బెంగళూరు ఘటనలో ఐదుగురి అరెస్ట్ | TanzanianGirl assault case:5 people arrested by Bengaluru Police till now | Sakshi
Sakshi News home page

బెంగళూరు ఘటనలో ఐదుగురి అరెస్ట్

Published Thu, Feb 4 2016 10:41 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM

బెంగళూరు ఘటనలో ఐదుగురి అరెస్ట్

బెంగళూరు ఘటనలో ఐదుగురి అరెస్ట్

బెంగళూరు: టాంజానియా యువతిని నడిరోడ్డుపై వివస్త్రను చేసి భౌతిక దాడికి పాల్పడిన ఘటనలో ఇప్పటివరకు ఐదుగురిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం హెసరగట్ట ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదానికి కారణమైన కారులో కూర్చున్న టాంజానియా యువతిపై స్థానికులు అవమానకరరీతిలో దాడి చేశారు.

దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టాంజానియా హై కమిషనర్ జాన్ కిజాజీ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశామని తెలిపారు. టాంజానియా యువతిపై దాడి చేయడాన్ని అవమానకర ఘటనగా విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ పేర్కొన్నారు. ఈ ఘటన ఎంతో బాధ కలిగించిందని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement