Apple Store Selling Smart Travel Mug With Tracking Feature, Know Details Inside - Sakshi
Sakshi News home page

యాపిల్‌ స్పెషల్‌ ఫీచర్‌తో స్మార్ట్‌ ట్రావెల్‌ మగ్‌, ధర వింటే..!

Published Thu, May 25 2023 11:01 AM | Last Updated on Thu, May 25 2023 11:33 AM

Apple store selling smart travel mug with tracking feature - Sakshi

సాక్షి, ముంబై: టెక్ దిగ్గజం యాపిల్‌ ఉత్పత్తులకు ఉండే క్రేజే వేరు. అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఐఫోన్లు, ఎయిర్‌పాడ్స్‌, ఐపాడ్స్‌, స్మార్ట్‌ వాచెస్‌ను చూశాం. తాజాగా టెంపరేచర్‌ను కంట్రోల్‌ చేసే కీలక ఫీచర్‌తో యాంబర్‌ ట్రావెల్మగ్ 2+ను యాపిల్‌ తన ఆన్‌లైన్ స్టోర్‌లో విక్రయిస్తోంది. యాపిల్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ట్రావెల్ మగ్ ధర ప్రస్తుతం 199.95 డాలర్లు (రూ. 16,542) గా ఉంది. (మంటల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700: వీడియో వైరల్‌, స్పందించిన కంపెనీ)

ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్‌లో  ఫైండ్ మై యాప్‌కు సపోర్ట్‌ను అందిస్తోంది  అంటే ఒక వేళ ఈ స్మార్ట్ ట్రావెల్ మగ్ పోతే, దాన్ని ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. (మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్‌న్యూస్‌, ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్స్‌)

వేడిగా వేడిగా  కాఫీనో, టీనో  ఆస్వాదించే ఈ యాంబర్ ట్రావెల్ మగ్ 2+ లో  మనం తాగే డ్రింక్‌ ఉష్ణోగ్రతను (120°F- 145°F) సెట్ చేసుకోవచ్చు. ఇంటర్నల్‌ బ్యాటరీ సాయంతో ఉష్ణోగ్రతను 3 గంటల వరకు ఉంచుకోవచ్చు. లేదా ఛార్జింగ్ కోస్టర్‌ సాయంతో రోజంతా కూడా ఇందులోని డ్రింక్స్‌ను హాట్‌గా ఉంచుకోవచ్చు. 

ఇలాంటి టెక్‌ వార్తలు, ఇతర బిజినెస్‌ వార్తలకోసం చదవండి: సాక్షిబిజినెస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement