Viral Video: ఒళ్లు గగుర్పొడిచే సీన్‌.. ట్రైన్ చక్రాల కింద వేలాడుతూ 250 కి.మీ. జర్నీ | Man Hangs Under Train To Travel 250 Km From Itarsi To Jabalpur | Sakshi
Sakshi News home page

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే సీన్‌.. ట్రైన్ చక్రాల కింద వేలాడుతూ 250 కి.మీ. జర్నీ

Published Fri, Dec 27 2024 8:53 PM | Last Updated on Fri, Dec 27 2024 9:03 PM

Man Hangs Under Train To Travel 250 Km From Itarsi To Jabalpur

నమ్మండి నమ్మకపోండి.. ఇది నిజంగానే ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. రైలు చక్రాల మధ్య వేలాడుతూ ఓ వ్యక్తి చేసిన ప్రయాణం మామూలుగా లేదు. మధ్యప్రదేశ్‌లోని దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ కింద దాక్కున్న ఓ వ్యక్తి.. ఇటార్సీ నుండి జబల్‌పూర్ వరకు దాదాపు 250 కిలోమీటర్లు రైలు బోగీ చక్రాల మధ్య వేలాడుతూ ప్రయాణించడం షాక్‌కు గురిచేస్తోంది. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జబల్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు రోలింగ్ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో S-4 కోచ్ కింద ఈ వ్యక్తిని గుర్తించారు.

అతడిని ఆ పరిస్థితిలో చూసిన సిబ్బంది అశ్చర్యానికి గురై వెంటనే. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులకు సమాచారం అందించగా, అతనిని బోగీ కింద చక్రాల మధ్య నుంచి బలవంతంగా బయటకు తీసి అదుపులోకి తీసుకున్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి రైలుకు కింద వేలాడుతూ ప్రయాణించినట్లు స్పష్టమవుతోంది.

అధికారుల విచారణలో ఆ వ్యక్తి టిక్కెట్‌ కొనడానికి డబ్బులు లేవని.. అందువలనే ప్రయాణం కోసం ఈ రిస్క్‌ చేసినట్లు తెలిపాడు. ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా వివరాలు వెల్లడి కాలేదు. ఆ వ్యక్తి రైలు కింద ఎలా దాక్కున్నాడో కూడా అస్పష్టంగానే ఉంది. ప్రస్తుతం ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement