వాషింగ్టన్: భారత్‌లో ఉగ్రవాదుల కదలికలు అధికంగా కలిగిన మణిపూర్, జమ్ముకశ్మీర్, భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలు, దేశంలోని మధ్య, తూర్పు ప్రాంతాలకు వెళ్లవద్దని అమెరికా తమ దేశ పౌరులకు సూచించింది.
అమెరికా తాజాగా భారతదేశంలో పర్యటించే తమ దేశపౌరులకు పలు సలహాలు అందజేసింది. వీటిలో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన సమాచారాన్ని నవీకరించినట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. నేరాలు, ఉగ్రవాదం, నక్సలిజం కారణంగా, భారతదేశంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటూ ఆమెరికా సలహా ఇచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాద ముప్పు పెరిగిందని పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం, హింసాయుత పరిస్థితులు నెలకొన్న కారణంగా అక్కడికు వెళ్లాలనుకునేముందు అమెరికన్లు పునరాలోచించాలని సూచించింది.
భారతదేశంలో వేగంగా పెరుగుతున్న నేరాలలో అత్యాచారం ఒకటని అమెరికా ట్రావెల్ అడ్వైజరీ పేర్కొంది. పర్యాటక ప్రాంతాలు, ఇతర ప్రదేశాలలో లైంగిక వేధింపుల వంటి హింసాత్మక నేరాలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఎప్పుడైనా దాడి చేయవచ్చు. వారు పర్యాటక ప్రదేశాలు, రవాణా కేంద్రాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment