సాక్షి, ముంబై : తినడానికి చికెన్ అడిగితే ఓ డాబా యజమాని లేదన్నాడన్న కోపంతో డాబాను తగులబెట్టారు ఇద్దరు తాగుబోతులు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శంకర్ తైదే, సాగర్ పాటెల్‌లు ఆదివారం రాత్రి ఒంటి గంట సమయంలో నాగ్‌పూర్, బెల్‌ట్రోడీలోని ఓ డాబాకు వెళ్లారు. చికెన్ ఆర్డర్ చేశారు. ( కిడ్నాప్ కేసు: అఖిలప్రియ వాడిన సిమ్ నంబర్ ఇదే..)
అయితే డాబాలో చికెన్ లేకపోవటంతో అదే విషయాన్ని వారికి చెప్పాడు డాబా యజమాని. దీంతో వారు అతడితో వాగ్వివాదానికి దిగారు. అనంతరం డాబాకు నిప్పంటించారు. యజమాని కళ్లముందే డాబా కాలి బూడిదైంది. దీంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment