Cup
-
అత్యంత ఖరీదైన టీకప్పు..ధర వింటే షాకవ్వుతారు!
ఎన్నో విలాసవంతమైన వస్తువులను చూసుంటాం. వాచ్‌ల దగ్గర నుంచి హ్యండ్ బ్యాగ్‌లు, వ్యాలెట్ వరకు అత్యంత ఖరీదు పలికిన బ్రాండ్లు చూశాం. ఓ సాధారణ టీ కప్పు అత్యంత ఖరీదైనదిగా ఉంటుందంటే నమ్ముతారా. మహా అయితే రూ. 30 వేల నుంచి రూ. లక్ష రూపాయాల విలవు చేసే ప్రత్యేకమైన మెటీరియల్‌తో చేసి ఉండొచ్చు. అంతేగానీ మరీ ఇంత రేంజ్లో ధర ఉండదు. అంత ఖరీదైన టీకప్పు ఎక్కడ ఉందంటే.. జపనీస్ డిపార్ట్మెంట్ స్టోర్ చైన్ తకాషిమయాలో అత్యంత ఖరీదైన టీ కప్పు ఉంది. దీని ధర ఏకంగా రూ. 56 లక్షలు. దీన్ని స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారంలో తయారు చేశారట. అమ్మకానికి వివిధ బంగారు వస్తువులను ప్రదర్శనగా ఉంచగా ఈ టీకప్పు దురదృష్టవశాత్తు అపహరణకు గురయ్యింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఈ వస్తువుని జేబులో వేసుకుని పారిపోతున్నట్లు వీడియో ఫుటేజ్‌లో కనిపించింది. అయితే ఆ వ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు. ఈ ప్రదర్శనలో దాదాపు వెయ్యికి పైగా టీవేర్ టేబుల్ వేర్ వంటి కళఖండాలు ఉన్నాయని, వాటిల్లో ఈ టీ కప్పు త్యంత ఖరీదైనదని అన్నారు తకాషిమయా స్టోర్ ప్రతినిధి. "తాము ఆ వస్తువులను అమ్మకానికి పారదర్శకమైన అన్‌లాక్ పెట్టేలో ఉంచామని, దీన్ని పసిగట్టిన కస్టమర్లు సులభంగా బయటకు తీసి ఉండొచ్చు. సీసీఫుటేజ్‌లో ఓ వ్యక్తి టీ కప్పుని తన బ్యాగ్‌లో వేసుకుని పారిపోతున్నట్లు మేము చూశాం. ప్రస్తుతం పోలీసులు సదరు వ్యక్తి కనిపెట్టే పనిలో ఉన్నారు. అయినప్పటకీ తమ స్టోర్ అమ్మకాల ప్రదర్శన నిరాటకంగా కొనసాగుతుందని, పైగా భద్రతను కూడా మరింత పటిష్టం చేస్తామని చెప్పారు." స్టోర్ ప్రతినిధులు. (చదవండి: చిచ్చర పిడుగు!..తొమ్మిదేళ్లకే ఏకంగా 75 కిలోలు..!) -
టీమ్ ఇండియా రబ్బరు బంతులతో ప్రాక్టీస్... ఎందుకంటే?
-
చెన్నై పాంచ్ పటాకా
-
యాపిల్ స్పెషల్ ఫీచర్‌తో స్మార్ట్ ట్రావెల్ మగ్, ధర వింటే..!
సాక్షి, ముంబై: టెక్ దిగ్గజం యాపిల్ ఉత్పత్తులకు ఉండే క్రేజే వేరు. అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఐఫోన్లు, ఎయిర్‌పాడ్స్, ఐపాడ్స్, స్మార్ట్ వాచెస్‌ను చూశాం. తాజాగా టెంపరేచర్‌ను కంట్రోల్ చేసే కీలక ఫీచర్‌తో యాంబర్ ట్రావెల్మగ్ 2+ను యాపిల్ తన ఆన్లైన్ స్టోర్‌లో విక్రయిస్తోంది. యాపిల్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ట్రావెల్ మగ్ ధర ప్రస్తుతం 199.95 డాలర్లు (రూ. 16,542) గా ఉంది. (మంటల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700: వీడియో వైరల్, స్పందించిన కంపెనీ) ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్‌లో ఫైండ్ మై యాప్‌కు సపోర్ట్‌ను అందిస్తోంది అంటే ఒక వేళ ఈ స్మార్ట్ ట్రావెల్ మగ్ పోతే, దాన్ని ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. (మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్‌న్యూస్, ఇంట్రస్టింగ్ అప్డేట్స్) వేడిగా వేడిగా కాఫీనో, టీనో ఆస్వాదించే ఈ యాంబర్ ట్రావెల్ మగ్ 2+ లో మనం తాగే డ్రింక్ ఉష్ణోగ్రతను (120°F- 145°F) సెట్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ బ్యాటరీ సాయంతో ఉష్ణోగ్రతను 3 గంటల వరకు ఉంచుకోవచ్చు. లేదా ఛార్జింగ్ కోస్టర్ సాయంతో రోజంతా కూడా ఇందులోని డ్రింక్స్‌ను హాట్‌గా ఉంచుకోవచ్చు. ఇలాంటి టెక్ వార్తలు, ఇతర బిజినెస్ వార్తలకోసం చదవండి: సాక్షిబిజినెస్ -
ఐపీల్ కప్పుతో తిరిగొస్తా... కూతురికి మాటిచ్చిన రోహిత్ శర్మ
-
ఆనంద్ మహింద్ర మనసు దోచిన 'కప్పు': ఫోటో వైరల్
ప్రముఖ పారిశ్రామికవేత్త సోషల్ మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ తరుచుగా మంచి మంచి వైరల్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ వీడియోల నుంచి మంచి మంచి సందేశాలను కూడా ఇస్తుంటారు కూడా. అదే తరహాలో ఒక వైరల్ ఫోటో సోషల్ మాధ్యమంలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఆ ఫోటో ఆనంద్ మహింద్ర మనసును దోచింది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే...ఒక తెల్లటి కప్పు పై టిక్‌టాక్ గేమ్ ఒకటి ఉంది. అదేలా ఉందంటే... ఆ కాఫీ కప్పుపై 'థింక్ అవుట్ బాక్స్' అని ఉండి కింద గేమ్ అనుసంధానించి ఉంది. అది బాక్స్ అనే పదంలోని ఎక్స్‌తో అనుసంధానమయ్యి బాక్స్ నుంచి బయటపడే మార్గం చూపుతుంది. ఇది ఒక మంచి చక్కని సందేశాన్ని ఇచ్చిందంటూ... ఆనంద్ మహింద్ర ఆ కప్పును తెగ మెచ్చకుంటూ ఆ విషయాన్ని వివరించారు. ఈ మేరకు ఆయన ఆ సందేశం వివరిస్తూ...ఇది ఒక రకంగా మనం మన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేస్తోంది. నిజానికి మనం సమస్య లోనే ఉండిపోయి కాకుండా బయటగా ఉండి ఎలా బయటపడాలో అన్వేషించాలి అనే ఒక చక్కని సందేశాన్ని ఇస్తోంది. గెలిచే మార్గాలను అన్వేషించడం తోపాటు సమస్య నుంచి బయటపడే పరిష్కార మార్గాలు గురించి తెలియజేస్తోంది. అన్నారు. అంతేకాదు ఇది అద్భుతమైన కప్పు, వెంటనే తాను ఆ కప్పును తెచ్చుకుంటానంటూ ట్వీట్ చేశారు. నెటిజన్లు కూడా ఆయనతో ఏకభవిస్తూ ఔను ఇది మంచి సందేశాన్ని ఇచ్చింది. ఎలా తెలివిగా సమస్యలు పరిష్కరించుకోవాలో తెలియజేస్తోంది అంటూ ట్వీట్ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. I’m going to get this mug. Clever. The solution to a problem often lies by joining the dots with something OUTSIDE your own ecosystem… pic.twitter.com/SedGrDN8B9 — anand mahindra (@anandmahindra) August 10, 2022 (చదవండి: Viral Video: ఆహా! కోటు వేసుకోవడం ఎంత కష్టమో... బైడెన్ చూస్తే తెలుస్తుంది) -
తల వెంట్రుకపై స్పోర్ట్స్ కప్
తల వెంట్రుకపై స్పోర్ట్స్ కప్‌ను అమర్చి విశాఖ జిల్లా ఏటికొప్పాక కళాకారుడు శ్రీశైలపు చిన్నయాచారి అందర్నీ అబ్బురపరిచారు. హస్తకళలో రాష్ట్రపతి అవార్డు పొందిన ఆయన.. మైక్రో ఆర్ట్‌తో రెండు రోజుల్లో ఈ అద్భుత కళాఖండాన్ని తీర్చి దిద్దారు. గుండు సూది గుండు(పైభాగం)పై గసగసాలను ఉంచి దానిపై 22 క్యారెట్ల బంగారంతో 0.55 మి.మీ. ఎత్తు, 0.20 మి.మీ వెడల్పుతో స్పోర్ట్స్ కప్‌ను తయారు చేసి తల వెంట్రుకపై అమర్చారు. – యలమంచిలి రూరల్ -
‘నమ్దే’ ఇంకెప్పుడు?
సాక్షి క్రీడా విభాగం: ‘ఓటములు మమ్మల్ని ఓడించలేవు. పోరాట స్ఫూర్తి మమ్మల్ని సజీవంగా ఉంచుతుంది’... తమ అధికారిక వెబ్సైట్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్ రాసుకున్న వాక్యం ఇది. అదేంటో గానీ పోరాటాలే తప్ప జట్టు ఖాతాలో విజయాలు మాత్రం లేవు. ఐపీఎల్లో పాపులారి టీ విషయంలో మిగతా జట్లతో పోలిస్తే ఎక్కడా తక్కువ కాదు, పెద్ద సంఖ్యలో అభిమాన గణం, వాణిజ్యపరంగా చూస్తే వహ్వా అనిపించే కంపెనీలతో సహవాసం... స్వయంగా భారత కెప్టెన్ సుదీర్ఘ కాలంగా జట్టును నడిపిస్తుండగా, టి20లో విధ్వంసానికి చిరునామాలాంటి డివిలియర్స్, గతంలో గేల్‌లాంటి ఆటగాళ్లు ఐపీఎల్‌ను ఒక ఊపు ఊపారు. కానీ తుది ఫలితానికి వచ్చేసరికి మాత్రం సున్నా! మూడుసార్లు ఫైనల్లో ఓడిన బెంగళూరు ఇప్పుడైనా ఆ గండాన్ని దాటి కన్నడ అభిమానులతో ‘కప్ నమ్దే ( మనదే)’ అనిపిస్తుందో లేదో వేచి చూడాలి! కొత్తగా వచ్చినవారు ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ ఇద్దరు ఆటగాళ్ల కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేసింది. న్యూజిలాండ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కైల్ జేమీసన్ (రూ. 15 కోట్లు), ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (రూ. 14.25 కోట్లు)లకు అనూహ్య మొత్తం ఇచ్చి సొంతం చేసుకుంది. వేలానికి ముందు విదేశీ ఆల్‌రౌండర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అవసరం ఆ జట్టుకు ఉంది. అందుకు తగినట్లుగానే ఐపీఎల్ అనుభవం ఉన్న మరో ఆల్‌రౌండర్ డాన్ క్రిస్టియాన్ (రూ. 4.80 కోట్లు)ను కూడా తీసుకుంది. ఈ ముగ్గురు కాకుండా మరో ఐదుగురు భారత వర్ధమాన ఆటగాళ్లను కనీసం మొత్తం రూ.20 లక్షలకే సొంతం చేసుకుంది. సచిన్ బేబీ, రజత్ పటిదార్, మొహమ్మద్ అజహరుద్దీన్, సుయాష్ ప్రభుదేశాయ్‌లతో పాటు ఆంధ్ర జట్టు వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఇంత మొత్తం చెల్లించినా... భారత గడ్డపై ఇప్పటి వరకు ఒక్కబంతి కూడా వేయని జేమీసన్, గత కొన్నేళ్లుగా వరుసగా విఫలమవుతున్న మ్యాక్స్‌వెల్ ఎలా ఆడతారన్నది ఆసక్తికరం. ఒక భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కోసం బెంగళూరు చివరి వరకు ప్రయత్నించినా సరైన ఆటగాడు దక్కలేదు. జట్టు వివరాలు భారత ఆటగాళ్లు: కోహ్లి (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, మొహమ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, పవన్ దేశ్‌పాండే, షహబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చహల్, హర్షల్ పటేల్, సచిన్ బేబీ, రజత్ పటిదార్, మొహమ్మద్ అజహరుద్దీన్, సుయాష్ ప్రభుదేశాయ్, కోన శ్రీకర్ భరత్. విదేశీ ఆటగాళ్లు: డివిలియర్స్, డానియెల్ స్యామ్స్, ఫిన్ అలెన్, జేమీసన్, డాన్ క్రిస్టియాన్, మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్. సహాయక సిబ్బంది: మైక్ హెసన్ (డైరెక్టర్, క్రికెటర్ ఆపరేషన్స్), సైమన్ కటిచ్ (హెడ్ కోచ్), సంజయ్ బంగర్ (బ్యాటింగ్ కన్సల్టెంట్), శ్రీధరన్ శ్రీరామ్ (బ్యాటింగ్ అండ్ స్పిన్ బౌలింగ్ కోచ్), ఆడమ్ గ్రిఫిత్ (బౌలింగ్ కోచ్). తుది జట్టు అంచనా/ఫామ్ మూడు–కోహ్లి, నాలుగు–డివిలియర్స్, ఐదు–మ్యాక్స్‌వెల్... భారీ మొత్తాన్ని చెల్లించి మ్యాక్సీని తీసుకోవడం ఐదో స్థానంలో ఆడించాలనే వ్యూహంలో భాగమే. కోహ్లి, డివిలియర్స్‌లు కాకుండా ఇన్నింగ్స్ చివర్లో మెరుపు షాట్లు ఆడే ఒక బ్యాట్స్‌మన్ అవసరం ఉన్న టీమ్ ఇప్పుడు ఆసీస్ ఆటగాడిపై ఆశలు పెట్టుకుంది. ఓపెనింగ్‌లో పడిక్కల్‌కు తోడుగా ఫిన్ అలెన్ (కివీస్) బరిలోకి దిగవచ్చు. నాలుగో విదేశీ ఆటగాడిగా జేమీసన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నా యి. రెండో ఓపెనర్‌గా కూడా భారత ఆటగాడి (అజహరుద్దీన్)కే అవకాశం ఇస్తే జంపా, రిచర్డ్సన్లలో ఒకరిని తుది జట్టులోకి తీసుకోవచ్చు. వేలం తర్వాత ఇలాంటి కూర్పులో కూడా ఆరో స్థానంలో ఒక భారత బ్యాట్స్‌మన్‌పైనే జట్టు ఆధారపడాల్సి వస్తోంది. మ్యాక్స్‌వెల్ విఫలమైతేనే క్రిస్టియాన్‌కు చాన్స్ లభిస్తుంది. స్పిన్నర్లుగా తుది జట్టులో చహల్, సుందర్ ఖాయం. సిరాజ్, సైనీలలో ఎవరికి ఎన్ని మ్యాచ్‌లు లభిస్తాయనేది చూడాలి. అత్యుత్తమ ప్రదర్శన 3 సార్లు రన్నరప్ (2009, 2011, 2016) 2020లో ప్రదర్శన: పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడింది. లీగ్‌లో తొలి 10 మ్యాచ్‌లలో 7 గెలిచి ఒక దశలో టాపర్‌గా నిలుస్తుందనుకున్న ఆర్సీబీ, వరుసగా మిగిలిన నాలుగు మ్యాచ్‌లు ఓడింది. చివరకు అతి కష్టమ్మీద నెట్‌రన్‌రేట్‌తో ముందంజ వేయగలిగింది. కోహ్లి తన స్థాయి మేరకు ఆడకపోవడం కూడా (15 ఇన్నింగ్స్‌లలో 121.35 స్ట్రయిక్‌రేట్‌తో 466 పరుగులు) జట్టు అవకాశాలపై ప్రభావం చూపించింది. -
బిస్కెట్ కప్‌లో చాయ్: తాగి తినొచ్చు..!
చెన్నై: చాయ్ విత్ బిస్కెట్స్.. ఎవర్గ్రీన్ కాంబినేషన్. మనలో చాలా మంది ఉదయం చాయ్-బిస్కెట్‌తోనే ప్రారంభమవుతుంది అంటే అతిశయోక్తి కాదు. బయట టీ కోట్ల దగ్గర చాయ్ తాగేటప్పుడు కూడా బిస్కెట్ తినడం చాలా మందికి అలవాటు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓ మధురై టీ కొట్టు యాజమాని ఓ వెరైటీ కాంబినేషన్‌ని తీసుకొచ్చారు. సాధారణంగా టీని గాజు గ్లాస్, కాగితపు కప్పు, పింగాణి కప్పులో పోస్తారని తెలుసు. అయితే ఈ టీ కొట్టు యాజమాని మాత్రం వెరైటీగా బిస్కెట్ టీ కప్పులు తీసుకొచ్చాడు. అంటే బిస్కట్స్‌తో తయారు చేసిన కప్పులు అన్నమాట. మధురైలోని ఆర్ఎస్ పాతి నీలగిరి టీ స్టాల్ చాక్లెట్-రుచిగల బిస్కెట్‌తో తయారు చేసిన తినే కప్పుల్లో తక్కువ మొత్తంలో టీని అందిస్తోంది. అంటే మీరు మీ టీని తాగవచ్చు, ఆపై కప్పు తినవచ్చు. దీని వల్ల వ్యర్థాలు ఉండవు.. మనకు భిన్నమైన అనుభూతి. ది బెటర్ ఇండియా వీడియో రిపోర్ట్ ప్రకారం ఆర్ఎస్ పాతి నీలగిరి టీ స్టాల్ 1909 నుంచి ఉంది. అక్టోబర్ 2019 లో భారత ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నెమ్మదిగా తొలగించి 2022 నాటికి పూర్తిగా నిషేధించాలని భారత్ యోచిస్తోంది. వీటిలో ప్లాస్టిక్ సంచులు, కప్పులు, ప్లేట్లు, సీసాలు, స్ట్రాలు వంటి రోజువారీ వినియోగ వస్తువులు ఉన్నాయి. అందుకే దేశవ్యాప్తంగా అనేక మంది వ్యాపారులు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ పరిష్కారాల కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో టీ స్టాల్ యజమాని వివేక్ సబాపతికి వినూత్న ఆలోచన వచ్చింది. పర్యావరణ అనుకూలమైన టీ కప్పులు కోసం శోధిస్తున్నప్పుడు బిస్కెట్ కప్పులపై సబపతి దృష్టి పడింది. అలా దాన్ని అమల్లోకి తెచ్చారు. (చదవండి: నోట్లో ‘కుకీసు’కుందాం) ఇక ఈ తినదగిన బిస్కెట్ టీ కప్పు ధర 20 రూపాయలు మాత్రమే. ఈ వినూత్న ప్రయోగం టీ ప్రియులకు కూడా బాగా నచ్చింది. జూలై నెలలో ప్రారంభించినప్పటి నుంచి జనాలు బిస్కెట్ కప్పులో అందించే టీని తాగడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు. ఈ కప్‌లో సుమారు 60 మిల్లీలీటర్ల టీ పడుతుంది. అయితే ఈ బిస్కెట్ కప్పులో పోసిన టీని పది నిమిషాల్లోనే తాగాల్సి ఉంటుంది. ఆ తర్వాత కప్పు మెత్తగా అయ్యి చిరిగిపోతుంది. ఇక ఈ బిస్కెట్ కప్పులో మరిన్ని ఫ్లేవర్స్ తీసుకురావాలని భావిస్తున్నారు సభాపతి. ఒక్కసారి పరిస్థితులు చక్కబడితే దానిపై దృష్టి పెడతామని తెలిపారు. -
‘శాఫ్’ కప్ ఫైనల్లో భారత్‌కు షాక్
ఢాకా: దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (శాఫ్) కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్‌కు భంగపాటు ఎదురైంది. అందివచ్చిన అవకాశాలను గోల్స్‌గా మలచడంలో విఫలమైన భారత జట్టు ఫైనల్లో 1–2తో మాల్దీవులు చేతిలో ఓడింది. గ్రూప్ దశలో 2–0తో మాల్దీవులను ఓడించిన భారత్ శనివారం జరిగిన తుదిపోరులో మాత్రం తడబడింది. ఆద్యంతం భారత్ ఆధిపత్యమే కొనసాగినా విజయం మాత్రం ప్రత్యర్థిని వరించింది. వచ్చిన కొద్దిపాటి అవకాశాలను చక్కగా వినియోగించుకున్న మాల్దీవులు రెండో సారి శాఫ్ కప్‌ను ఎగరేసుకుపోయింది. భారత్ తరఫున సుమీత్ పస్సీ (92వ ని.లో) ఏకైక గోల్ చేయగా... మాల్దీవులు తరఫున ఇబ్రహీం (19వ ని.లో), అలీ ఫసీర్ (66వ ని.లో) చెరో గోల్ చేశారు. ఈ టోర్నీలో అజేయంగా ఫైనల్ చేరిన భారత్ తుదిపోరులో సమన్వయ లోపంతో చతికిలపడింది. ఆట ఆరంభమైన ఐదో నిమిషంలోనే వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుంది. నిఖిల్ అందించిన పాస్‌ను రంజన్ సింగ్ హెడర్ ద్వారా గోల్‌గా మలిచే ప్రయత్నం చేసినా అది సఫలం కాలేదు. 30వ నిమిషంలో ఫరూఖ్ గోల్‌పోస్ట్‌కు అతిసమీపంలో బంతిని దొరకబుచ్చుకున్నా నియంత్రణ కోల్పోయి దాన్ని వృథా చేశాడు. ఆ తర్వాత కూడా భారత్ దాడులను కొనసాగించినా మాల్దీవులు రక్షణ పంక్తి వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది. ఇంజ్యూరీ టైంలో సుమీత్ గోల్ చేసినా అప్పటికే ఆలస్యమైంది. -
మంట్రగాళ్లు
చేతనబడి ఉప్పుకప్పురంబు నొక్కపోలికనుండు చూడ చూడ మంటల గుట్టు వేరు! అనగనగా ఒక ఊరు... సొరుగుల్లో డబ్బులు... కప్పుకి తాటాకులు తాటాకుల్ని ముట్టకుండా... తలుపుల్ని బద్దలు కొట్టకుండా సొరుగుల్లోంచి డబ్బు తీయడం ఎలా? అది తెలుసుకుంటే ఉప్పుకీ కర్పూరానికీ తేడా తెలియదా? ఎందుకు మంచిదో తెలియదు ఏం మంచో తెలియదు ఆ మంచితో ఏం ఒరుగుతుందో తెలియదు! కానీ ఓ పూజ చేయించుకుంటే చాలనుకుంటారు ఆనక అంత మంచే జరుగుతుందనుకుంటారు ఇదొక మానసిక బలహీనత!! అయితే ఇక్కడ జరిగింది ఇంకొకటి పూజ చేయించుకోకపోతే అరిష్టం అని భయం ఊరు తగలబడి పోతుందని వణుకు ఇది ఇద్దరు స్వార్థపరుల కుట్ర డబ్బు గుంజడం కోసం పుట్టించిన భయం అది నెల్లూరు జిల్లా, బోగోలు మండలంలో జువ్వలదిన్నె గ్రామం. సముద్రతీర గ్రామం. మొక్కలు త్వరగా ఎదగడానికి అనువైన ఇసుకనేల, నీటి వసతి ఉన్న ఊరు. పాడిపంటలతో సస్యశ్యామలమైన నేల. నీలివిప్లవంతో ఆధునిక పోకడలు సంతరించుకుంటున్న సమయం. ఇళ్లకు అప్పటి వరకు ఉన్న పాతతాటాకుల కప్పు తీసేసి కొత్త తాటాకు వేయడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడడం లేదు. ‘ఈ ఎండాకాలం మాసూలు (పంట చేతికొచ్చేకాలం) అయిన వెంటనే ఇంటికి శంకుస్థాపన చేద్దాం’ అనే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందరి ఇళ్లలోనూ అంతో ఇంతో డబ్బు ఉంది. పేదరికపు ఆనవాళ్లను తుడిచిపెట్టి అంతా రంగురంగుల మిద్దెలు కట్టుకోవడానికి సమాయత్తమవుతున్నారు. రోగమొస్తే ఎవరూ నాటువైద్యుణ్ని చూడడం లేదు. ఊరిలోనే మంగలి పని చేస్తూ పార్ట్‌టైమ్ ఆర్ఎంపి సేవలందించే వాళ్లనూ పెద్దగా పట్టించుకోవడం లేదు. బస్సెక్కి పట్టణంలో ప్రభుత్వాసుపత్రికి పోతున్నారు. ఇంకాస్త డబ్బుంటే ప్రైవేటు ఆసుపత్రికి పోతున్నారు. ‘పిల్లాడికి గాలి సోకింది, అంత్రం కట్టండి’ అని మంత్రగాడి దగ్గరకు వచ్చే వాళ్లూ కరువయ్యారు. అంతలోనే ఓ ఉపద్రవం. ఈ ఊరికి ఏమైంది! ‘ఏమైంది... ఎందుకిలా జరుగుతోంది... ఎవరి చూపు పడిందో ఇంటి మీద’ ఇలాంటి ప్రశ్నలు ఎవరికి వారే వేసుకోసాగారు. అది జువ్వలదిన్నె గ్రామంలో శ్రామికులు నివసించే వాడ. ఓ రోజు రాత్రి... రోజంతా కాయకష్టం చేసిన జనం కడుపు నిండా తిని ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో ఉన్నట్లుండి హాహాకారాలు వినిపించాయి. ఒక ఇంటి చూరుకు నిప్పంటుకుంది. చూసిన వాళ్లు పెడబొబ్బలు పెట్టారు. వీపున చరిచినట్లు ఊరంతా ఒక్కసారిగా నిద్రమేల్కొంది. నీళ్లు పోసి మంటలార్పారు. ఎందుకిలా జరిగిందోననే ఊహాజనిత సందేహాలు మొదలవుతున్నాయని గ్రహించి ‘ఎండలు మండిపోతున్నాయి, తాటాకు కొంప తగలబడకుండా ఉంటుందా’ అని గదమాయించి అంతటితో తెర దించేశాడు ఆ ఇంటి యజమాని. ఇల్లు తగలబడిన కలకలం సద్దుమణిగిపోయింది. జరిగిందొక పీడకల అని అందరూ మరిచిపోవడానికే ప్రయత్నించారు. అంతలోనే మరో ఇంటికి నిప్పంటుకుంది. ఈసారి మంటలు ఏ అర్ధరాత్రో కాదు. ఉదయం పదిగంటల సమయంలోనే. ఇలాంటివి జరిగినప్పుడు సమీకరణలు వెదకడానికి ఎవరో ఒకరు తయారవుతారు. గ్రామాల్లో ఇది సర్వసాధారణం. ఆ రెండిళ్లలో మంటలు రావడానికి సారూప్యతను అన్వయించేలోపే మరో ఇల్లు మంటలకు లోనయింది. ఇక తార్కిక సమీకరణాలు గాలికి కొట్టుకుపోయాయి. గుండెల్లో మంటలు మొదలయ్యాయి. ఎప్పుడు ఎవరిల్లు తగలబడుతుందోననే భయంతో నిద్రపోవడానికే భయపడుతున్నారు. ఇంట్లో ఉన్న నలుగురూ ఒక్కసారి భోజనానికి కూర్చోవడానికి జంకుతున్నారు. ‘మీరు తినండి, నేను తర్వాత తింటా’ అంటూ ఇంటిపెద్ద ఆరుబయట మంచం వాల్చుకుని ఏ మూల చూరు నుంచి పొగ వస్తుందోనని చూడడంతోనే సరిపోతోంది. ఆడపిల్ల పెళ్లి కోసం ఇంట్లో దాచి ఉంచిన మంచి బట్టలన్నీ మూటగట్టి ఏ తెలిసిన వారింట్లోనో దాచుకుంటున్నారు ఆడవాళ్లు. మొత్తానికి నెల రోజుల్లోనే పదికి పైగా ఇళ్లకు నిప్పంటుకుంది. ఊరికి ఏదో అరిష్టం దాపురించకపోతే ఇలా ఇళ్లు ఎందుకు తగలబడుతాయి- అంటూ తార్కిక వాదన ముసుగులో మూఢవిశ్వాసాన్ని జొప్పించే ప్రయత్నం జరిగిపోయింది. ఊరి పెద్దమనుషులకూ ఇది నిజమేనేమో అనిపించింది. నలుగురైదుగురు కలిసి మంటలంటుకున్న ఇళ్లకు వెళ్లి శాంతి పూజలు చేయించమని సలహా ఇచ్చారు. ‘ఎందుకైనా మంచిది మంటలు అంటని వాళ్లు కూడా ఇళ్లలో పూజలు జరిపిస్తే మంచిది’ అంటూ హితవచనాల రూపంలో మూఢవిశ్వాసం చాపకింద నీరులా ఊరంతా ప్రవహించేసింది. పత్రికల్లో వార్తలొచ్చాయి! గాల్లో నుంచి మంటలు రావడాన్ని, ఊరి జనం భయపడడాన్ని వార్తా పత్రికలు జిల్లా ఎడిషన్‌లో విస్తృతంగా రాస్తున్నాయి. జనవిజ్ఞానవేదిక నెల్లూరు విభాగం అప్రమత్తం అయింది. ఊరంతా తిరిగి విచారించిన తర్వాత అనేక విషయాలు తెలిశాయి. మంటలకు ప్రత్యక్ష కారణంతోపాటు పరోక్ష కారణాలు కూడా బయటకు వచ్చాయి. ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని నిర్ధారణ అయిన తర్వాత పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ సంఘటన తర్వాత జువ్వలదిన్నెతోపాటు పరిసర గ్రామాల్లో కూడా మంటలు రావడం తగ్గిపోయాయి. ఈ మంటల వెనుక మిస్టరీ ఓ సినిమా కథను తలపిస్తుంది. పథకం ఏమిటంటే! ఊళ్లో జనసామాన్యానికి ఉపాధి మార్గాలు పెరిగాయి. చేతుల కష్టాన్ని నమ్ముకున్న అందరూ లక్షణంగా బతికేస్తున్నారు. డబ్బుతోపాటు విజ్ఞానానికి కూడా దగ్గరవుతున్నారు ఊరి జనం. అంత్రం కట్టించుకోవడం మీద నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. ఇదిలా కొనసాగితే మంత్రగాళ్ల బతుకులు బలుసాకు తినాల్సిన స్థితికి చేరుకుంటాయనే వాస్తవాన్ని చాలా త్వరగానే గ్రహించాడు ఆ ఊరి మంత్రగాడు. ఏదో చేయాలి, ఏదో ఒకటి చేసి ఊరి దృష్టిని మరల్చాలి. ఆ మరల్చేదేదో అతీంద్రియ శక్తుల మీదకు మరల్చాలి. అంటే... విపరీతమైన భయాన్ని కలిగించాలి. గుండెలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసేలా చేయాలి. ఇంట్లో పడుకోవడానికే భయపడాలి. ఆదమరిచి కంటినిండా నిద్రపోవడానికి బెదిరిపోవాలి, అంతా కట్టకట్టుకుని మంత్రగాడి ముందు చేతులు జోడించి ఊరిని కాపాడమని ప్రాధేయపడేలా చేయాలి... అదీ పథకం. మంత్రగాడికి తోడు ఆ ఊరిలోని రామారావు అనే వ్యక్తి. రంగునీళ్లిచ్చి టానిక్కు అని చెబితే జనం నమ్మే రోజులు పోవడంతో అతడికి ఆర్థిక కష్టాలు వచ్చేశాయి. గడ్డం గీసి, క్షవరం చేసుకుంటూ ఎన్నాళ్లు బతకాలి. ఈ వృత్తిని నమ్మకంగా నమ్ముకుంటే తన బతుకు క్షవరం అవుతుందనుకున్నాడు. మూడు రంగు చొక్కాలు, ఆరు జేబు రుమాళ్లతో జల్సాగా జీవించాలంటే ఊరి వాళ్లని సమూలంగా మోసం చేయాల్సిందే అనుకున్నాడు. ఆ ఊరి మంత్రగాడితో చేయి కలిపాడు. ఆ ఇద్దరూ పన్నిన పన్నాగంలో ఊరు చిత్తుగా మునిగిపోయింది. గాల్లోంచి మంటలెలా వచ్చాయంటే..? కొబ్బరి కాయ మీద ఫాస్ఫరస్ పెట్టి చూరులో పెట్టేవారు. భాస్వరం గాలిలోని ఆక్సిజన్‌తో కలిసి మండేది. ఇదేమీ తెలియని ఊరి వాళ్లు గాల్లోంచి మంటలొచ్చాయని, ఊరిని కొరివి దెయ్యం పూనిందని భయపడిపోయారు. గ్రామాల్లో గడ్డివాములు తగలబడడంలోనూ ఇదే ఫార్ములా. పచ్చభాస్వరాన్ని నీటిలో నుంచి పేడలో పెట్టి వదిలేస్తే చాలు. పేడలో తడి పూర్తిగా ఎండిపోయిన తర్వాత అంటే రెండు-మూడు రోజులకు భాస్వరం... గాల్లోని ఆక్సిజెన్‌తో కలిసి మండుతుంది. మంట రావడానికి ముందు అక్కడ మనిషి ఆనవాలు కూడా ఉండదు. కానీ మంట వస్తుంది. - వాకా మంజులారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇలా ఛేదించాం! ఆ ఊరికి వెళ్లి మంటలంటుకున్న ఇళ్లంటినీ చూశాం. అన్ని ఇళ్లకీ ఒకే ఎత్తులో మంటలు రేగినట్లు ఉంది. అది కూడా ఐదారడుగులకు మించకుండా మనిషి చేతికందే ఎత్తులోనే. ప్రమాదవశాత్తూ సంభవించిన మంట ఒక్కటీ లేదు. ఎవరో మనిషే పెట్టాడని నిర్ధారించుకున్నాం. ఊరి వాళ్ల ముందు మేము కొబ్బరికాయ మీద భాస్వరాన్ని పెట్టి మండించి చూపించాం. ఇల్లు కాలినప్పుడు కూడా ఇలాంటి వాసనే వచ్చిందని చెప్పారు. ఎక్కువ ఇళ్లు ఉదయం పది గంటల పైన... అంటే అంతా పనులకు పొలానికి వెళ్లిన తర్వాత మాత్రమే తగలబడ్డాయి. మా బృందం దర్యాప్తులో మంత్రగాడు, మంగలి వ్యక్తి కలిసి చేసినట్లు నిర్ధారణ అయింది. పోలీసు విచారణలో వాళ్లు తప్పును అంగీకరించారు. - జి. మాల్యాద్రి, కన్వీనర్, జేవీవీ ప్రచురణల విభాగం, నెల్లూరు -
కప్పు టీతో గుండెజబ్బులు దూరం
ప్రతి రోజూ ఓ కప్పు టీ తాగితే గుండెపోటు.. స్ట్రోక్ లాంటి ప్రమాదాలను నివారించుకోవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. అసలు టీ తాగనివారితో పోలిస్తే రోజుకు ఒక కప్పు టీ తాగేవారిలో గుండెపోటు లేదా ఇతర హృదయ సంబంధిత వ్యాధులు సంక్రమించే అవకాశం 35 శాతం తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. టీ తాగే అలవాటు ఉన్నవారిలో గుండెలోని ధమనుల్లో కాల్షియం తక్కువగా ఉన్నట్లు అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ ఆస్పత్రి శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ధమనుల్లో పేరుకునే కాల్షియం నిక్షేపాలు గుండెజబ్బులకు, స్ల్రోక్తో పాటు ఇతర ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులను తగ్గించేదుకు టీ ప్రయోజనకరంగా ఉన్నట్లు తమ అధ్యయనాల్లో తేలిందని జాన్స్ హాప్కిన్స్ ఆస్పత్రి పరిశోధక బృందం సభ్యులు ఇలియట్ మిల్లర్ తెలిపారు. 2000 సంవత్సరంలో పరిశోధనలు ప్రారంభించినప్పుడు మొదట్లో సుమారు 6 వేల మందికి పైగా పురుషులు, మహిళలు పాల్గొన్నారని, వారెఎవ్వరికీ ఎలాంటి గుండెజబ్బులూ లేవని పరిశోధకులు తెలిపారు. తర్వాత 11 ఏళ్లలో గుండెనొప్పి, స్ల్రోక్, ఛాతీనొప్పితో బాధపడే వారితోపాటు కొందరు ఇతర గుండెజబ్బులతో మరణించిన వారి ట్రాక్ రికార్డును పరిశీలించగా... ముందుతో పోలిస్తే ఐదేళ్ల తర్వాత వారి రక్తనాళాల్లో కాల్షియం నిక్షేపాలు పేరుకున్నట్లు అధ్యయనాల ద్వారా తెలిసిందని పరిశోధకులు చెప్తున్నారు. పరిశోధన సమయంలో రోజూ ఓ కప్పు టీ తాగినవారిలో మాత్రం అస్సలు టీ తాగనివారి కంటే మూడింట ఒకవంతు గుండెనొప్పి వంటి ప్రమాదాలకు దూరంగా ఉన్నట్లు పరిశోధనల్లో తేల్చారు. -
టీ తాగడంలో ఘనాపా‘టీ’లు
భారతీయుల జాతీయ పానీయం టీ కావచ్చు గానీ టీ తాగడంలో మనోళ్లను మించిన ఘనాపాటీలు ఐరిష్ ప్రజలు. ప్రపంచవ్యాప్తంగా టీ అత్యధిక తలసరి వినియోగం జరిగేది ఐర్లాండ్‌లోనే. ఐరిష్ ప్రజలు సగటున రోజుకు 3.2 కప్పులు... అంటే... ఏటా 1184 కప్పుల టీ చప్పరించేసేస్తారట. ఈ లెక్కలు అధికారికంగా తేలడంతో గిన్నెస్ బుక్ సైతం ఐరిష్ ప్రజల ఘనతను గుర్తించి టీ తాగడంలో వారే ఘనాపాటీలని రికార్డు నమోదు చేసుకుంది.