ఆనంద్‌ మహింద్ర మనసు దోచిన 'కప్పు': ఫోటో వైరల్‌ | Viral Video: Anand Mahindra Took Twitter Share Quirky Cup | Sakshi
Sakshi News home page

ఆనంద్‌ మహింద్ర మనసు దోచిన 'కప్పు':ఫోటో వైరల్‌

Published Wed, Aug 10 2022 7:09 PM | Last Updated on Wed, Aug 10 2022 7:17 PM

Viral Video: Anand Mahindra Took Twitter Share Quirky Cup - Sakshi

ప్రముఖ పారిశ్రామికవేత్త సోషల్‌ మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ తరుచుగా మంచి మంచి వైరల్‌ వీడియోలు పోస్ట్‌ చేస్తూ ఉంటారు. ఆ వీడియోల నుంచి మంచి మంచి సందేశాలను కూడా ఇస్తుంటారు కూడా. అదే తరహాలో ఒక వైరల్‌ ఫోటో సోషల్‌ మాధ్యమంలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఆ ఫోటో ఆనంద్‌ మహింద్ర మనసును దోచింది. 

ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే...ఒక తెల్లటి కప్పు పై టిక్‌టాక్‌ గేమ్‌ ఒకటి ఉంది. అదేలా ఉందంటే... ఆ కాఫీ కప్పుపై 'థింక్‌ అవుట్‌ బాక్స్‌' అని ఉండి కింద గేమ్‌ అనుసంధానించి ఉంది. అది బాక్స్‌ అనే పదంలోని ఎక్స్‌తో అనుసంధానమయ్యి బాక్స్‌ నుంచి బయటపడే మార్గం చూపుతుంది. ఇది ఒక మంచి చక్కని సందేశాన్ని ఇచ్చిందంటూ... ఆనంద్‌ మహింద్ర ఆ  కప్పును తెగ మెచ్చకుంటూ ఆ విషయాన్ని వివరించారు. ఈ మేరకు ఆయన ఆ సందేశం వివరిస్తూ...ఇది ఒక రకంగా మనం మన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేస్తోంది.

నిజానికి మనం సమస్య లోనే ఉండిపోయి కాకుండా బయటగా ఉండి ఎలా బయటపడాలో అన్వేషించాలి అనే ఒక చక్కని సందేశాన్ని ఇస్తోంది. గెలిచే మార్గాలను అన్వేషించడం తోపాటు సమస్య నుంచి బయటపడే పరిష్కార మార్గాలు గురించి తెలియజేస్తోంది. అన్నారు. అంతేకాదు ఇది అద్భుతమైన కప్పు, వెంటనే తాను ఆ కప్పును తెచ్చుకుంటానంటూ ట్వీట్‌ చేశారు. నెటిజన్లు కూడా ఆయనతో ఏకభవిస్తూ ఔను ఇది మంచి సందేశాన్ని ఇచ్చింది. ఎలా తెలివిగా సమస్యలు పరిష్కరించుకోవాలో తెలియజేస్తోంది అంటూ ట్వీట్‌ చేయడం ప్రారంభించారు.  ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

(చదవండి: Viral Video: ఆహా! కోటు వేసుకోవడం ఎంత కష్టమో... బైడెన్‌ చూస్తే తెలుస్తుంది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement