
రచయిత్రి, ప్రముఖ ఆదర్శ మూర్తి 'సుధామూర్తి' (Sudha Murthy) గత కొంత కాలంగా తన ప్రేమ గురించి, పారిశ్రామిక వేత్త భర్తగా ఉంటే భార్య ఎలా నడుచుకోవాలి అనే చాలా వివరాలు వెల్లడించింది. కాగా ఇప్పుడు తాను ఎలాంటి ఆహారం తీసుకుంటుంది, నాన్‌వెజ్ ఫుడ్ ఐటెమ్స్ ఏమైనా ఇష్టపడుతుందా అనే వివరాలు తెలిపింది.
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి ఖానే మే కౌన్ హై (Khaane Mein Kaun Hai) ఎపిసోడ్‌లో మాట్లాడుతూ.. తాను ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పుకొచ్చింది. ఇండియాలో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా తన ఫుడ్ తానే తీసుకెళుతుందని వెల్లడించింది.
శాఖాహారానికి, మాంసాహారానికి ఒకే చెంచా ఉపయోగించడం తనకు నచ్చదని.. ఆఖరికి గుడ్లు, వెల్లులి కూడా తినదని తెలిపింది. విదేశాలకు వెళ్ళినప్పుడు వెజిటేరియన్ రెస్టారెంట్ కోసం వెతుకుతానని, ముందు జాగ్రత్తగా తన హ్యాండ్ బ్యాగ్ నిండుగా తినుబండారాలను తీసుకెళ్తానని కూడా చెప్పింది. తన వద్ద కుకింగ్ బ్యాగ్ కూడా ఉందని, అందులో ఆహారాన్ని వండడానికి ఉపయోగించే చిన్న కుక్కర్ ఉంటుందని చెప్పారు.
(ఇదీ చదవండి: సుధామూర్తిని ఏడిపించిన అలియా భట్.. కారణం ఇదే!)
కొన్ని సంవత్సరాల క్రితం సుధామూర్తి తన అమ్మమ్మతో.. మీరు ప్రయాణం చేసేటప్పుడు ఎందుకు మీ తినుబండారాలను మీతో తీసుకెళ్లకూడదు, బయట ఎందుకు తింటారు అని సరదాగా అడిగిందని.. చివరకు ఆ విధానాన్నే నేను అనుసరిస్తున్నానని సుధామూర్తి చెప్పింది. కావున ఇప్పుడు ఏ దేశానికీ వెళ్లినా దాదాపు తన ఫుడ్ తానే తీసుకెళుతుందని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment