శునకాలు మనుషుల జీవితాల్లో భాగమైపోయాయి. చాలా ఇళ్లలో అవి కూడా సభ్యులుగా ఉంటున్నాయి. వివిధ రకాల జాతుల శునకాలను వేలు.. లక్షల రూపాయలు పెట్టి మరీ కొని ప్రేమగా పెంచుకుంటున్నారు. వాటి పోషణ, సంరక్షణ కోసం ఎంత ఖర్చయినా వెనకాడటం లేదు డాగ్ లవర్స్. ఈ క్రమంలోనే కుక్కల కోసం ప్రత్యేకమైన స్పాలు, హోటళ్లు, రెస్టారెంట్‌లు ఏర్పాటవుతున్నాయి.
డాగ్ లవర్స్ తమ పెంపుడు శునకాలను తమతో పాటు హోటళ్లకు, రెస్టారెంట్‌లకు తీసుకెళ్లడానికి ఇష్టపడుతుంటారు. అయితే వాటికి అక్కడ అనువైన వాతావరణం ఉండదు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శునకాల కోసమే ప్రత్యేకంగా ‘డాగీ దాబా’ పేరుతో ఓ రెస్టారెంట్ ప్రారంభమైంది. ఇక్కడ కుక్కల కోసం చాలా రకాల వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వంటకాలు లభిస్తాయి. రూ.7 నుంచి రూ.500 వరకు శునకాలకు ఇష్టమైన ఆహారం అందిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ కుక్కల పుట్టినరోజులను జరుపుకోవచ్చు. ఇందు కోసం ప్రత్యేకమైన కేక్‌లు ఇక్కడ తయారు చేస్తున్నారు. కుక్కలు ఆడుకునేందుకు, విహారం చేసేందుకు అనువైన ఏర్పాట్లు సైతం చేశారు.
(ఇదీ చదవండి: అతిగా ఫోన్ వాడుతున్నారా.. ఈమెకు జరిగిందే మీకూ జరగొచ్చు!)
బాలరాజ్ ఝాలా అనే వ్యక్తి అతని భార్య కలిసి ఈ డాగీ దాబాను ఏర్పాటు చేశారు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో తమకు ఈ ఆలోచన వచ్చిందని ఆయన చెప్పారు. తాను హోటల్‌లో పనిచేస్తున్న సమయంలో రోజూ ఇంటికి వెళ్లేటప్పుడు కుక్కలకు ఆహారం వేసేవాడినని, ఈ సమయంలోనే కుక్కలకు మంచి ఆహారం అందించాలన్న ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైన రెస్టారెంట్ ఏర్పాటు చేసినట్లు బాలరాజ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment