ఎన్నో విలాసవంతమైన వస్తువులను చూసుంటాం. వాచ్‌ల దగ్గర నుంచి హ్యండ్ బ్యాగ్‌లు, వ్యాలెట్ వరకు అత్యంత ఖరీదు పలికిన బ్రాండ్‌లు చూశాం. ఓ సాధారణ టీ కప్పు అత్యంత ఖరీదైనదిగా ఉంటుందంటే నమ్ముతారా. మహా అయితే రూ. 30 వేల నుంచి రూ. లక్ష రూపాయాల విలవు చేసే ప్రత్యేకమైన మెటీరియల్‌తో చేసి ఉండొచ్చు. అంతేగానీ మరీ ఇంత రేంజ్‌లో ధర ఉండదు. అంత ఖరీదైన టీకప్పు ఎక్కడ ఉందంటే..
జపనీస్ డిపార్ట్‌మెంట్ స్టోర్ చైన్ తకాషిమయాలో అత్యంత ఖరీదైన టీ కప్పు ఉంది. దీని ధర ఏకంగా రూ. 56 లక్షలు. దీన్ని స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారంలో తయారు చేశారట. అమ్మకానికి వివిధ బంగారు వస్తువులను ప్రదర్శనగా ఉంచగా ఈ టీకప్పు దురదృష్టవశాత్తు అపహరణకు గురయ్యింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఈ వస్తువుని జేబులో వేసుకుని పారిపోతున్నట్లు వీడియో ఫుటేజ్‌లో కనిపించింది.
అయితే ఆ వ్యక్తి ఎవరన్నది తెలియరాలేదు. ఈ ప్రదర్శనలో దాదాపు వెయ్యికి పైగా టీవేర్ టేబుల్ వేర్ వంటి కళఖండాలు ఉన్నాయని, వాటిల్లో ఈ టీ కప్పు త్యంత ఖరీదైనదని అన్నారు తకాషిమయా స్టోర్ ప్రతినిధి. "తాము ఆ వస్తువులను అమ్మకానికి పారదర్శకమైన అన్‌లాక్ పెట్టేలో ఉంచామని, దీన్ని పసిగట్టిన కస్టమర్లు సులభంగా బయటకు తీసి ఉండొచ్చు. సీసీఫుటేజ్‌లో ఓ వ్యక్తి టీ కప్పుని తన బ్యాగ్‌లో వేసుకుని పారిపోతున్నట్లు మేము చూశాం. ప్రస్తుతం పోలీసులు సదరు వ్యక్తి కనిపెట్టే పనిలో ఉన్నారు. అయినప్పటకీ తమ స్టోర్ అమ్మకాల ప్రదర్శన నిరాటకంగా కొనసాగుతుందని, పైగా భద్రతను కూడా మరింత పటిష్టం చేస్తామని చెప్పారు." స్టోర్ ప్రతినిధులు.
(చదవండి: చిచ్చర పిడుగు!..తొమ్మిదేళ్లకే ఏకంగా 75 కిలోలు..!)
Comments
Please login to add a commentAdd a comment