్లడిస్తుంది. అదే క్రమంలో ఈ ఏడాది దక్షిణాదిలో ప్రముఖ నటుడైన ప్రభు (తమిళ నటుడు) పేరు తొలిస్థానంలో వచ్చిందని, రెండో స్థానంలో ప్రభాస్, మూడోస్థానంలో రానా దగ్గుబాటి నిలిచారని సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వీరి కోసం ఆన్‌లైన్‌లో వెతికెటప్పుడు అప్రమత్తంగా ఉండాలని నెటిజన్లకు సూచించింది.
దేశం మొత్తం మీద తీసుకుంటే స్టార్ కమెడియన్ కపిల్ శర్మ ఈ ఏడాది అత్యంత ప్రమాదకరమైన ఆన్‌లైన్ సెలబ్రిటీగా నిలిచారు. ఎందుకంటే ఆయన పేరుతో సెర్చ్ ఇంజిన్లలో వెతికితే 9.58 శాతం హానికర వెబ్‌సైట్స్‌లోకి వెళ్తున్నాయని మెకాఫె తెలిపింది. కపిల్ తర్వాత సల్మాన్ ఖాన్ రెండో స్థానంలో, ఆమిర్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నారు. 8.75 శాతంతో ప్రియాంక చోప్రా నాలుగో స్థానంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment