ఆడపిల్ల పుట్టిందని.. | father dropped his daughter from top of the house | Sakshi
Sakshi News home page

ఆడపిల్ల పుట్టిందని..

Published Sun, Nov 2 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM

father dropped his daughter from top of the house

డాబా పైనుంచి పడేసిన తండ్రి

కంగ్టి: ఆడపిల్ల పుట్టిందని పసికందును ఇంటి డాబా నుంచి పడేశాడు ఓ తండ్రి. ఈ సంఘటన మెదక్ జిల్లా కంగ్టి మండలం జీర్గితండాలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ ప్రదీప్‌బాబు కథనం మేరకు.. చౌకాన్‌పల్లి పంచాయతీ జీర్గితండాకు చెందిన బన్సీరాం కుమార్తె శీలాబాయికు నిజామాబాద్ జిల్లా జుక్కల్ మండలం మమదాపురం తండాకు చెందిన దేవిదాస్ రాథోడ్‌తో గతేడాది వివాహం జరిగింది. శీలాబాయి ప్రసూతి నిమిత్తం రెండు నెలల కిందట పుట్టింటికి వెళ్లింది.

అదే సమయంలో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. భార్యాబిడ్డను చూసేందుకు దేవిదాస్ శుక్రవారం జీర్గితండాకు వచ్చాడు. ఆడపిల్ల పుట్టడంతో భార్యతో గొడవకు దిగాడు. అనంతరం శిశువును డాబాపై నుంచి పడేశాడు. శిశువుకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబసభ్యులు బీదర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement