జర్మనీలో మహేశ్‌ బాబు.. ఎందుకో తెలుసా? | mahesh babu travel to germany for technical work of ss rajamouli film ssmb29 | Sakshi
Sakshi News home page

జర్మనీలో మహేశ్‌ బాబు.. ఎందుకో తెలుసా?

Published Sat, Jan 20 2024 4:52 AM | Last Updated on Sat, Jan 20 2024 7:50 AM

mahesh babu travel to germany for technical work of ss rajamouli film ssmb29 - Sakshi

జర్మనీ వెళ్లారు మహేశ్‌బాబు. దర్శకుడు రాజమౌళి, హీరో మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ బడ్జెట్‌ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కేఎల్‌ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రధానంగా ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్‌ అడ్వెంచరస్‌ మూవీ ప్రీప్రోడక్షన్‌ వర్క్స్‌ను ఈపాటికే మొదలుపెట్టారు రాజమౌళి.

తాజాగా ఈ పనులు మరింత ఊపందుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో తన లుక్, మేకోవర్‌ గురించిన సాంకేతికపరమైన విషయాల గురించిన పనుల కోసం మహేశ్‌బాబు జర్మనీ వెళ్లారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ను విజయేంద్రప్రసాద్‌ దాదాపు పూర్తి చేసేశారని, వేసవిలో షూటింగ్‌ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement