Itarsi
-
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే సీన్.. ట్రైన్ చక్రాల కింద వేలాడుతూ 250 కి.మీ. జర్నీ
నమ్మండి నమ్మకపోండి.. ఇది నిజంగానే ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. రైలు చక్రాల మధ్య వేలాడుతూ ఓ వ్యక్తి చేసిన ప్రయాణం మామూలుగా లేదు. మధ్యప్రదేశ్‌లోని దానాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ కింద దాక్కున్న ఓ వ్యక్తి.. ఇటార్సీ నుండి జబల్పూర్ వరకు దాదాపు 250 కిలోమీటర్లు రైలు బోగీ చక్రాల మధ్య వేలాడుతూ ప్రయాణించడం షాక్‌కు గురిచేస్తోంది. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జబల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు రోలింగ్ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో S-4 కోచ్ కింద ఈ వ్యక్తిని గుర్తించారు.అతడిని ఆ పరిస్థితిలో చూసిన సిబ్బంది అశ్చర్యానికి గురై వెంటనే. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులకు సమాచారం అందించగా, అతనిని బోగీ కింద చక్రాల మధ్య నుంచి బలవంతంగా బయటకు తీసి అదుపులోకి తీసుకున్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి రైలుకు కింద వేలాడుతూ ప్రయాణించినట్లు స్పష్టమవుతోంది.అధికారుల విచారణలో ఆ వ్యక్తి టిక్కెట్ కొనడానికి డబ్బులు లేవని.. అందువలనే ప్రయాణం కోసం ఈ రిస్క్ చేసినట్లు తెలిపాడు. ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా వివరాలు వెల్లడి కాలేదు. ఆ వ్యక్తి రైలు కింద ఎలా దాక్కున్నాడో కూడా అస్పష్టంగానే ఉంది. ప్రస్తుతం ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. #BreakingNews *"यह खबर हैरान कर देगी"**टिकट के लिए पैसा नही था, तो ट्रेन के बोगी के नीचे पहिये के पास बैठ कर एक शख्स ने किया 250 किलोमीटर का सफर!!*मध्य प्रदेश में इटारसी से जबलपुर आने वाली दानापुर एक्सप्रेस ट्रेन के S-4 बोगी के नीचे पहिये के पास बने ट्राली में एक व्यक्ति ने… pic.twitter.com/41ZUpDOBxY— THIS IS WRONG NUMBER (@Thiswrongnumber) December 27, 2024 -
జీజేపీకి ఓటెయ్యద్దని ప్రతిజ్ఞ
-
షాకింగ్ ఘటనపై స్పందించారు
ఇటార్సి: మధ్యప్రదేశ్ లోని ఇటార్సిలో వెలుగుచూసిన అమానవీయ ఘటనపై అధికారులు స్పందించారు. ఓ యువకుడిని రైలు కిటీకి కట్టేసి వేలాడదీసిన ఘటనపై కేసు రైల్వే పోలీసులు నమోదు చేశారు. బాధ్యులపై ఐపీసీ 307, 153 సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఆర్ఫీయూపీ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి జీఆర్ఫీ ఏఎస్ఐ, ఆర్ఫీఎస్ ఏఎస్ఐ, కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేశారు. ఇటార్సి రైల్వేస్టేషన్ లో ఈ నెల 25న జరిగిన షాకింగ్ ఘటనకు సంబంధించి ఫొటోలు బయటకు రావడంతో కలకలం రేగింది. ఆలస్యంగా వెలుగుచూసిన షాకింగ్ ఘటన -
ఆలస్యంగా వెలుగుచూసిన షాకింగ్ ఘటన
ఇటార్సి: మధ్యప్రదేశ్ లో జరిగిన షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రైలులో ఓ యువకుడి పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ఘటన సంచలనం రేకెత్తించింది. ఓ యువకుడిని రైలుకు కట్టేసి వేలాడదీయడం స్థానికంగా కలకలం రేపింది. ఇటార్సి రైల్వేస్టేషన్ లో ఈ నెల 25న ఇది జరిగింది. తాగునీటి విషయంలో తలెత్తిన వివాదంతో ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. తమ బాటిల్ లోని మంచినీళ్లు తాగాడనే కోపంతో యువకుడిపై ముగ్గురు దాడి చేశారు. అతడి పాంట్ ఊడదీశారు. అక్కడితో ఆగకుండా ఊడదీసిన పాంట్ తో అతడి రెండు కాళ్లను రైలు కిటికీ కట్టేశారు. కొంతసేపు అలాగే నిలుచుకున్న బాధితుడు తర్వాత పట్టుతప్పడంతో తలకిందులుగా రైలుకు వేలాడాడు. అక్కడున్నవారంతా అతడిని కాపాడేందుకు ప్రయత్నించలేదు. ఈ దారుణోదంతానికి సంబంధించిన ఫొటోలు వెలుగులోకి రావడంతో పోలీసులు స్పందించారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. -
సినీఫక్కీలో అనుమానిత ఉగ్రవాది పరారీ
ఇటార్సీ: మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీ సమీపంలో పోలీసుల అదుపులోంచి ఓ అనుమానిత ఉగ్రవాది సినీఫక్కీలో తప్పించుకున్నాడు. కోర్టు విచారణ కోసం పీటీ వారంట్‌పై తమిళనాడులోని వెల్లూరు నుంచి సయ్యద్ అహ్మద్ అలీ(38)ని యూపీలోని లక్నోకు రైల్లో తీసుకెళ్తుండగా మార్గమధ్యలో పరారయ్యాడు. రప్తీసాగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఇటార్సీ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో చేతులకు బేడీలు ఉండగానే అందులోంచి దూకి పారిపోయాడు. వెల్లూరు పోలీసులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. తర్వాత స్థానిక పోలీసులకు, ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్)కు సయ్యద్ పరారీ గురించి తెలిపారు. అతడిని పట్టుకునేందుకు ముమ్ముర గాలింపు జరుపుతున్నారు. త్రిపురకు చెందినట్టుగా సర్టిఫికెట్ సంపాదించిన సయ్యద్ బంగ్లాదేశ్ కు చెందినవాడై ఉంటాడని అనుమానిస్తున్నారు.