వాషింగ్టన్: ఉత్తర కొరియా పర్యటన నిషేధం మరో ఏడాది పాటు పెంచినట్లు అమెరికా ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది. ఈ నిషేధం ఆగస్టు 31, 2023 వరకు ఉంటుందని అమెరికా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ నిషేధాన్ని అమెరికా 2017 నుంచి అమలు చేస్తూ వస్తోంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది నిషేధాన్ని పెంచుతూనే ఉంది అమెరికా. యూఎస్ పౌరులకు ఉత్తర కొరియా పర్యటన అత్యంత ప్రమాదకరమని వారి భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా యంత్రాంగం పేర్కొంది.
అమెరికా విదేశాంగ కార్యదర్శి ప్రత్యేకంగా ఆ పర్యటనకు ధృవీకరించనప్పుడే మినహా మరే ఏవిధంగాను అమెరికా వీసాలు చెల్లుబాటు కావని పేర్కొంది. 2017లో ప్రచార పోస్టర్‌ని దొంగలించాడనే ఆరోపణలతో అమెరికా విద్యార్థి ఒట్టో వార్మ్‌బియర్‌ని ఉత్తర కొరియా పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేయడంతో మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి ఉత్తరకొరియా పర్యటనలను అమెరికా నిషేధించడం ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment