Tribal People
-
దళిత, గిరిజనులను మోసం చేసిన కేసీఆర్
కడెం: సీఎం కేసీఆర్ దళిత, గిరిజనులను మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ కిసాన్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకెట అన్వేశ్‌రెడ్డి ఆరోపించారు. మండలంలోని కొండుకూర్ గ్రామంలోని ఓ ఫంక్షన్హాల్లో ఉట్నూర్ జెడ్పీటీసీ, పీసీసీ సభ్యురాలు రాథోడ్ చారులత ఆధ్వర్యంలో సోమవారం దళిత, గిరిజన ఆత్మ గౌరవసభ నిర్వహించారు. ముఖ్య అథితిగా అన్వేశ్‌రెడ్డి హాజరయ్యారు. దళితబంధు పేరుతో లబ్ధిదారుల నుంచి కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు మూడు లక్షల వరకు వసూలు చేశారన్నారు. దళితులకు మూడెకరాల భూమి అని కొంతమందికి ఇచ్చి హామీని మరిచారన్నారు. ఇప్పటి వరకు ఖానాపూర్ నియోజవర్గంలో ఒక్క డబుల్బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ హాయంలో ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెట్టి గూడులేని ఎంతో మంది నిరుపేదలకు ఇంటి నిర్మాణానికి సాయం అందించారని అన్నారు. గతేడాది కడెం ప్రాజెక్ట్ నుంచి వచ్చిన భారీ వరదలతో ఎంతో మంది రైతుల భూములు, పంటలు నష్టపోయినా ప్రభుత్వం సాయం అందించకపోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించిన విధంగా ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, ధరణి పోర్టల్ రద్దు, కిసాన్ కమిషన్ ఏర్పాటు, వ్యవసాయానికి ఉపాధిహామీ పథకం వర్తింపు, పోడు, అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు, కౌలు రైతులకు రూ.15 వేలు, భూమిలేని ఉపాధిహామీ కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం, భూమిలేని రైతులకు రైతుబీమా వర్తింపు, రూ.500లకే సిలిండర్, తదితర పథకాలను అమలు చేస్తామని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భరత్‌చౌహాన్, ఎల్డీఎం(లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్) పార్లమెంట్ ఇన్చార్జి రఘునాథరెడ్డి, నియోజవర్గ ఇన్చార్జి సత్యనారయణ, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు రమేశ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, మహిళ విభాగం జిల్లా ఉపాధ్యాక్షురాలు గీతారెడ్డి, జిల్లా నాయకులు మల్లారెడ్డి, శంతన్‌రెడ్డి, సతీశ్‌రెడ్డి, ప్రభాకర్, బాపురావు, సత్యం, వెంకటేశ్, సలీం, రహీం, శంకర్ తదితరులు ఉన్నారు. -
ఆదివాసీలను కించ పర్చేలా కేసీఆర్ వ్యాఖ్యలు: వైఎస్ షర్మిల
-
భయం మొదలైందా..? ఇన్నాళ్లకు ఆ ఎంపీకి జ్ఞానోదయం కలిగిందా?
ఆ సంఘం ఓ వ్యక్తికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది. ఒకసారి ఎమ్మెల్యేను చేసింది. మరోసారి ఎంపీని చేసింది. ఎంపీ కాగానే రాజకీయ జన్మనిచ్చిన సంఘాన్ని వదిలేశారాయన. జనానికి దూరమై రాజకీయంగా బలహీనమయ్యారు. ఇన్నాళ్ల తర్వాత ఆ ఎంపీకి జ్ఞానోదయం కలిగింది. మళ్లీ తనకు జీవితాన్నిచ్చిన సంఘానికి సారథ్యం వహించాలని అనుకుంటున్నారు. ఆదివాసీలకు దగ్గర కావాలంటే ఆ సంఘం నాయకత్వం ఎంత అవసరమో గ్రహించారు. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు? ఆ సంఘం సంగతేంటి? ఉద్యమం నుంచి ఢిల్లీ దాకా తెలంగాణలో అణగారిన వర్గంగా ఉన్న గోండు తెగ ఆదివాసీల్లో చైతన్యాన్ని రగిల్చిన సంస్థ తుడుం దెబ్బ. సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరుగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుకు గుర్తింపు లభించింది. ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా బీజేపీ తరపున విజయం సాధించారు. ఏడాదిన్నర క్రితం వరకు తుడుం దెబ్బకు నాయకత్వం వహించిన సోయం బాపూరావు.. ఎంపీ బాధ్యతల కారణంగా సంఘం నాయకత్వాన్ని వదులుకున్నారు. ఉద్యమ సారథిగా ఉన్న కాలంలో గల్లీ నుండి ఢిల్లీ దాకా ఉద్యమం నడిపారు. ఆదివాసీల హక్కుల కోసం బలమైన ఉద్యమం నిర్మించడం ద్వారానే నాయకుడిగా గుర్తింపు పొందారాయన. మమ్మల్ని దూరం పెడతారా? ఆదివాసీల మద్దతుతోనే పార్లమెంట్లో అడుగు పెట్టిన సోయం బాపూరావు.. లంబడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని పోరాటం చేశారు. పోరాటం అగిపోయింది. సంఘం బాధ్యతల నుంచి కూడా ఏడాదిన్నర క్రితం తప్పుకున్నారు. తాము నమ్మి ఎంపీనీ చేసిన నాయకుడు ఉద్యమం నుండి వైదొలగడం అదివాసీలను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందట. ఎంపీ మీద ఆగ్రహంతో రగిలిపోతున్నారని తెలుస్తోంది. ఆయన వైఖరితోనే ఉద్యమ కాలంలో బాపూరావు వెన్నంటి ఉన్న నేతలంతా ఒక్కొక్కరుగా ఆయన్ను వీడిపోయారట. ఏడాదిరన్నరలోగానే లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సమయంలో ఆదివాసీలు దూరం కావడంతో.. ఎంపీకి జ్ఞానోదయం కలిగిందంటున్నారు. ఆదివాసీలంతా తనకు వ్యతిరేకంగా ఉన్నారని సర్వేల్లో తేలిందట. మీ మాట వింట.. మీ వెంట ఉంటా.! పరిస్థితి అర్థం కావడంతో ఎంపీకి దడ మొదలైందట. గతంలో ఒక పిలుపునిస్తే చాలు... వేలాదిగా రోడ్ల మీదకు వచ్చేవారు. వారి వల్లే ఢిల్లీ వరకు వెళ్ళగలిగిన తాను.. ఇప్పుడు ఓడి పోవడం ఖాయమనే భయం మొదలైందట. దీంతో మళ్ళీ తన సామాజిక వర్గమైన ఆదివాసీలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట. అందులో భాగంగానే తుడుం దెబ్బ అధ్యక్ష పదవి మళ్లీ చేపట్టాలని భావిస్తున్నారని సమాచారం. తనకు అనుకూలంగా ఉన్నవారి ద్వారా తిరిగి పదవి దక్కించుకోవడానికి సోయం బాపూరావు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. తనకు పదవి అప్పగిస్తే చాలు అదివాసీల హక్కుల కోసం మళ్లీ పోరాటం సాగిస్తానని హామీ ఇస్తున్నారట. ఆదిలాబాద్ ఎంపీ గోండులకు దగ్గర కావడానికి ఎంత ప్రయత్నిస్తున్నా.. తుడుం దెబ్బ బాధ్యతలను తిరిగి బాపూరావుకు అప్పగించడానికి ఆయన వ్యతిరేక వర్గం సిద్ధంగా లేదని తెలుస్తోంది. సోయం ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో... ఆదివాసీలు మద్దతు ఎంతవరకు కూడగడతారో చూడాలి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
అడవిబిడ్డల గుండెల్లో శ్రీనివాస్
మైసూరు: తమ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కీలకపాత్ర పోషించి, అడవిదొంగ వీరప్పన్ చేతిలో 29 ఏళ్ల కిందట హతమైన ఆంధ్రాకు చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిని కర్ణాటకలోని చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని అడవి బిడ్డలు నేటికీ ఆరాధిస్తున్నారు. వీరప్పన్ జన్మస్థలంలో ఆ అధికారి విగ్రహాన్ని ఏర్పాటుచేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాజమండ్రికి చెందిన పందిళ్లపల్లి శ్రీనివాస్ కర్ణాటకలో డిప్యూటీ ఫారెస్ట్ కన్సర్వేటర్గా ఉంటూ వీరప్పన్‌ను పట్టుకునే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆ సమయంలో చామరాజనగర జిల్లాలోని గిరిజన గ్రామాలకు విద్యుత్, తాగునీరు, రోడ్ల నిర్మాణం, పక్కా ఇళ్ల మంజూరు వంటివి చేపట్టడంలో శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. వీరప్పన్ స్వగ్రామం గోపినాథంలో శ్రీనివాస్ సొంత డబ్బుతో మారియమ్మ ఆలయాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలో 1991, నవంబరు 10వ తేదీన తన స్వగ్రామం గోపినాథంలో లొంగిపోతానని శ్రీనివాస్‌కు వీరప్పన్ సమాచారం పంపించాడు. అయితే, వీరప్పన్ పథకం ప్రకారం గోపినాథం గ్రామంలోకి శ్రీనివాస్ రాగానే కాల్చి చంపాడు. శ్రీనివాస్ అందించిన సేవలను గోపినాథం, సమీప గ్రామాల అడవిబిడ్డలు నేటికీ మరిచిపోలేదు. శ్రీనివాస్ మరణించిన గోపినాథం గ్రామంలోని మారియమ్మ ఆలయం పక్కన ఆయన కాంస్య విగ్రహాన్ని గ్రామస్తులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆదివారం శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొని శ్రీనివాస్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. (చదవండి: తల నరికేసే ఊరిలో రెండు దేశాల బోర్డర్) -
14 నుంచి గిరిజన రిజర్వేషన్ పోరు యాత్ర
పంజగుట్ట (హైదరాబాద్): ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తెలంగాణ వచ్చిన తర్వాతే గిరిజనులు ఎక్కువగా నష్టపోయారని పలు గిరిజన సంఘాల నాయకులు, వక్తలు అభిప్రాయ పడ్డారు. గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 30వ తేదీ వరకు కొనసాగనున్న ‘గిరిజన రిజర్వేషన్ పోరుయాత్ర’ రెండవ విడత పోస్టర్, కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ రవీందర్‌నాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, జనసేన యూత్ వింగ్ నాయకులు సంపత్‌నాయక్, కార్పొరేటర్ నీల రవినాయక్, బీజేపీ నాయకురాలు బాబీ మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ దాన్ని తుంగలో తొక్కారని, ఇప్పటికే వచ్చిన నోటిఫికేషన్లలో ఎంతో మంది గిరిజన యువకులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. 1,200 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ వారికి ఏం చేయకుండా పక్క రాష్ట్రాలకు వెళ్లి డబ్బులు పంచడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం తరహాలో రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ ఏర్పాటు, ట్యాంక్‌బండ్‌పై ఠానూ నాయక్ విగ్రహం ఏర్పా టు, కర్ణాటక తరహాలో తాండా ఫైనాన్స్ అండ్ డెవ లప్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
గుడిసెల తొలగింపుతో తిరగబడిన ఆదివాసీలు
సాక్షి, మంచిర్యాల/దండేపల్లి: అటవీ భూముల్లో గిరిజనుల గుడిసెల తొలగింపుతో జోరు వర్షంలోనూ అటవీ, పోలీసు అధికారులు, గిరిజనులకు మధ్య రెండో రోజూ ఘర్షణ కొనసాగింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడ శివారు అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న ఆరు తాత్కాలిక గుడిసెల తొలగింపు తీవ్ర ఉద్రిక్త తకు దారి తీసింది. గుడిసెలు తొలగించేందుకు శుక్రవారం ఉదయమే లక్సెట్టిపేట సీఐ కరీముల్లా ఖాన్ దాదాపు వంద మంది సిబ్బందితో వెళ్లారు. దీంతో గిరిజనులు కర్రలు, కారం పొడితో అధికారు లపై తిరగబడ్డారు. ఈ సందర్భంగా ఆరుగురు మహిళలను అధికారులు జీపుల్లో తరలి స్తుండగా గిరిజనులు దారిపొడవునా అడ్డుకుని, తమ వారిని విడిచిపెట్టాలని ఆందోళన చేశారు. అధికారులు వారిని పక్కకు నెట్టి మహిళలను తాళ్లపేట రేంజి ఆఫీసుకు తరలించారు. అక్కడ కూడా గిరిజనులు బైఠాయించి, సీపీఎం, వ్యవ సాయ కార్మిక సంఘం, బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన చేప ట్టారు. ఆది వాసీలను ఇబ్బందులకు గురిచేస్తున్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమా ండ్ చేశారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ హన్మంతరావు.. ఆ మహిళ లను బైండోవర్ చేస్తూ, 6 నెలలపాటు ఎలాంటి గొడవలకు పాల్పడవద్దని, లేకపోతే రూ.50వేల జరిమానా విధిస్తామని హెచ్చ రించి విడిచిపెట్టారు. ఇందులో దోసండ్ల సునీత అనే మహిళ తనను ఒంటరిగా గదిలో నిర్బంధించి అధికారులు చిత్రహింసలకు గురి చేశారని రోదిస్తూ చెప్పింది. రిజర్వు ఫారెస్టులో ఆక్రమణలు చేపడుతున్నారని, గత నెల 1న అటవీ అధికారులు కేసులు నమోదు చేయగా, అప్పటి నుంచి ఇరు పక్షాలమధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. -
భళిభళిరా.. బలి
జయపురం(భువనేశ్వర్): సబ్ డివిజన్ పరిధిలోని కుంద్రా గ్రామంలో ఇసుక పండగ(బలి జాతర)ను సోమవారం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో పరిసర గ్రామాలకు చెందిన గ్రామ దేవతల లాఠీలు పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన మార్కెట్ వద్ద వివిధ రకాల వస్తువులు, ఆహార పదార్థాల కొనుగోలుకు జనం ఆసక్తి చూపారు. గ్రామీణ వ్యవసాయ రంగంలో బలి జాతరకు అధిక ప్రాధాన్యమిస్తారు. అవిభక్త కొరాపుట్ జిల్లాలో ఆదివాసీలు జరుపుకొనే ప్రధాన పండుగల్లో ఇది కూడా ఒకటి. వర్షాకాలం ప్రారంభానికి సూచికగా బలి జాతర చేపట్టడం విశేషం. ఖరీఫ్ కాలంలో ఏ పంటలు వేస్తే ఉత్తమ దిగుబడులు సాధించవచ్చో తెలుసుకొకనే సూచికగా బలిజాతర జరపడం ఆనవాయితీ. పండగ కోసం ఆదివాసీ దిసారి(పూజారులు) మంచి రోజు నిర్ణయిస్తారు. ఆ రోజు మిగతా గ్రామాల దేవతలకు పూజలు చేసి, ఆమె ప్రతినిధిగా లాఠీ(జెండా)లతో వెదురుబుట్ట పట్టుకుని సమీపంలోని నదికి వెళ్తారు. నదిలో ఇసుకను గ్రామానికి తీసుకు వచ్చి, గ్రామదేవత గుడి ప్రాంగణంలో ప్రతిష్టించి, ఇళ్ల నుంచి సేకరించిన వివిధ రకాల విత్తనాలను ఇసుక బుట్టలో వేస్తారు. మొలకెత్తిన విత్తనాలు పరిశీలించి, బాగా మొలకెత్తిన పంట విత్తనాలు ఖరీఫ్ కాలంలో వేస్తే అధిక దిగుబడి సాధించవచ్చని అభిప్రాయానికి వచ్చారు. ఈ ఇసుక పండగకు వివిధ గ్రామాల ప్రజలను ఆహ్వానించారు. చదవండి: భారత్‌కు మంకీపాక్స్ ముప్పు.. ఇలా అనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే! -
ములుగు జిల్లాలో గిరిజనుల ఆందోళన
-
ఆంధ్రాలో ఆ ప్రాంత ప్రజలకు భోగి అంటే ఏంటో తెలీదంట!
సాక్షి,బొబ్బిలి: మండలంలోని డొంగురువలస, ఎరకందొరవలస, మోసూరువలస, బట్టివలస, అక్కేనవలస, రాజచెరువువలస, చిలకమ్మవలస, విజయపురి, సిమిడిగుడ్డివలస, మూలవలస తదితర 18 గిరిజన గ్రామాలకు భోగీ పండగ సంగతే తెలియదు. వారెవరూ భోగి, సంక్రాంతి పండగలు చేసుకోరు. వారంతా మైదాన ప్రాంతాలలో ఉన్న గిరిజనులే. బొబ్బిలి పట్టణానికి 5కిలోమీటర్ల దూరంలోనే నివసిస్తున్నారు. వీరంతా ఇటుక పండగ, పిల్లి పండగలను మాత్రమే నిర్వహిస్తారు. ఆ గిరిజనుల్లో కొందరు క్రిస్మస్ చేసుకుంటారు. అయితే ఇటీవలే సమరసతాసేవాసంస్థ డొంగురువలస, రాజచెరువువలస గిరిజనానికి హిందూమతాన్ని పరిచయం చేయడంతో హిందూ సంప్రదాయాలను ఇటీవల ప్రారంభించినప్పటికీ భోగి, సంక్రాంతి పండగలు నిర్వహించరు. -
మంత్రించిన యంత్రాలు.. తెరిచి చూస్తే పేలిపోతాయి
శృంగవరపుకోట: పిల్లలు కలగని దంపతులు, నిరుద్యోగులను టార్గెట్ చేసి మంత్రించిన యంత్రాల పేరుతో మోసగిస్తున్న ముగ్గురు దొంగస్వాములను ఎస్.కోట మండలం, ముషిడిపల్లి గిరిజన గ్రామంలో బుధవారం నిర్బంధించి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి దొంగస్వాములను పట్టుకున్న ముషిడిపల్లి గ్రామపెద్ద ముత్యాల సన్యాసిరావు, స్వాముల చేతిలో మోసపోయిన చీడిపాలెం గిరిజనులు చిమిడి జోగారావు, గడుబంటి రామకృష్ణ, జి.గంగరాజు, అప్పారావు, బి.గంగమ్మ, పొటుపర్తి జగన్నాథం తదితరులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన ఎస్.దుర్గారావు, విశాఖ జిల్లా వాడపల్లికి చెందిన సతీష్, కె.దుర్గారావు అనే ముగ్గురు వ్యక్తులు మంగళవారం ఉదయం గ్రామానికి వచ్చారు.స్వామిజీ శిష్యులమని చెప్పి గ్రామంలోని పలువురి నుంచి గిరిజన కుటుంబాల వివరాలు సేకరించారు. ఆ తర్వాత గిరిజనుల ఇళ్లకు వెళ్లి మీకు ఏళ్ల తరబడి పిల్లలు లేరని కొందరికి, మీకు ఉద్యోగాలు రాక బాధపడుతున్నారంటూ మరి కొందరికి చెప్పి కలిశారు. మీరు పడుతున్న సమస్యలను దుర్గారావు స్వామీజీ తీరుస్తారని చెప్పి రంగప్రవేశం చేయించారు. దొంగస్వామీజీ వచ్చి రూ.6వేలు చెల్లిస్తే మంత్రించిన యంత్రం, పూజ చేసిన సామగ్రి ఇస్తానని, వాటిని భద్రంగా దాచుకుంటే సమస్యలు తీరడంతో పాటు కోరికలు నెరవేరుతాయని నమ్మించి 9మంది నుంచి రూ.53వేలు వసూలు చేశాడు. మంత్రించిన యంత్రాలు, పూజాసామగ్రి గురించి ఎవరికీ చెప్పకూడదని, వాటిని తెరిచి చూస్తే పేలిపోతాయని స్వామిజీ బెదిరించాడు. నమ్మినట్లు ప్రవర్తించిన గ్రామపెద్ద దొంగ స్వామీజీ, ఇద్దరు శిష్యులు బుధవారం ఉదయం ముషిడిపల్లి గ్రామంలో ప్రవేశించి మాజీ సర్పంచ్ ముత్యాల సన్యాసమ్మ కుమారుడు ముత్యాల సన్యాసిరావును కలిసి మా వద్ద మంత్రించిన యంత్రాలను తీసుకుంటే కోరికలు వెంటనే తీరుతాయని నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో సన్యాసిరావు నమ్మినట్లు ప్రవర్తించి ముగ్గురు స్వాములను గ్రామంలోని రామాలయంలోకి తీసుకువెళ్లి లోపల ఉంచి బయట తాళం వేసి ఎస్.కోట పోలీసులకు సమాచారమందించాడు. ఈ విషయం తెలిసిన తరువాత స్థానికంగా మోసపోయిన చీడిపాలెం బాధితులు, గ్రామస్తులు పెద్దఎత్తున రామాలయం వద్దకు చేరుకున్నారు. బ్రాహ్మణ వేషధారణలో తిరుగుతూ అమాయకులను మోసగిస్తున్న ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆలయ పురోహితుడు దొంతుకుర్తి సాయికుమార్ శర్మ వారిని ప్రశ్నించగా ఒకసారి బ్రాహ్మణులమని, మరోసారి విశ్వబ్రాహ్మణులమని పొంతనలేని సమాధానాలిచ్చారు. పోలీసు సిబ్బంది రామాలయం వద్దకు చేరుకుని ముగ్గురినీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
కరోనాతో ప్రపంచదేశాలు గడగడ.. వారి జోలికి మాత్రం పోలేదు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/ములుగు: ప్రపంచ దేశాలన్నీ కోవిడ్ మహమ్మారితో గడగడలాడుతున్నాయి. కానీ వారి జోలికి మాత్రం పోలేదు. కరోనాతో సంబంధం లేకుండా ఆదివాసీ గిరిజన ప్రజలు సాఫీగా జీవనం సాగిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, ఆళ్లపల్లి, కరకగూడెం, పినపాక, ఇల్లెందు, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, అశ్వాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని పలు అటవీ ప్రాంతంలోని ఆదివాసీ గ్రామాల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా కరోనా బారిన పడకపోవడం గమనార్హం. ఆయా గ్రామాల ప్రజలు తమ గ్రామాల్లోనే ఆకుకూరలు, కూరగాయలు పండించుకోవడం, అడవుల్లో లభించే దుంపలు, కాయలు, ఆకులు, చింతపూలు ఆహారంగా తీసుకుంటుం టారు. అడవుల్లో లభించే విప్ప పువ్వు, కాయలు వాడుతారు. విప్ప పువ్వును ఆహారంగా తీసుకుంటూ.. విప్ప కాయలను గానుగ పట్టి నూనె తయా రు చేసుకుంటున్నారు. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు. పైగా కూరగాయలన్నీ సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నా రు. తమ గ్రామాలు దాటి ఎలాంటి శుభకార్యాల కోసం ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లట్లేదు. మాస్కులు, శానిటైజర్లు సైతం అవసరం లేకుండానే ఆయా గ్రామాల ప్రజలు నిశ్చింతగా ఉంటున్నారు. సాగుకే పరిమితం.. పినపాక నియోజకవర్గంలోని గుండాల మండలంలో 50 గిరిజన గ్రామాలుండగా.. 5 గ్రామాల్లో ఇంతవరకు కేసులు నమోదు కాలేదు. ఆళ్లపల్లి మండలంలో 40 గ్రామాలుండగా.. వీటిలో 5 గ్రామాల్లోనే కరోనా కేసులు నమోదయ్యాయి. కరకగూడెం మండలంలో 7 గ్రామాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు. పినపాక మండలంలోని పలు గ్రామాలు కోవిడ్ తమ దరికి చేరనీయలేదు. టేకులగూడెం, ఎర్రగుంట, పిట్టతోగు, ఉమేశ్ చంద్రనగర్, సుందరయ్యనగర్, తిర్లాపురం గ్రామాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వారు మాస్కులు, శానిటైజర్లు వాడట్లేదు. అశ్వాపురం మండల కేంద్రానికి దూరంగా మారుమూల దట్టమైన అటవీ ప్రాంతంలోని మనుబోతులగూడెంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మనుబోతులగూడెం గ్రామపంచాయతీలో 4 గొత్తికోయ గ్రామాలున్నాయి. ఐతయ్య గుంపులో 41, మడకం మల్లయ్య గుంపులో 11, మనుబోతులగూడెం గ్రామంలో 20 కుటుంబాలు, సంతోష్ గుంపు 28, పొడియం నాగేశ్వరరావు గుంపు 20, వేములూరు గ్రామంలో 40 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడి వారు ఇతర గ్రామాలకు, శుభకార్యాలకు వెళ్లకపోవడం, ఎక్కువ శాతం ఆ గ్రామానికే పరిమితం కావడంతో కరోనాకు దూరంగా ఉన్నారు. పైగా ఈ గ్రామాలకు ఇతర ప్రాంతాల వారు వచ్చే పరిస్థితి కూడా లేదు. జూలూరుపాడు మండలంలోని బాడవప్రోలు గ్రామంలో ఇప్పటివరకు ఒక్క కోవిడ్ కేసు నమోదు కాలేదు. భద్రాచలం నియోజకవర్గంలోని చత్తీస్‌గఢ్‌కు సరిహద్దులో ఉన్న చర్ల మండలం వీరాపురం గ్రామంలో 36 కుటుంబాలకు చెందిన 185 మంది జనాభా ఉన్నారు. ఇక్కడా ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటికీ అవే ఆచార వ్యవహారాలు ఇల్లెందు మండలం ముత్తారపుకట్ట, పూబెల్లి పంచాయతీల్లో పలు గిరిజన గూడెంలలో కరోనా జాడలు లేవు. ముఖ్యంగా ముత్తారపుకట్టలో వీరాపురం, కోటగడ్డలో మాణిక్యారం పంచాయతీలో ఒంపుగూడెం, పూబెల్లి పంచాయతీలో పూబెల్లి, పూబెల్లి స్కూల్ గుంపు, దండగుండాలలో కరోనా ఒక్కరికి కూడా రాలేదు. వీరాపురంలో 100 కుటుంబాలు, కోటగడ్డలో 30 కుటుంబాలు, ఒంపుగూడెంలో 100 కుటుంబాలు, పూబెల్లిలో 75 కుటుంబాలు, పూబెల్లి స్కూల్ గుంపులో 100 కుటుంబాలు, దండగుండాలలో 40 కుటుంబాలు ఉన్నాయి. వీరాపురంలో లంబాడీ, ఆదివాసీలు మినహా మిగిలిన ఈ గూడేలన్నీ ఆదివాసీలవే. వీరు తెల్లవారుజాము నుంచి వ్యవసాయ పనుల్లో ఉండటంతో బయటకు వెళ్లే సమయం కూడా దొరకట్లేదు. ఇప్పటికీ గిరిజన ఆచార వ్యవహారాలు గూడేలలో సాగుతున్నాయి. గంజి, గటకే ఆహారం! కొత్తగూడెం నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమళ్ల గ్రామపంచాయతీలో గంగమ్మ కాలనీ ఆదివాసీగూడెం ఉంది. ఈ గూడెంలో 24 ఇళ్లు మాత్రమే ఉంటాయి. వీరంతా వారికి సంబంధించిన పోడులను సాగు చేసుకుంటున్నారు. అడవిలో దొరికే దుంపలు, ఆకుకూరలను తింటూ జీవనం సాగిస్తున్నారు. వీరంతా చింతపూలను ఎక్కువగా ఆహారంలో తీసుకుంటారు. సౌర విద్యుత్‌నే వాడుతారు. పాల్వంచ మండలం రాళ్లచెలక గ్రామంలో 300 కుటుంబాలు ఉన్నాయి. అంతా ఆదివాసీలే. అడవిలో దొరికే వాటితోనే జీవనం సాగిస్తారు. తునికాకు సేకరణ, అటవీ ఉత్పత్తులను సేకరించి అమ్మకాలు చేసి జీవనం సాగిస్తారు. ఉదయన్నే గంజి తాగుతారు. గటక తింటారు. పాల్వంచ మండలం ఎర్రబోరు ఆదివాసీ గూడెంలో 150 కుటుంబాలున్నాయి. వీరు వరి, జొన్న వంటి పంటలు సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామాలన్నింటిలోనూ ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. శనగకుంట.. కరోనా లేదంట ములుగు జిల్లా శనగకుంట గ్రామంలో 153 కుటుంబాలు, 482 మంది జనాభా, 252 మంది ఓటర్లు ఉన్నారు. గతేడాది నుంచి ఇప్పటివరకు కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. గూడెం వాసులు ఎక్కువగా ఆకుకూర, బొద్దికూరలు, గురుజవెండి చెట్టు, పొత కాయలతో పచ్చడి చేసుకొని తింటారు. వ్యవసాయ పనులు, కూలీ పనులు చేసుకుంటారు. సాధారణగా లభించే కూరగాయలు, పప్పులు ఆహారంగా తీసుకుంటారు. తాగునీటి అవసరాలను బోరుబావుల ద్వారా తీర్చుకుంటారు. అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తల సూచనలు, సలహాలను తు.చ. తప్పక పాటిస్తారు. ములుగు జిల్లా లవ్వాల గ్రామానికి చెందిన ఈమె పేరు వాసం లక్ష్మి. ఇప్పటివరకు మూడు సార్లు కరోనా పరీక్ష చేసుకుం టే అన్నిసార్లు నెగెటివ్ వచ్చింది. మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. అవసరాల కోసం మాత్రమే బయటకు వెళ్తుంది. మిగతా రోజులు వ్యవసాయ పనులు చేస్తుంది. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప మాంసాహారం తీసుకోదు. పప్పుదినుసులు, ఆకుకూరలే ఆహారంలో ప్రధాన భాగం. ములుగు జిల్లా ఎక్కెల గ్రామానికి చెందిన ఈమె పేరు దుబ్బ కన్నమ్మ. ఇప్పటివరకు రెండు సార్లు కరోనా పరీక్ష చేసుకుంటే నెగెటివ్ వచ్చింది. రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న ఈమె అత్యవసర పని ఉంటే తప్ప గ్రామం నుంచి బయటకెళ్లదు. ఎక్కువగా పప్పుదినుసులు, ఆకుకూరలనే ఆహారంలో తీసుకుంటారు. వేసవిలో మొక్కజొన్న అంబలి తాగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో పనులు చేస్తుంది. గ్రామం నుంచి బయటకు వెళ్తే మొఖానికి ఏదైనా టవల్ లాంటిది కట్టుకుంది. ఎవరికి తాకకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. మా దరిదాపుల్లోకి కూడా రాదు కరోనా మా దరిదాపుల్లోకి కూడా రాలేదు. రాదు కూడా.. ఎందుకంటే మేం మానవ ప్రపంచానికి దూరంగా మారుమూల గ్రామాల్లో ఉంటున్నాం. జొన్నలు, రాగులు, కొర్రలు, సజ్జలను స్వయంగా పండించి వాటినే ఆహారంగా తీసుకుంటాం. ఆకుకూరలు, కూరగాయలు, నూనెలు వంటివి స్వయంగా సమకూర్చుకుంటాం. ఇప్పనూనెలో శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచే గుణం ఉంటుందని మా పూర్వీకులు చెప్పారు. – మడవి నంద, వీరాపురం ఆదివాసీ గ్రామం, చర్ల మండలం సమష్టి జీవన విధానమే మంత్రం గిరిజన గూడేలలో నేటికీ సమష్టి జీవన విధానం వల్ల గిరిజనం ఒకే మాట, ఒకే బాటపై కట్టుబడి ఉంటున్నారు. ముత్తారపు కట్ట పంచాయతీలో వీరాపురం, కోటగడ్డలో కరోనా జాడలేదు. పంచాయతీ తరఫున హైపోక్లోరైట్, బ్లీచింగ్ పిచికారి చేస్తున్నాం. మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నాం. కూరగాయలు పండించుకోవటం, పప్పులు ఇంటి నుంచే సేకరించుకోవడం, చింతపండు మా వద్దే ఉంటుంది. ఆరోగ్యం బాగోలేకుంటే గటక, జావ తాగుతారు. ఇలా బయటి ఆహార పదార్థాలంటేనే ముట్టుకోరు. – మంకిడి కృష్ణ, సర్పంచ్, ముత్తారపుకట్ట పంచాయతీ -
7 కిలోమీటర్లు స్టెచ్రర్‌పై మోసుకుంటూ..
సాక్షి, భువనేశ్వర్ : గిరిజన గ్రామాల్లో గర్భిణులు, రోగుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. తాజాగా ఓ గర్భిణిని కొండలపై నుంచి 7 కిలోమీటర్లు స్ట్రక్చర్‌పై మోసుకు వచ్చిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కొరాపుట్ జిల్లా బరిణిపుట్ పంచాయతీ కొండప్రాంతం లోని లట్టిగుడ గ్రామానికి చెందిన గుప్త జాని భార్య లక్ష్మికి గురువారం పురిటి నొప్పులు మొదలయ్యాయి. 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. గ్రామానికి చేరుకునేందుకు రహదారి లేకపోవడంతో అక్కడికి వరకు చేరుకోలేమని సిబ్బంది తెలిపారు. దీంతో కొందమంది మహిళలు గ్రామం నుంచి 7 కిలోమీటర్ల స్టెచ్రర్‌పై మోసుకుంటూ కొండ దిగువన ఉన్న రోడ్డుకు చేర్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో జయపురం ఫూల్బడి లోని కొరాపుట్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం లక్ష్మీ పండండి బిడ్డకు జన్మనిచ్చినట్లు సమాచారం. కాగా.. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రమంలో ఎవరికి అనారోగ్యం వచ్చినా.. ఇదే పరిస్థితి తలెత్తుతుందని, అధికారులు స్పందించి, రోడ్డు సౌకర్యం కల్పించాలని వారంతా కోరుతున్నారు. -
అడవిలోకి నడిచొచ్చిన ‘సంక్షేమం’
సాక్షి, తిరుపతి : అదంతా దట్టమైన అటవీ ప్రాంతం... అక్కడకు వెళ్లాలంటే రెండు కొండలు ఎక్కి దిగాలి. సుమారు 12 కి.మీ పైనే నడవాలి. జనావాసాలకు దూరంగా తరతరాలుగా కీకారణ్యంలో గడుపుతున్న నాలుగు ముస్లిం కుటుంబాలకు దాదాపు శతాబ్దం పాటు సర్కారు పథకాలు ఏవీ దరి చేరలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక తొలిసారిగా వారు ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ ద్వారా ప్రతి నెలా పింఛన్ అందుకుంటున్నారు. రేషన్ సరుకులు తీసుకుంటున్నారు. ప్రభుత్వం తమకు ఇళ్లు కూడా ఇస్తుందని చెప్పినా ఎందుకనో ఆగిపోయిందని నిట్టూరుస్తున్నారు. ఇల్లు ఇస్తే తాము కూడా జనావాసాల్లోకి వస్తామని చెబుతున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గం కల్లూరు రిజర్వు ఫారెస్టులో జీవనం సాగిస్తున్న ఆ కుటుంబాల గురించి తెలుసుకునేందుకు ‘సాక్షి’ బృందం శ్రమించి అక్కడకు చేరుకుంది. నాలుగు తరాలుగా అక్కడే.. సుమారు వందేళ్ల క్రితం ముర్తుజాఖాన్ అనే వ్యక్తి చిట్లిగుట్టకు అటవీ ప్రాంతానికి చేరుకుని నివాసం ఏర్పరచుకున్నాడు. అక్కడే ఉంటూ వివాహం చేసుకున్నాడు. ఆయన కుమారుడు మల్కీఖాన్ కూడా అక్కడే నివసిస్తూ పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఐదుగురు కుమారులు కూడా అడవితల్లి ఒడిలోనే పెరిగి పెద్దయ్యారు. ప్రస్తుతం వీరంతా పిల్లలతో కలసి అక్కడ ఉంటున్నారు. ఐదుగురు అన్నదమ్ముల్లో సయ్యద్‌ఖాన్ (16) పాముకాటుకు బలి కాగా మరో నలుగురు చిన్నారులు పాముకాటు, ఫిట్స్ కారణంగా మృత్యువాత పడ్డారు. ఒకసారి అడవికి నిప్పు అంటుకున్న సమయంలో ఓ ఇల్లు కూడా దగ్ధమైంది. అడవి ఒడిలోనే చిన్నారులు.. చిట్లిగుట్టలో 18 మంది చిన్నారులుండగా వీరెవరూ పాఠశాల ముఖం చూసిన దాఖలాలు లేవు. బడికి పంపాలంటే సుమారు 12 కి.మీ. దూరం వెళ్లాల్సి ఉంటుంది. నడిచి వెళ్లటం తప్ప వేరే మార్గం లేకపోవడంతో చిన్నారులు అడవికే పరిమితమయ్యారు. పంటలు, పండ్లతోటలు.. అక్కడ ఉంటున్న నాలుగు కుటుంబాలు రాళ్లు రప్పలు, చెట్లను తొలగించి సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో వరి, వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తూ పొట్టపోసుకుంటున్నాయి. మామిడి, కొబ్బరి చెట్లు పెంపకం ద్వారా పండ్లు, కాయలను సమీపంలోని కల్లూరులో విక్రయిస్తుంటారు. -
అడవి బిడ్డలకు ఆసరా
-
అదివాసీలకు వైరస్‌పై మరింత అవగాగన కల్పించాలి
-
ఆదివాసీ గ్రామాల్లో ఘనంగా దండారి ఉత్సవం
-
మాడగడలో ఆంత్రాక్స్ కలకలం
సాక్షి, అరకు(విశాఖపట్నం) : మాడగడ పంచాయతీ కేంద్రంలో ఇద్దరు గిరిజనులు ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ గ్రామానికి చెందిన జి.బుజ్జిబాబు, ఎం.కోటిబాబు చేతులు వాపు, చిన్న కురుపులు ఏర్పడడంతో స్థానిక పీహెచ్సీ వైద్యబృందం నాలుగు రోజుల క్రితం సేవలందించారు. ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాల అనుమానంతో వీరిద్దరిని కేజీహెచ్‌కు తరలించి,ఉ న్నత వైద్యసేవలు కల్పించారు. అయితే కేజీహెచ్ వైద్యులు బుజ్జిబాబు, కోటిబాబుల నుంచి రక్త నమునాలను సేకరించి పరీక్షలు జరుపుతున్నారు. వీరికి సోకినది ఆంత్రాక్స్.. ఇతర చర్మవ్యాధా అనేది నిర్థారణ కావల్సి ఉంది. సందర్శించిన సబ్ కలెక్టర్ మాడగడలో ఇద్దరు గిరిజనులు ఆంత్రాక్స్ లక్షణాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారనే సమాచారం మేరకు ప్రభుత్వం అప్రమత్తమైంది. పాడేరు సబ్‌కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మంగళవారం మాడగడ గ్రామాన్ని సందర్శించారు. డీఎంహెచ్‌వో తిరుపతిరావు, పశు సంవర్థకశాఖ ఏడీ రామకృష్ణ, పీహెచ్సీ వైద్యాధికారి వినీల, ఇతర వైద్యసిబ్బందిని అప్రమత్తం చేశారు. సబ్‌కలెక్టర్ గ్రామంలోని అన్ని వీధులను సందర్శించారు. ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఇద్దరు గిరిజనుల కుటుంబాలను పరామర్శించారు. బుజ్జిబాబు,కోటిబాబు ఆహార అలవాట్లపై ఆయన ఆరా తీశారు. వారం రోజుల క్రితం సుంకరమెట్ట వారపుసంతలో కొనుగోలు చేసిన పశుమాంసాన్ని వండుకు తినినట్టు కుటుం సభ్యులు కలెక్టర్‌కు తెలిపారు. బాకా బాబురావు అనే గిరిజనుడు తన చేతికి కూడా దురదలు వస్తున్నాయని చెప్పడంతో వెంటనే వైద్యసేవలందించి కేజీహెచ్‌కు తరలించాలని వైద్యబృందాన్ని సబ్‌కలెక్టర్ ఆదేశించారు. పశుమాంస విక్రయాలు నియంత్రిస్తాం ఏజెన్సీలోని అనారోగ్య పశువుల వధ, నిల్వ మాంసం అమ్మకాల విక్రయాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని సబ్‌కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ విలేకరులకు తెలిపారు.వారపుసంతల్లో పశుమాంసం విక్రయాలపై తనిఖీలు చేపట్టి, అవసరమైతే అమ్మకాలపై నిషేధం అమలుకు పాడేరు ఐటీడీఏ పీవో బాలాజీకి నివేదిక ఇస్తామన్నారు. ఆంత్రాక్స్ వ్యాధిపై గ్రామాల్లో గిరిజనులకు అవగాహన సదస్సులు నిర్వహించి, పశుమాంసానికి దూరంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పశువులకు ఆంత్రాక్స్, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పశు వైద్యశిబిరాలు నిర్వహిస్తామన్నారు.మాడగడ గ్రామంలో ఇద్దరు గిరిజనులు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారని, అయితే వారికి ఆంత్రాక్స్ వ్యాధి నిర్థారణ కాలేదన్నారు. గ్రామంలో అందరు గిరిజనులకు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు వైద్యబృందాలను అప్రమత్తం చేస్తున్నామని సబ్‌కలెక్టర్ వివరించారు. -
సారూ.. ఉపాధి కల్పించరూ..?
సాక్షి, శ్రీకాకుళం : ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ ఐటీడీఏలో సోమవారం జరిగిన గిరిజన దర్బార్‌లో పలువురు గిరిజనులు ఐటీడీఏ పరిపాలనాధికారి ఎల్.ఆనందరావుకు పెద్దమడికాలనీ, సీతంపేట, గడిగుడ్డిలకు చెందిన జన్నివాడు, జ్యోతి, సోమేశ్వర్రావు వినతిపత్రాలు సమర్పించారు. జీతం ఇప్పించాలని లబ్బకు చెందిన కీర్తి, విద్యుత్ స్తంభాలకు మరమ్మతులు చేయాలని నందిగాంకు చెందిన గున్నయ్య కోరారు. స్టాఫ్‌నర్స్ ఉద్యోగం ఇప్పించాలని దీనబందుపురానికి చెందిన తేజమ్మ పేర్కొన్నారు. ఆరో తరగతిలో చదివేందుకు సీటు ఇప్పించాలని కొత్తగూడకు చెందిన సౌందర్య విన్నవించారు. తిత్లీ నష్ట పరిహారం అందజేయాలని జాడుపల్లికి చెందిన పారమ్మ, గాసన్న వినతిపత్రం అందించారు. గ్రావిటేషన్ ఫ్లో మంజూరు చేయాలని గోటిగూడ గ్రామానికి చెందిన మోహన్‌రావు, ఆటో కొనుగోలుకు రుణం ఇప్పించాలని వజ్జాయిగూడకు చెందిన చంద్రరావు కోరారు. కొత్త పంచాయతీ భవనం నిర్మించాలని ఇరపాడుకు చెందిన రామారావు, తాగునీటి సదుపాయం కల్పించాలని కన్నయ్యగూడకు చెందిన దుర్గారావు విన్నవించారు. బోరు మంజూరు చేయాలని సూదిరాయగూడకు చెందిన ఎండయ్య, యూనిఫాం కుట్టేందుకు అనుమతి ఇప్పించాలని పెద్దూరుకు చెందిన పార్వతీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. సీఆర్టీ పోస్టు ఇప్పించాలని టెక్కలికి చెందిన ధనలక్ష్మి, పూనుపేటకు చెందిన రోహిణి పేర్కొన్నారు. నాటుకోళ్ల ఫారం పెట్టేందుకు రుణం ఇప్పించాలని ఉల్లిమానుగూడకు చెందిన సుంకయ్య, ఆశ వర్కర్ పోస్టు ఇప్పించాలని వి.కుమారి తెలిపారు. జలసిరి బోరు మంజూరు చేయాలని మనుమకొండకు చెందిన అన్నయ్య, రక్షణగోడ ఇప్పించాలని దీనబంధుపురానికి చెందిన లక్ష్మణరావు కోరారు. డీ పట్టాలు ఇప్పించాలని చిన్నబగ్గ కాలనీకి చెందిన కృష్ణారావు, మొబైల్ దుకాణం పెట్టుకునేందుకు రుణం ఇప్పించాలని భరణికోటకు చెందిన వినోద్ విన్నవించారు. చెరువు పనులు చేయించాలని సందిమానుగూడకు చెందిన బి.కూర్మారావు, బొండి గ్రామానికి చెందిన నాగేశ్వర్రావు పాఠశాల తెరిపించాలని వినతిపత్రం అందజేశారు. దర్బార్‌లో ఈఈ మురళీ, డైజీ, హౌసింగ్ ఏఈ సంగమేషు తదితరులు పాల్గొన్నారు. -
ఈ ఊరుకు పేరు పెట్టండి..
విజయనగరం, మెరకముడిదాం: ఆ ఊరుకు పేరులేదు..ఏడేళ్లుగా 22 కుటుంబాల గిరిజనులు అక్కడ నివసిస్తున్నారు. కాని ఆ ఊరికి గుర్తింపు లేదు. అయితే అది ఏజెన్సీ ప్రాంతం అనుకునేరు.. అస్సలు కాదు.. అది మైదాన ప్రాంతమే అయినప్పటికీ కొండపక్కన ఉండడంతో ఏజెన్సీలోని గిరిజన తండాను తలపిస్తోంది. ఇది ఎక్కడో లేదు సాక్షాత్తూ మండల కేంద్రమైన మెరకముడిదాంనకు కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాలూరు మండలం నుంచి ఏడేళ్ల కిందట వలస వచ్చిన 22 గిరిజన కుటుంబాల వారు అక్కడ స్థిరపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారికి ప్రభుత్వ పథకాలేవీ అందలేదు. అంతేకాదు వీరికి అవసరమైన విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కూడా లేకపోవడం శోచనీయం. అక్కడకు వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం కూడా లేదు. ఈ గ్రామానికి వెళ్లాలంటే గాదెలమర్రివలస పంచాయతీ మధుర గ్రామమైన సీతారాంపురం గ్రామం పక్క నుంచి కొండ గోర్జి మీదుగా వెళ్లాల్సిందే. అలాంటి ప్రాంతంలో నివసిస్తున్న వీరికి ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి మౌలిక వసతులు కల్పించలేదు. పూరిళ్లలో ఉంటున్న వీరు విద్యుత్ సౌకర్యం కోసం 2017 నవంబర్ 17న చీపురుపల్లి ఆర్ఈసీఎస్కు ఇంటికి రూ. 162 చొప్పున చెల్లించారు. డబ్బులు చెల్లించి ఏడాదిన్నర కావొస్తున్నా ఇంతవరకు ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. అడ్డుకుంటున్న అటవీ శాఖాధికారులు ..? డబ్బులు చెల్లించినా విద్యుత్ కనెక్షన్లు ఎందుకు వేయలేదని తాము ఆర్ఈసీఎస్ సిబ్బందిని ప్రశ్నిస్తే అటవీశాఖాధికారులు అడ్డుకుంటున్నారని చెప్పారని ఆ గ్రామానికి చెందిన కొర్రు జోగి, కొర్రు తేల్సు, మర్రి సురేష్, మర్రి శ్రీను, వుంతల సుల్లు, వుంతల సోమయ్య, వుంతల ప్రవీణ్‌కుమార్, సుడపల్లి రాము, కోర్రు బుచ్చమ్మ, వుంతల కోసయ్యమ్మ, మర్రి లక్ష్మి, తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ లేకపోవడంతో రాత్రివేళల్లో కొండపైనుంచి జంతువులు వస్తున్నాయని, వాటితో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు కూడా అందుబాటులో లేకపోవడంతో కొండవాగ నీటిని తాగాల్సి వస్తోనంది వాపోతున్నారు. రోగాలు ప్రబలినా పట్టించుకునే నాథుడే లేకుండాపోయారని చెబుతున్నారు. తమను గుర్తించి గ్రామానికి పేరు పెట్టి మౌలిక వసతులు కల్పించాలని 2017, 2019లో కలెక్టరేట్ గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి తమను గుర్తించి మౌలిక వసతులు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. విద్యుత్ కనెక్షన్లకు డబ్బులు చెల్లించామంటూ రశీదులు చూపిస్తున్న గిరిజనులు అన్నీ ఇబ్బందులే.. గ్రామంలో ఎటువంటి మౌలిక సదుపాయాలూ లేవు. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. గ్రామానికి పేరే లేకపోవడం మరింత శోచనీయం. ఎవరి దగ్గరకు వెళ్లినా మీది ఏ ఊరని అడుగుతున్నారు. ఏం చెప్పాలో తెలియడం లేదు. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించాలి.– కొర్ర బుచ్చమ్మ భయంగా ఉంటోంది.. ఏడేళ్లుగా ఇక్కడే భార్యాపిల్లలతో జీవిస్తున్నాం. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో కొండమీద నుంచి జంతువులు వస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది. అధికారులు స్పందించి విద్యుత్ సౌకర్యం కల్పించాలి.– కొర్ర జోగి, గ్రామస్తుడు -
ఆమె అందరికీ అమ్మ
సాక్షి, విజయనగరం : ఆమె అందరు ఆడపిల్లల్లాగే చదువుకుంది. గ్రూప్–1 ఉద్యోగాన్ని సంపాదించింది. ఆకర్షణీయమైన ప్రభుత్వ ఉద్యోగం.. హాయిగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండొచ్చు.. కానీ ఆమె ఆలోచనలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. సమాజ సేవ చేయాలి. ఆ సేవ చేయడంలోనే ఆనందం పొందాలి.. ఆ ఆలోచనలతోనే ఆమె అన్నింటినీ త్యజించి అనాథలకు సేవ చేయాలని నిర్ణయించుకుంది. ఆలోచన రావడమే మొదలు ఇక ఆగలేదు. సమాజ సేవే లక్ష్యంగా ముందుకెళ్తూ.. ప్రస్తుతం అందరికీ అమ్మ అయ్యింది. ఆమె ప్రకాశం జిల్లాకు చెందిన వెనిగండ్ల పద్మజ. ఎమ్మెస్సీ చదివిన పద్మజ ప్రకాశం జిల్లాలో ఎంపీడీఓగా, హైదరాబాద్‌లో చైల్డ్ లేబర్ కో–ఆర్డినేటర్‌గా పనిచేశారు. అయినప్పటికీ ఆమెకు ఆ ఉద్యోగాలు సంతృప్తిని ఇవ్వలేదు. అభాగ్యులకు సేవచేయాలి.. అందులోనే నిజమైన ఆనందం పొందాలని భావించారు. అమాయక గిరిజనులకు సేవ చేయాలనే ధృడ సంకల్పం ఆమెలో మెండుగా ఉండేది. దీంతో శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజన్సీలో గిరిజనులకు సేవలు అందించాలని నిర్ణయించారు. అప్పట్లో సెర్స్ సీఈఓగా పనిచేసిన విజయకుమార్ పరిచయంతో విజయనగరం జిల్లా పార్వతీపురంలోని జట్టు ఆశ్రమాన్ని సందర్శించారు. 2004లో జట్టు ఆశ్రమాన్ని చూసేందుకు వచ్చిన ఆమె ఇక్కడి పిల్లలు, వాతావరణాన్ని చూసి ఈ ప్రాంత గిరిజనులకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. 2007లో పూర్తిగా కుటుంబ సభ్యులను విడిచిపెట్టి కట్టుబట్టలతో వచ్చేశారు. అప్పటినుంచి ఆశ్రమ బాధ్యతలు ఎన్నో ఒడిదొడుకుల నడుమ నిర్వర్తిస్తూ ఆశ్రమంలోని పిల్లలకు ఆమ్మయ్యారు. వివాహం చేసుకుంటే ఆ బంధం ఎక్కడ అడ్డు వస్తుందో.. ఎక్కడ సమస్యలు ఉత్పన్నమవుతాయో అని భావించి ఒంటరిగా ఉంటున్నారు. పిల్లల యోగ క్షేమాలను చూసుకుంటున్నారు. నాటి నుంచి నేటి వరకు 150 మంది వరకు పిల్లలను అక్కున చేర్చుకుని చదివిస్తున్నారు. ఏటా నలుగురైదుగురు పిల్లల వివాహాలు కూడా చేస్తున్నారు. ఆశ్రమాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. గాంధేయ మార్గంలో తెలుపు నూలు వస్త్రాలను ధరిస్తూ సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు. సమాజ సేవ చేయడంలో తాను పొందుతున్న ఆనందం చెప్పలేనిదని.. అది అనుభవిస్తే తప్ప అర్థం కాదంటున్నారు. స్త్రీ శక్తిమంతురాలని.. ఆ శక్తిని పదిమందికి ఉపయోగపడేలా వినియోగించాలి తప్ప.. వినిమయ వస్తువుగా మిగిలిపోరాదని హితవు పలికారు. -
అడివంటుకుంటుంది
ఆదివాసీలకు అడవి తల్లి లాంటిది కనుకనే వారిని అడవిబిడ్డలన్నారు. ఆధునిక యుగం ఆ అడవినే మింగేసే ప్రయత్నం చేస్తోంది. ఒకప్పుడు ఆదివాసీ ఉత్పత్తులను మైదాన ప్రాంతాల నుంచి వెళ్ళిన చిన్నా చితకా వ్యాపారులు దోచుకునే వారు. బ్రిటిష్ కాలం నుంచి దోపిడి మరో రూపం తీసుకున్నది. 1990 తర్వాత ఆదివాసీలు కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. అడవిలో ఉండే ఖనిజసంపదను కొల్లగొట్టడానికి కార్పొరేట్ కంపెనీలు పథకాలు తయారుచేశాయి. తక్షణమే ఆదివాసీలను అడవినుంచి ఖాళీచేయించాలంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. కానీ ప్రభుత్వాలు చాలా నిరాసక్తతను ప్రదర్శించాయి. ఆదివాసీల జీవితం అడవి చుట్టూతా అల్లుకొని ఉంటుంది. ప్రతి చెట్టూ, ప్రతి పుట్టా, అడవిలోని అణువణువూ వారి పాదముద్రలతో పునీతమై ఉంటుంది. అడవిలేనిదే ఆదివాసీలు లేరు, ఆదివాసీలు లేనిదే అడవీ మనలేదు. అంతెందుకు వారి భాష, వారి యాస, వారి కట్టూ, బొట్టూ, ఇంకా చెప్పాలంటే వారి సంస్కృతే ఒక ప్రత్యేకమైన సంస్కృతి. ఒక ప్రత్యేకమైన జీవన విధానం వారి సొంతం. అడవిలో పుట్టి అడవిపైనే ఆధారపడి, అక్కడ దొరికే ఆకులూ అలములూ తిని, రోగమొస్తే, రొప్పొస్తే ఆసుపత్రి కూడా అందుబాటులో లేక ఏ ఆకుపసరుతోనో సరిపెట్టుకొని ఆ అడవిలో పిల్లో, పిట్టో, పందో దొరికినా నిండు రాతిరిలో పండు వెన్నెల్లో ఊరుమ్మడిగా వండుకు తినేసి హాయిగా ఏ అరమరికలూ లేకుండా బతికే స్వేచ్ఛాపరులు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఆదివాసీలే. తమ ఆకలితీర్చి ఆదరించిన అడవినే నమ్ముకొని చలికి వణికీ, వానకి తడిసీ, ఎండకు ఎండినా శతాబ్దాలుగా ఆ అడవిని వీడి బతకడం చేతకాని వారు ఆదివాసీలే. మనం మరిచిపోయిన సహజీవనం, సమానత్వ భావనలకి చిహ్నం ఆదివాసీలే. ఇప్పటికింకా ఆ ఉమ్మడి జీవితం వారిలో తప్ప మరెక్కడా మచ్చుకైనా అగుపించదు. ఆదివాసీలతో పాటు అక్కడి జంతువులూ సహజీవనం చేస్తాయి. పురుగూ, పుట్టా, పక్షీ, పిట్టా అన్నీ వారికి మచ్చికే. ఒక్కమాటలో చెప్పాలంటే వారున్నంత వరకూ అక్కడి ఏ చెట్టునీ, ఏ కొమ్మనీ ఎవ్వరూ నరకలేరు. అలాగే, ఏ జంతువునీ ఎవ్వరూ చంపలేరు. వారి వల్లైతే ఏ అడవి మృగానికీ హానీ జరగదు. అంతగా వారు ప్రకృతిలో కలిసిపోయారు. చివరకు వారి దేవతలూ, దేవుళ్ళూ సైతం ప్రకృతి తప్ప మరొకటి కాదు. ఆదివాసీలకు అడవి తల్లి లాంటిది కనుకనే వారిని అడవిబిడ్డలన్నారు. ఇది ఈనాటి చరిత్రకాదు. వందల సంవత్సరాల ఆదివాసీల సంస్కృతే ఇది. ఆధునిక యుగం ఆ అడవినే మింగేసే ప్రయత్నం చేస్తోంది. అందుకే మరోమారు ఆ అడవిబిడ్డల ప్రస్తావన ఇప్పుడు తప్పనిసరి అయ్యింది. ఒకప్పుడు ఆదివాసీ ఉత్పత్తులను మైదాన ప్రాంతాల నుంచి వెళ్ళిన చిన్నా చితకా వ్యాపారులు దోచుకునే వారు. వారి శ్రమను కొల్లగొట్టేవారు. కానీ ఇప్పుడు ఆదివాసీల పాదాల కింద ఉన్న మట్టినే తొలిచేయాలని చూస్తున్నారు బడా పెట్టుబడీదారులు, అభివృద్ధి పేరిట అడవిలో ఉన్న ఖనిజాలను, ఇతర ఉత్పత్తులనూ దోచుకోవడానికి ప్రభుత్వాలు, కార్పొరేట్ కంపెనీలు మూకుమ్మడిగా ప్రయత్నిస్తున్నాయి. ఒకప్పుడు ఆదివాసీలు జంతువులను వేటాడితే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు ఆదివాసీలను వేటాడటం మొదలు పెట్టారు. వేదకాలంలో మొదలైన ఈ వేట ఈనాటికీ కొనసాగుతున్నది. అప్పుడు యజ్ఞయాగాలను రక్షించుకోవడానికి అడవిని తమ అధీనం లోకి తెచ్చుకోవడానికి రాక్షసులనే ముద్రవేసి, శ్రీరాముడు, పాండవులు అరణ్యవాసాల పేరిట వేటసాగించారు.ఆ తర్వాత మనకు అందిన చరిత్ర ప్రకారం కాకతీయ రాజులు సమ్మక్క, సారక్కల రాజ్యం మీద దాడిచేసి రక్తపాతం సృష్టించారు. బ్రిటిష్ కాలం నుంచి ఈవేట మరో రూపం తీసుకున్నది. అప్పటి వరకూ ఆదివాసీలు తమకుతామే రాజులు, పాలకులు. కానీ బ్రిటిష్ వారు ప్రభుత్వాలపేరిట స్వేచ్ఛగా ఉండే ఆదివాసులను చట్టాల చట్రంలోకి తీసుకువచ్చారు. ఇందుకు భారత దేశంలోని ఆధిపత్య కులాలు, సంస్థానాధీశులతో కలిసి ఆదివాసీల దోపిడీకి సహకరించారు. ఆ దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆదివాసీలు తిరుగుబాట్లు చేసారు. అందులో బీహార్ ప్రాంతంలోని జార్ఖండ్‌లో బిర్సా ముండా నాయకత్వంలో సాగిన తిరుగుబాటు చరిత్రలో ఒక పెనుతుఫాను. అదే విధంగా బెంగుళూరు ప్రాంతంలో, మహారాష్ట్రలో అనేక చోట్ల ఆదివాసులు తమ తిరుగుబాటు జెండాలు ఎగురవేశారు. అదేవిధంగా ఆంధ్రప్రాంతంలో అల్లూరి సీతారామరాజు, తెలంగాణ ప్రాంతంలో కొమురంభీం, ప్రతిఘటనా పోరాటాలు ఆనాటి పాలకులను గడగడలాడించాయి. అయితే కొమురంభీం పోరాటాన్ని చవిచూసిన నిజాం ప్రభుత్వం హేమన్డార్స్ అనే బ్రిటిష్ సామాజిక శాస్త్రవేత్తను ఆహ్వానించి, ఆది వాసీల ఆందోళనకి కారణాలను వెతకాలని, పరిష్కారాలను సూచించాలని ఆదేశించింది. 1947లో స్వాతంత్య్రం ప్రకటించిన అనంతరం రాజ్యాంగ సభ ఏర్పాటైంది. దానితో బాబాసాహెబ్ అంబేడ్కర్‌తో సహా ఎంతో మంది దళితులతో పాటు, ఆదివాసీల హక్కుల కోసం రాజ్యాంగంలో ఎన్నో సూచనలనూ, నిబంధనలనూ పొందుపరిచారు. వారి రక్షణ కోసం చేసిన నిబంధనలన్నింటినీ రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్లో చేర్చి మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 1950 లో రాజ్యాంగం అమలులోకి వస్తే, 1965–66 వరకు ఆదివాసీల గురించి ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. అంతేకాకుండా ఆదివాసీయేతర వ్యక్తులు ముఖ్యంగా కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు, షావుకార్లు తమ దృష్టినంతా ఆదివాసీప్రాంతాల మీదకు మళ్ళించారు. అడవిలో ఉన్న వృక్ష సంపదను కాంట్రాక్టర్లు దోచుకొని పోతే, షావుకార్లు తమ దగ్గర ఉన్న నిత్యావసర వస్తువులను ఉద్దెరకు ఇచ్చి, అటవీ ఉత్పత్తులను ఆదివాసీలనుంచి కాజేయడం మొదలుపెట్టారు. ఈ దోపిడీయే ఆదివాసీల మరో పోరాటానికి ఊపరిలూదింది. అదే నక్సలైట్ పోరాటం. పశ్చిమబెంగాల్లోని నక్సల్బరీ, శ్రీకాకుళంలోని ఉద్దానం, ఏజెన్సీ ప్రాంతాలు, ఖమ్మం, వరంగల్ జిల్లాలూ, గోదావరీ లోయ అంతా ఫారెస్టు కాంట్రాక్టర్లు, షావుకార్లకు వ్యతిరేకంగా ఆదివాసీలు తిరుగుబాటు చేశారు. ఇది ఆనాటి ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేసింది. ఆలోచింపజేసింది. దాని ఫలితంగానే ఆదివాసీల భూములను ఆదివాసీ యేతరులు కొల్లగొట్టకుండా ఉండేందుకు, ఆదివాసీ భూములపై సర్వహక్కులూ ఆదివాసీలకే ఇస్తూ, ఆదివాసీ భూములను ఆది వాసీ యేతరులు కొనకూడదు, అమ్మకూడదు అంటూ ఒక చట్టాన్ని ఆనాటి ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. దానితో పాటు వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ఐటీడీఏ, ట్రైబల్ సబ్‌ప్లాన్ లాంటి పథకాలను తీసుకొచ్చారు. ఇది ఆదివాసీల తిరుగుబాటు ఫలితమేనని అందరూ అంగీకరించి తీరాల్సిందే. అయితే ఆదివాసీల జీవితాల్లో ఒక అడుగు ముందుకు పడినప్పటికీ వారికి దున్నుకునే భూమి మీద హక్కులేకుండా పోయింది. ఆదివాసీలు దున్నుకుంటున్న భూములకు పట్టాలివ్వడానికి మాత్రం ఏ ప్రభుత్వం ముందుకు రాలేదు. దీంతో ఆదివాసీ ప్రాంతాల్లో నక్సలైటు ఉద్యమం పెనుఉప్పెనలా దూసుకొచ్చింది. దాని ఫలితమే 1981లో ఏప్రిల్ 20న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన ఘటన. తాము సాగుచేసుకొని బతుకుతున్న భూములకు పట్టాలివ్వాలని ఆదివాసీలు డిమాండ్ చేసారు. ఏప్రిల్ 20న జరపతలపెట్టిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా వాళ్ళు పట్టు వదలకుండా ఇంద్రవెల్లి తరలివచ్చారు. పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి వందమం దికి పైగా ఆదివాసీలను కాల్చి చంపారు. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొందరికి పట్టాలు దక్కాయి. అయితే 1990 తర్వాత ఆదివాసీలు కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. అడవిలో ఉండే ఖనిజసంపదను కొల్లగొట్టడానికి కార్పొరేట్ కంపెనీలు పథకాలు తయారుచేశాయి. దానికి కాంగ్రెస్‌తో సహా బీజేపీ దాకా అన్ని పార్టీలూ వత్తాసు పలికాయి. కానీ ఆదివాసీలు మాత్రం దానికి ససేమిరా ఒప్పుకోలేదు. వాళ్ళ తరఫున కొంత మంది స్వచ్ఛంద కార్యకర్తలు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆదివాసీలకు అనుకూలమైన తీర్పులు పొందగలిగారు. ఈ క్రమంలోనే 2006లో అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని యు.పీ.ఏ ప్రభుత్వం ఆదివాసీల రక్షణ కోసం అటవీహక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది కార్పొరేట్ కంపెనీలకు కొరక రాని కొయ్యగా తయారైంది. దానితో కార్పొరేట్ కంపెనీలు కొత్త కుట్రలకు తెరతీశాయి. ఆదివాసీలు అడవుల్లో జీవించడం వల్ల వన్యప్రాణి రక్షణకు భంగం కలుగుతుందనే వాదనలు లేవనెత్తారు. ఇది కార్పొరేట్ కంపెనీలు ప్రత్యక్షంగా చేయకుండా, వన్యప్రాణి సంరక్షకుల పేరుతో కొన్ని ఎన్జీఓలను సృష్టించారు. అటువంటిదే ఒక సంస్థ ఇటీవల సుప్రీంకోర్టులో వన్యప్రాణి రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అనేక మంది అక్రమంగా అడవుల్లో ఉంటున్నారనీ, వారిని అక్కడినుంచి పంపించి వేయాలనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దానితో తక్షణమే ఆదివాసీలను అడవినుంచి ఖాళీచేయించాలంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. కానీ ప్రభుత్వాలు ఈ కేసుని ఆదివాసీల తరఫున వాదించాల్సింది పోయి చాలా నిరాసక్తతను ప్రదర్శించాయి. తత్ఫలితంగా ఫిబ్రవరి 13 వ తేదీన సుప్రీంకోర్టు ఏకపక్షంగా తీర్పునిచ్చింది. అక్రమంగా అడవుల్లో ఉన్న వాళ్లను జూలై 24 లోగా ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దాదాపు అన్ని రాష్ట్రాలూ కలిపి కొన్ని లక్షల మంది ఆదివాసీలుంటారు. నిజానికి ఇప్పటికే ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ భూములను కబ్జా చేసుకొని అక్రమంగా ఉంటున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. అయిదు లక్షల కేసులు వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయి. కానీ వాటి గురించి విచారణాలేదు. తీర్పులూ లేవు. అయితే సుప్రీంకోర్టు తీర్పు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనది. దీనిని అమలు చేయడం ప్రభుత్వాలకు అంత సులువుకాదు. ఒకవేళ కార్పొరేట్ కంపెనీలకు వెసులుబాటు కల్పించడానికి ఉపయోగపడే ఈ తీర్పును అమలు చేయాలని ప్రభుత్వాలు భావిస్తే అడవి అడవి అంతా భగ్గుమంటుందన్నది చరిత్ర చెప్పిన సత్యం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకొని సుప్రీంకోర్టు తీర్పును సవరించే ప్రయత్నం చేయాలి. లేనట్లయితే తదుపరి పరిణామాలు ప్రభుత్వం చేయిదాటిపోవడం ఖాయం. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
ఆదివాసీల ఆత్మబంధువు జనార్ధన్
అరవై ఏళ్ల తెలంగాణ స్వప్నం సాకారమైన వేల ఎందరో తెలంగాణ వీర యోధుల, అమర వీరుల ఆకాంక్షలకు దర్పణం బియ్యాల జనార్ధన్ రావు. ఆదివాసీల ఆత్మబంధువుగా మలిదశ తెలంగాణ పోరాటానికి మార్గదర్శిగా నిలిచిన ప్రొఫెసర్ జనార్ధనరావు వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగల వీడు గ్రామంలో కిషన్‌రావు, అంజమ్మలకు 1955 అక్టోబర్ 12న జన్మించారు. చిన్నతనం నుంచి ఏజెన్సీలోని ఆదివాసీలతో అనుబంధ కారణంగా వారి సంప్రదాయం, జీవన విధానంపై అవగాహన కలిగింది. ఆదివాసీల సమస్యలు, స్వయం పాలన, రాజ్యాంగ రక్షణ, హక్కుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేశారు. 1983లో కాకతీయ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పార్ట్ టైం అధ్యాపకుడిగా చేరారు. ఆదివాసుల భూముల పరాయీకరణపై 1985లో పీహెచ్డీ పట్టా పొందారు. ఆదివాసీలపై పరిశోధన చేసి పట్టా పొందిన తొలి గిరిజనేతరుడు జనార్ధన్‌రావు. 1993–2000 మధ్య కాలంలో ఆది వాసీ ఉద్యమాలు, 1/70 చట్టం, పీసా చట్టం, గ్రామీణ సమస్యలపై దృష్టి సారించారు. అమెరికా, జర్మనీ, స్వీడన్, ఆస్ట్రేలియాలలో జరిగిన సెమినార్లలో పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ వారి పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా ఎంపికయ్యారు. తెలంగాణపై వివక్ష, అణచివేతపై అనేక రచనలు చేశారు. ప్రముఖ కవి కాళోజీ, ప్రొఫె సర్ జయశంకర్‌లతో కలిసి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పని చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పర్యవసానాలు, ఆదివాసీల జీవన విధ్వంసంపై ఎన్నో వేదికలపై చర్చించారు. ఉసిళ్ల పుట్టలై మన పని, పాటల్ని కమ్మేస్తున్న దొంగ టీవీ చానళ్లను తీసేసి, మన జనపదాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలను ఎన్నోరకాలుగా ఎండగట్టారు. ఆదివాసీలు రాజ్యాధికారంలో భాగమై, స్వయం పాలన సిద్ధించిన నాడే జనార్ధన్ ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఆదివాసీ సంఘాలు, మేథావులు జనార్ధ న్ను స్ఫూర్తిగా తీసుకుని ఆదివాసీల సమస్యలపై పోరాటాలను ముందుకు తీసుకువెళ్లాలి. వ్యాసకర్త: ఊకె రామకృష్ణ దొర, తెలంగాణ ప్రజాఫ్రంట్ నేత -
ఆదివాసీలకు అన్యాయం
అనుకున్నంతా అయింది. దాదాపు పుష్కరకాలం క్రితం అమల్లోకొచ్చిన అటవీ హక్కుల గుర్తింపు చట్టంలో ఉన్న అనేక లొసుగుల్ని సవరించి ఆదివాసీల హక్కుల్ని పరిరక్షించాలని పలు ఆదివాసీ సంఘాలు, హక్కుల సంఘాలు చేస్తున్న వినతుల్ని పట్టించుకోని ప్రభుత్వాల తీరువల్ల ఇప్పుడు ఆది వాసీల ఉనికికే ముప్పు ఏర్పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. 16 రాష్ట్రాల్లో తరతరాలుగా అడవినే నమ్ము కుని జీవిస్తున్న 11 లక్షలమందికిపైగా ఆదివాసీ కుటుంబాలకు ఆ చట్టం కింద అర్హత లభించలేదు గనుక వారిని దురాక్రమణదారులుగా గుర్తించి అక్కడినుంచి వచ్చే జూలైలోగా ఖాళీ చేయించాలని ఈనెల 13న సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలిచ్చింది. 2005 డిసెంబర్ 13నాటికి అడవులపైనా, వాటిద్వారా లభించే ఉత్పత్తులపైనా ఆధారపడి జీవించే ఆదివాసీలకు ఈ చట్టంకింద గుర్తింపు, అర్హత లభిస్తాయి. అలాగే గిరిజనేతరుల విషయానికొచ్చేసరికి వారు కనీసం మూడు తరాలుగా (75 ఏళ్లుగా) అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్నట్టు నిరూపించే సాక్ష్యాలు, పత్రాలు తీసుకురావాల్సి ఉంటుంది. ఈ చట్టానికి అనుగుణంగా రాష్ట్రాలు రూపొందించిన నియమ నిబంధనలు మొత్తం ప్రక్రియనే సంక్లిష్టంగా మార్చాయి. అడవినే నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీలైనా, మరొకరైనా దాన్ని ధ్రువీకరిం చేందుకు సాక్ష్యాలు, పత్రాలు సమర్పించాలనడంలోనే ఎంతో తిరకాసు ఉంది. 2005 డిసెంబర్‌నాటికి తాము అటవీ ప్రాంతంలో ఉండి, అక్కడ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్నామని, తాము సాగుచేసు కుంటున్న భూములపై తమకు హక్కులున్నాయని నిరూపించుకోవడానికి లేదా 75 ఏళ్లుగా అక్కడే ఉండి సాగుచేసుకుంటున్నామని నిరూపించుకోవడానికి సమర్పించాల్సిన పత్రాల జాబితా చేంతా డంత పెరిగి వాటిని సంపాదించడం, దఖలు పర్చడం కష్టతరంగా మారింది. అందువల్లే భారీ సంఖ్యలో.. అంటే దాదాపు 40 లక్షల అభ్యర్థనల్లో 19 లక్షలు తిరస్కరణకు గురయ్యాయి. ఈ స్థాయిలో తిరస్కరణలున్నప్పుడు పాలకులు ఆలోచించి ఉండాల్సింది. తమ నియమనిబంధనలు ఇందుకు దోహదపడ్డాయేమోనని శంకించాల్సింది. కానీ అవి పట్టనట్టు ఉండిపోయాయి. ఈలోగా అసలు ఆ చట్టమే రాజ్యాంగ విరుద్ధమని, అది వన్యప్రాణి సంరక్షణ చట్టం, మరికొన్ని ఇతర చట్టా లను ఉల్లంఘిస్తున్నదని కొన్ని స్వచ్ఛంద సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిని విచారించే సందర్భంగా ధర్మాసనం తాజా ఆదేశాలిచ్చింది. విచారణలో తన వైఖరేమిటో విస్పష్టంగా వివ రించి, ఆదివాసీల హక్కులకు భంగం వాటిల్లకుండా చూడాల్సిన కేంద్రం ఆ విషయంలో దారు ణంగా విఫలమైంది. ఆ చట్టం అమల్లో ఆదివాసీలకు అడుగడుగునా సమస్యలెదురవుతున్నా ఇన్నేళ్లుగా పాలకులు పట్టనట్టు ఉండిపోయారు. ఆదివాసీలకు న్యాయంగా దక్కాల్సిన హక్కులు ఈ చట్టం ద్వారా వారికి దఖలు పడటం లేదు. సరికదా అధికార యంత్రాంగాల కుమ్మక్కు ధోరణుల వల్ల కార్పొరేట్ సంస్థలు దొడ్డిదారిన ప్రవేశిస్తున్నాయి. ‘ల్యాండ్ కాన్ఫ్లిక్ట్ వాచ్’(ఎల్సీడబ్ల్యూ) అనే సంస్థ గణాంకాల ప్రకారం నిరుడు జనవరినాటికి 11 రాష్ట్ర ప్రభుత్వాలు 26 కేసుల్లో గ్రామసభల అభిప్రాయాలను బుట్టదాఖలు చేసి అడ్డగోలుగా అటవీ భూముల్ని కార్పొరేట్లకు ధారాదత్తం చేశాయి. ఆదివాసీలకు జరిగిన ‘చారి త్రక అన్యాయాన్ని’ సరిదిద్ది, అటవీ ప్రాంతాల్లో వారు ఉండటానికి, అడవులపై వారికుండే హక్కుల్ని గుర్తించి పరిరక్షించడానికి ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్టు అప్పటి యూపీఏ ప్రభుత్వం చెప్పింది. అటవీ భూమిపైనా, దానిద్వారా లభించే సంపదపైనా ఆదివాసీలకుండే వ్యక్తిగత, సాముదాయక హక్కుల్ని ఈ చట్టం గుర్తిస్తున్నదని తెలియజేసింది. అడవుల యాజమాన్యం ఆదివాసీలకే అప్పగించడం, ఆదివా సీలెవరో కానిదెవరో గుర్తించి నిజమైనవారి హక్కుల్ని పరిరక్షించడం వంటి బాధ్యతలను గ్రామసభ లకు అప్పగించింది. కానీ సంక్లిష్టమైన ప్రక్రియ ఆ గ్రామసభలను సైతం నిస్సహాయంగా మార్చింది. వాస్తవానికి ఈ చట్టం అడవులపై ఆదివాసీలకుండే సహజమైన హక్కుల్ని గుర్తించడం లేదనే చెప్పాలి. కేవలం తమ జీవిక కోసం అటవీ ప్రాంతంలో లభించే సంపదను వినియోగించుకోవడానికి మాత్రమే ఆదివాసీలకు వీలుకల్పిస్తోంది. దేశంలో బ్రిటిష్ వలస పాలకుల ఏలుబడి ప్రారంభం కాక మునుపు ఆదివాసీ ప్రాంతాలపై అక్కడివారికే సర్వహక్కులూ ఉండేవి. వాటిని రద్దు చేసిన పర్యవసానంగా దేశంలోని పలుప్రాంతాల్లో ఆదివాసీలు ప్రాణాలకు తెగించి పోరాడారు. విచారించాల్సిన విషయమే మంటే స్వతంత్ర భారతంలో సైతం ఆ హక్కులు ఆదివాసీలకు సంపూర్ణంగా దఖలు పడలేదు. ఆది వాసీలకు జరిగిన ‘చారిత్రక అన్యాయాన్ని’ సరిదిద్దుతున్నామని చెప్పి తీసుకొచ్చిన అటవీ హక్కుల గుర్తింపు చట్టం సైతం ఆ విషయంలో విఫలమైంది. ఆనకట్టల నిర్మాణం, వన్యప్రాణి సంరక్షణ పార్కులు, రిజర్వ్ ఫారెస్ట్, ‘అభివృద్ధి’ వగైరాల పేరిట ఆదివాసీలు నష్టపోతున్నారు. దేశంలోని 8 కోట్ల 56 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవుల్లోని వనరులపై లక్షా 70 వేల గ్రామాల్లో నివసిస్తున్న 20 కోట్లమంది ఆదివాసీలకు హక్కులిస్తున్నామని చెప్పే చట్టం అమల్లో ఉన్నా ఇదంతా యధేచ్ఛగా జరిగిపోతోంది. కార్పొరేట్లకు అటవీ భూముల్ని కట్టబెట్టాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు లోగడ తామే ఇచ్చిన వ్యక్తిగత పట్టాలు లేదా సాముదాయక పట్టాలను ఆదివాసీలనుంచి బలవంతంగా తీసుకుంటున్నాయని ఎల్సీడబ్ల్యూ సోదాహరణంగా తెలి పింది. ఆదివాసీలు అక్కడుండే క్రూరమృగాలతో సావాసం చేస్తున్నారు. వాటికి బయటివారి నుంచి ముప్పు కలగకుండా కాపాడుతున్నారు. అక్కడి సంపద కైంకర్యం కాకుండా పరిరక్షిస్తున్నారు. దుర దృష్టవశాత్తూ దీన్ని ప్రభుత్వాలు గుర్తించడంలేదు. వారి ప్రయోజనాలకు భంగంవాటిల్లే చర్యలకు పూనుకుంటున్నాయి. అందువల్లే ఆదివాసీ ప్రాంతాల్లో నక్సల్స్, ఇతర ఆదివాసీ హక్కుల సంఘాల ఉద్యమాలకు ఆదరణ లభిస్తోంది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు లక్షలాదిమంది ఉనికికే ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది గనుక ఈ అశాంతి మరింతగా పెరుగుతుంది. ఆ పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే కేంద్రం తక్షణం ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఆదివాసీల హక్కులను పరిరక్షించాలి. -
డీజిల్ దొంగలించారని ఆరోపిస్తూ..
-
డీజిల్ దొంగలించారని.. బట్టలు విప్పించి..
జబల్పూర్ : డీజిల్ దొంగలించారన్న నెపంలో పనివాళ్లను బట్టలు విప్పించి మరీ చావబాదారు యాజమాని అతని మిత్రుడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మాండ్ల జిల్లాకు చెందిన సురేష్ ఠాకూర్, అశిష్ గాండ్, గోలు ఠాకూర్లు జబల్పూర్లోని గుడ్డు శర్మకు ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పని చేస్తున్నారు. అయితే జూలై 11 రాత్రిన కంపెనీకి చెందిన 120లీటర్ల డీజిల్ ఆ ముగ్గురు దొంగలించారని ఆరోపిస్తూ.. యాజమాని గుడ్డు శర్మ వారి బట్టలు విప్పించి బేస్‌బాల్ బ్యాట్‌తో చితకబాదాబడు. గుడ్డు శర్మతో పాటు అతని మిత్రుడు శేరు కూడా వారిని తీవ్రంగా కొట్టాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో విషయం బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులు గుడ్డు శర్మ, అతని మిత్రుడు శేరు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
అయ్యో.. దేవా !
వాజేడు(భద్రాచలం) : తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని లొట్టిపిట్టగండి వద్ద గుట్ట ల్లో కొలువైన భీరమయ్య(భీష్మశంకరుడు)ను కొలిచేందుకు భక్తులు ఏడాదికోసారి పోటెత్తుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఫలితంగా సౌకర్యాల లేమితో భక్తులు అవస్థలు పడుతున్నారు. వాజేడు మండల కేంద్రం నుంచి 21 కిలోమీటర్లు నడిచి వెళ్లి అక్కడి నుంచి 3 కిలోమీటర్లు గుట్ట(గాటీ)పైకి ఎక్కాల్సి ఉంటుంది. తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు(రెండు రాష్ట్రాల సరిహద్దులో) వెళ్లే రహదారిలో గుట్టపై భీరమయ్య కొలువై ఉన్నాడు. ఈ గుట్టపై అటు ప్రభుత్వం, ఇటు దేవాదాయ శాఖ ఎలాంటి సౌకర్యాలను కల్పించక పోవడంతో భక్తుల ఇబ్బందులు వర్ణణాతీతంగా మారాయి. కృష్ణాపురం పంచాయతీ పరిధిలోని టేకులగూడెం, కృష్ణాపురం, పెద్దగంగారం, కడేకల్ గ్రామాలకు చెందిన గిరి జనులు భీరమయ్యను పూజిస్తున్నారు. ప్రతీ ఏడాది ఏప్రిల్‌లో శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజు నుంచి జాత ర నిర్వహిస్తున్నారు. జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గిరిజనులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయినప్పటికీ అటు ప్రభుత్వం కాని ఇటు భద్రాచలం, ఏటూరునాగారం ఐటీడీఏ అధికారులు పట్టించుకోవడం లేదు. సౌకర్యాల లేమి.. భీష్మశంకరుడిని ఆరాధించే గిరిజనులే జాతర సమయంలో భక్తుల అవసరాల కోసం ఆయిల్ ఇంజన్ ద్వారా తాగునీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఒక చేతి పంపును వేయించాలని ఎన్నిసార్లు గిరిజనులు, భక్తులు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గత సంవత్సరం పేరూరు ఎస్సైగా పనిచేసిన కాగితోజు శివప్రసాద్ చేతి పంపును రహదారి పక్కన వేయించారు. అదొక్కటే ప్రస్తుతం భక్తుల దాహార్తిని తీరుస్తోంది. మధ్యలో నిలిచిన గుడి నిర్మాణం.. సమీపంలోని నాలుగు గ్రామాల ప్రజలు భీరమయ్యకు గుడినిర్మాణం తలపెట్టా రు. నిధుల లేమి, ఇతర కారణాలతో గుడి నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయింది. గిరిజనులు అధికారులకు, ఐటీడీఏకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు. దీంతో గుడిమధ్యలోనే ఆగిపోయింది. అటు ఐటీడీఏ, ఇటు ప్ర భుత్వం నిధులను కేటాయించకపోవడంతో దానిని నిలిపివేశారు. దానికి సమీపంలో స్వామి వారిని ప్రతిష్టించిన ప్రాంతంలో చిన్నమందిరాన్ని పోలీసుల సహకారంతో నిర్మించి పూజలు చేస్తున్నారు. నిధులు మంజూరు చేయాలి.. భీరమయ్య గుడికి 2008లో భద్రాచలం ఐటీడీఏ నుంచి రూ 25 లక్షల నిధులను కేటాయించినట్లు అప్పట్లో ప్రచారం జరి గింది. అప్పట్లో గుడినిర్మాణంతోపాటు గుట్ట ప్రాంతంలో సౌకర్యాలు ఏర్పడుతాయని ఈ ప్రాంత ప్రజానీకం సంతో షించారు. కాని కాలక్రమేనా వాటి ఊసేలేకుండా పోయింది. దీంతో గుడికి నిధులు మంజూరు భ్రమగానే మిగిలింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. నిత్యం పూజలు.. రెండు రాష్ట్రాలకు సరిహద్దులో ఉండటంతోపాటు రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో భక్తుల తాకిడి స్వామికి ఎక్కువగానే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా నుంచి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రాంతం నుంచి వెళ్లే ప్రతీ ఒక్కరూ స్వామిని దర్శించుకోకుండా వెళ్లరు. 31 నుంచి 2 వరకు జాతర.. ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు మూడు రోజులపాటు భీరమయ్య జాతరను నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి టేకులగూడెం గ్రామస్తులు మైక్ ద్వారా ప్రచారం సాగిస్తున్నారు. ఈ జాతరకు గతంలో భద్రాచలం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడిపేవారు. మరి ఈ సంవత్సరం ఆ ఏర్పాట్లు చేస్తారా లేదా అనేది అనుమానంగా ఉంది. -
బొబ్బిలి రాజుల భూ దాహం..!
బొబ్బిలి రాజుల వద్ద పరిమితికి మించి ఉన్న భూమిని దశాబ్దాల కిందట ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దానిని పేద గిరిజన రైతులకు పంచిపెట్టింది. ఇప్పుడు ఆ భూమి ధర కోట్ల రూపాయలు పలుకుతుండడంతో బొబ్బిలి రాజుల కన్నుపడింది. అంతే.. అధికారం అడ్డం పెట్టుకుని, రాజరికపు విలువలను పక్కన పెట్టి పేదల భూములను కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఓ ఎకరా భూమిని సొంతం చేసుకున్నారు. మిగిలిన భూమినీ లాక్కొనేందుకు ప్రయత్నిస్తుండడంతో గిరిజన రైతులు గగ్గోలు పెడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : పేద గిరిజన రైతులకు దానం చేసిన భూములు ఇప్పుడు కోట్ల రూపాయల ధర పలుకుతుండటంతో టీడీపీ మంత్రి కన్నుపడింది. కుతంత్రాలు చేసి వాటిని తిరిగి లాక్కున్నారు. ఆరు నెలల కిందట చేసిన ఈ ప్రయత్నం వెలుగులోకి రావడంతో గిరిజనుల్లో పార్టీకి చెడ్డపేరు వస్తోందంటూ పార్టీ జిల్లా నేతలు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా తను ఆ భూములను లాక్కోనని అప్పట్లో మం త్రి బహిరంగ సభలోనే వివరణ ఇచ్చుకున్నారు. తెరవెనుక ప్రయత్నాలు మాత్రం యథావిధిగానే సాగించారు. ఎకరా భూమి రూ.2 కోట్లు ధర పలి కే బొబ్బిలిలో ఎనిమిది ఎకరాలను ముందుగా ప్రభుత్వానికి స్వాధీనం చేయించి తర్వాత తన సొంతం చేసుకోవాలనే పన్నాగం రచించారు. ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసేందుకు బేరాలు సాగిస్తూ, ఇప్పటికే ఎకరా విక్రయించేశారు. ఇదీ పరిస్థితి... విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాతంలో నాలుగు దశాబ్దాల కిందట భూ పరిమితి చట్టం ప్రకారం మంత్రి కుటుంబీకుల వద్ద అదనంగా ఉన్న 166.50 ఎకరాల భూములను అప్పటి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే వాస్తవానికి తాము ఇవ్వాల్సింది 158.50 ఎకరాలు మాత్రమేనని, సర్వే నెం.45లో సింహాలతోట ఎదురుగా ఉన్న ఎనిమిది ఎకరాలు అదనంగా ఇచ్చేశామని వారు వాదిస్తున్నారు. కానీ తాము సక్రమ మార్గం లో,నిబంధనల ప్రకారమే 166.50 ఎకరాలు స్వా« దీనం చేసుకున్నామని ప్రభుత్వం చెబుతూ వ స్తోంది. ఈ వివాదం తేలకముందే ఆ భూముల్లో కొన్నిటిని గొల్లపల్లి, మల్లంపేట, పనుకుపేట, పె దభోగిల, రామన్న అగ్రహారం గ్రామాల గిరిజన రైతులు,పేదలకు డి పట్టాలతో సహా ప్రభుత్వం పంచి పెట్టింది. వారికి పాసు పుస్తకాలు, భూ యాజమాన్య హక్కు పత్రాలు కూడా మం జూరు చేసింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన కొంతమంది పేదలకు ఈ భూముల్లో ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇచ్చారు. ధర పెరగడంతో... ఈ ప్రాంతంలో ఇప్పుడు భూమి విలువ ఎకరా సుమారు రూ.కోటిన్నర నుంచి రూ.రెండు కోట్ల వరకూ పలుకుతోంది. దీంతో మంత్రికి ఆశపుట్టింది. వీటిని పేదల నుంచి లాక్కోవాలని పావులు కదిపారు. 32 మంది గిరిజనులకు నోటీసులు జారీ చేశారు. డి–పట్టా పొందిన తర్వాత మూడేళ్ల లోపు ఎలాంటి పంట సాగు చేయని కారణంగా భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామం టూ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, పట్టా పొందిన వెంటనే ఆ భూ ముల్లో పంటలు పం డించామని, కొంతకాలం తర్వాత రెండు పంటల సాగుకు సాగునీరు లేకపోవడంతో వర్షాధార పంటలైన కందులు, మినుములు సాగు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. రాజకీయ కుతంత్రం.. మంత్రి ప్రయత్నంపై విమర్శలు రావడంతో ప్రయత్నాన్ని విరమించినట్లు ప్రకటించినా చాపకింద నీరులా తన పని చేసుకుపోయారు. పట్టా దారుల నుంచి సమాధానం వచ్చే వరకూ వేచి చూడకుండా కొంత భూమిని తమ పేరున రాయించేసుకున్నారు. 247–2ఏలో 1.7ఎకరాలు మంత్రి పేరిట ఉంది. భూ బదలాయింపు అన్నది నోటిఫికేషన్ ద్వారా జరగాలి. ఇక్కడ అలా జరగలేదు. ఇందులో 247–2లో ఎకరా స్థలాన్ని టీచర్స్ సిండికేట్‌గా వ్యవహరించే రియల్ ఎస్టేట్ దారులకు విక్రయించేసినట్టు సమాచారం. ఆ తరువాత భూమిని పూర్తిగా రాజుల పేరున నేరుగా రాయించేందుకు బొబ్బిలిలో తహసిల్దార్‌గా పనిచేసిన బి.సుదర్శన దొరను పార్వతీపురం ఆర్డీఓగా నియమించేందుకు రాజు లు కీలకపాత్ర పోషించినట్టు సమాచారం. స్వాధీనం చేసుకున్న భూ అమ్మకానికి తెర తీసినట్టు బోగట్టా. నాకు తెలియదు.. సర్వే నంబర్ 45లో 13 ఎకరాలు ప్రభుత్వం పేరిట ఉంది. ఇతర వివరాలేవీ నాకు తెలియదు. ఈ భూమిపై వివాదాలున్న విషయం కూడా ఎవరూ చెప్పలేదు. నేను ఈ మధ్యనే విధుల్లో చేరాను. ఇక్కడ పూర్తి స్థాయి తహసీల్లార్ లేరు. – ఆర్.సాయికృష్ణ, ఇన్చార్జి తహసీల్దార్, బొబ్బిలి కొండల్లోకి వెళ్తామా.. నాకు అప్పట్లో భూమి ఇచ్చారు. ఆ భూమిని చదును చేసుకుంటున్నప్పుడు అధికారులు వచ్చి అడ్డగించారు. ఆ భూమిని ఇప్పుడు తీసేసుకుని వేరే భూమి ఇస్తారని విన్నాం. మాకు భూమి ఎక్కడుందో అక్కడే కావాలి. వేరే కొండల్లో భూమి ఇస్తామంటే వెళ్తామా? మాకు న్యాయం కావాలి. – చల్ల సీతమ్మ, డీ–పట్టాదారు, పుల్లేరు వలస కొత్త తహసీల్దార్ వస్తే అప్పుడు చూద్దామన్నారు మా భూమి లాక్కుంటున్నట్టు తెలిసి అడిగేందుకు వెళ్లాం. మాతో బేబీ నాయన మాట్లాడారు. ఇప్పుడు తహసీల్దార్ లేరు. కొత్త తహసీల్దార్ వస్తే అప్పుడు మీకు భూమి ఎక్కడిస్తామన్నదీ చెబుతామన్నారు. ఆ తరువాత మరో మధ్యవర్తిని పెట్టారు. ఆ మధ్యవర్తి వద్దకు మరోసారి వెళ్తే పదేపదే రాకండి. నాకు ఎప్పుడు వీలయితే అప్పుడు మాట్లాడతామని ఆయన హెచ్చరించారు. మా భూమిని వదులుకోం. – ముంగి నర్సింహులు, డీ పట్టా యజమాని, పుల్లేరు వలస కోర్టు కెళ్తాం... మా భూములు సాగుకు మేం యత్నిస్తే రాజుల భూము లంటూ అప్పట్లో వీఆర్వో మమ్మల్ని అడ్డుకున్నారు. పాత తహసీల్దార్ సూర్యనారాయణ కూడా రాజుల భూమిగా చెప్పారు. దిబ్బగుడ్డివలçసకు చెందిన ఓ న్యాయవాది మా తరఫున మాట్లాడారు. కోటలోకి పిలిచి బేబీనాయన ( మంత్రి సుజయకృష్ణ రంగారావు సోదరుడు), ఆయన అనుచరులు ఏ భూమి? దేనికి వచ్చారు? అంటూ తెలియనట్టు మాట్లాడారు. మా భూములను మేం వదులుకోం. న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తాం. – చల్లాగోపాలం, డీ పట్టా భూమి వారసుడు, పుల్లేరువలస, బొబ్బిలి హైకోర్టులో పిల్ వేస్తాం.. డీ పట్టా దారులను వెళ్లగొట్టడం దారుణం. ఈ విషయాన్ని ఇప్పటికే సీబీఐకి, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేశాం. ఇప్పుడు ఫైనల్‌గా హైకోర్టులో పిల్ వేస్తాం. భూ లగాన్‌లో మంత్రి కీలక పాత్ర పోషిస్తున్నారు. దీనిపై గిరిజనులకు న్యాయం జరిగేవరకు పోరాడుతాం. – పోల అరుణ్‌కుమార్, న్యాయవాది, బొబ్బిలి -
సంతకు వెళ్లాలంటే ప్రాణాలతో చెలగాటం
-
బోడికొండపై పచ్చని చిచ్చు
గ్రానైట్కోసం గ్రూపు రాజకీయాలు విడదీసి పాలించు రీతిలో వ్యూహం అమాయక గిరిజనుల్ని విడదీసిన వైనం తవ్వకాలు కావాలంటూ తెరపైకి మరో గ్రూపు గ్రానైట్ తరలింపే ధ్యేయంగా కుట్ర పరోక్షంగా సహకరిస్తున్న పాలకపక్ష నేతలు పార్వతీపురం: ఏమైతేనేం... పచ్చని కుటుంబాల్లో చిచ్చు రేపారు. విలువైన ఖనిజాన్ని కొల్లగొట్టేందుకు కుట్ర రాజకీయాలకు తెర తీశారు. అన్యోన్యంగా ఉంటున్న గిరిజనుల్లో గ్రూపులు రాజేశారు. ఇప్పటివరకూ బోడికొండ తవ్వకాలపై మన్యంలో సంఘటితంగా పోరాటం చేస్తుంటే... కుటిలనీతితో వారి మధ్య విభజించు... పాలించు.. అనే పాశ్చాత్య వ్యూహం అమలు చేశారు. ఏం చేశారో... ఎలా లొంగదీసుకున్నారోగానీ... కొందరు గిరిజనుల్ని రెచ్చగొట్టి తవ్వకాలకు సమ్మతి తెలియజేస్తున్నట్టు పోలీసులకు వినతిపత్రాన్ని అందించేలా చేశారు. పాలకపక్ష నేతలు ఎంతటికైనా తెగిస్తామని మరోసారి రుజువు చేశారు. పచ్చని చెట్లతో... అలరారే ఆ కొండపై ప్రశాంత జీవనం గడుపుతున్న గిరిజనుల్లో ఇప్పుడు పచ్చని రాజకీయాలు చిచ్చుపెడుతున్నాయి. ఇక్కడ లభించే విలువైన ‘కాశ్మీరీ వైట్ గ్రానైట్’ను వదులుకోలేక అటు కంపెనీ, ఇటు పాలకపక్ష నేతలు తమదైన శైలిలో కుట్ర రాజకీయాలకు తెరలేపారు. దశాబ్దాల నుంచి ఐక్యంగా జీవిస్తున్న అమాయక గిరిజనుల్ని విడదీసేందుకు వ్యూహం పన్నారు. ఇందులో భాగంగానే మండలంలోని బోడికొండ బాధిత సంగందొరవలస, టేకులోవ గ్రామాలకు చెందిన గిరిజనులు కొందరు తమకు బోడికొండపై గ్రానైట్ తవ్వకాలు సమ్మతమేనని తెలియజేశారు. తమకు కూలి పనులు దొరకుతాయని, గెడ్డకు, పొలాలకు ఎటువంటి హాని తలపెట్టరని, రక్షిత మంచినీరిస్తారని, పొరపాటు చేస్తే ఏడాది లోగా వెళ్లిపోతామని తమకు బాండు పేపర్లపై కంపెనీ రాసిచ్చిందని చెప్తూ... దాదాపు 70 మంది గిరిజనులు పోలీసులను మంగళవారం కలసి వినతిపత్రాన్ని అందజేశారు. పోలీసులను కలవమని ఎవరు చెప్పారని విలేకరులు ప్రశ్నిస్తే... కంపెనీకి చెందిన మహేష్ కలవమని చెప్పినట్లు గిరిజనులు తెలిపారు. గిరిజనుల మధ్య గ్రూపులు ఆది నుంచి గిరిజనులంతా ఐక్యంగా తవ్వకాలను అడ్డుకుంటూ వస్తున్నారు. కొన్ని ప్రజా సంఘాల నేతత్వంలో బోడికొండ పరిరక్షణ కమిటీగా ఏర్పడి పోరాటాలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ తవ్వకాలు కూడా జరిపేందుకు కంపెనీ సాహసించలేకపోయింది. ఈ నేపథ్యంలో స్థానిక నేతలు రంగంలోకి దిగారు. వారి మధ్య విభజించు... పాలించు అనే ట్రిక్‌ను ప్రయోగించారు. ఎలాగైనా తవ్వకాలు జరుపుకునేలా వారిని ప్రోత్సహించి వారిచేతనే వినతులు ఇప్పించడంలో కతకత్యులయ్యారు. టీడీపీ నేతల హస్తం బోడికొండలో అరుదైన ‘కాశ్మీరీ వైట్ గ్రానైట్’ ఉన్నట్లు తెలుసుకున్న రాష్ట్రంలోని పెద్ద పెద్ద 18 గ్రానైట్ కంపెనీలు కొండను తవ్వేందుకు దరఖాస్తు చేశాయి. సుమారు 135 హెక్టార్లను తమకు కేటాయించాలని కోరాయి. 8 దరఖాస్తులు చేసుకున్న పొకర్నా కంపెనీకి తొలుత 10 హెక్టార్లకు గత జూన్ 2న ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. బోడికొండపై దాదాపు 350 హెక్టార్ల వరకు గ్రానైట్ తవ్వకాలకు అనుమతులివ్వొచ్చని రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి రికమెంట్ చేసినట్లు సమాచారం. ఈ తతంగం కొనసాగించడంలో టీడీపీ పెద్దల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆ పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి తదితరులు ప్రజాభిప్రాయసేకరణలో తాము వ్యతిరేకమంటూ తేల్చి చెప్పినా.. అనుమతులిచ్చినట్లు సమాచారం. అత్యంత విలువైన గ్రానైట్ అరుదైన కాశ్మీరీ వైట్ గ్రానైట్ ఒక హెక్టార్లో 4 నుంచి 5 క్యూబిక్ మీటర్ల రాయి ఉంటుందని ఇంజినీరింగ్ అధికారుల అంచనా. 10 క్యూబిక్ మీటర్ల ముడి రాయి రూ.9లక్షల వరకు ధర పలుకుతుందని బోగట్టా. అదే రాయి పూర్తిగా సాన బట్టాక మార్కెట్లో రూ.18లక్షల వరకు ఉంటుందంటున్నారు. భారీ లాభాలు తెచ్చిపెట్టే ఈ గ్రానైట్ కొండను ఎలాగైనా కాజేయాలన్నది కాంట్రాక్టర్ల ఎత్తుగడ. బాంబుల మోత తప్పదేమో...? ఇప్పటి వరకు గిరిజనులు ప్రజా సంఘాల మద్దతుతో గ్రానైట్ తవ్వకాలను వ్యతిరేకించారు. ఇంతలో రాజకీయ ప్రవేశంతో అక్కడి గిరిజనులను విడదీసి తమవైపు తిప్పుకుని తవ్వకాలకు సమ్మతి తెలిపేలా తర్ఫీదునిచ్చారు. ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఇక్కడ శాంతిభద్రతల సమస్య ఎదురయ్యేలా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అయితే కంపెనీ ఎన్ని ఎత్తులేసినా అడ్డుకొని తీరుతామని బోడికొండ పరిరక్షణ కమిటీ నాయకులు మాత్రం తెగేసి చెబుతున్నారు. -
‘బిడ్డను రూ.650కు అమ్ముకున్నారు’
అగర్తలా: త్రిపుర రాష్ట్ర జనాభాలో 30శాతం ఉన్న గిరిజనులు ఆకలితో అలమటిస్తున్నారు. పొట్ట నింపుకోవడానికి గుక్కెడు గంజి కూడా లేక ఆకలి బాధను తట్టుకోలేక పుట్టిన బిడ్డలను అమ్ముకునే దీన స్ధితికి చేరుకున్నారు. త్రిపురకు చెందిన ఓ పత్రిక రాసిన కథనంలో ఎన్నో రోజులుగా ఆ రాష్ట్ర గిరిజనుల పెడుతున్న ఆకలి కేకలు వినిపించాయి. ధలాయ్ జిల్లాకు చెందిన ఓ గిరిజన కుటుంబానికి పండటి ఆడ శిశువు జన్మించింది. అమ్మాయి పుడితే లక్ష్మీ దేవిగా భావిస్తారు. ఆ లక్ష్మే తమ గృహంలో లేకపోవడంతో ఆ బిడ్డను వారు రూ.650కు అమ్ముకున్నారు. దారిద్యరేఖకు దిగువన ఆ కుటుంబం ఉన్నట్లు పత్రిక ప్రచురించింది. ఈ పరిస్ధితి ఒక్క ధలాయ్ జిల్లాలో మాత్రమే కాదు త్రిపుర రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు క్షణక్షణం అనుభవిస్తున్న క్షోభ ఇది.కన్న బిడ్డకు ముల్లు గుచ్చుకుంటేనే అల్లాడిపోయే తల్లి హృదయం బిడ్డనే అమ్ముకునే స్ధాయికి దిగజారిందంటే పరిస్ధితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. గిరిజనుల పరిస్ధితిపై మాట్లాడిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బర్మాన్.. మారుమూల గ్రామాల్లో నివసించే గిరిజనుల వైపు సర్కారు చూడటం లేదని అన్నారు. బిడ్డను రూ.650కి అమ్ముకున్న ఘటనపై మాట్లాడిన ఆయన.. ఈ ఘటనకు ముందు గండాచెర్ర ప్రాంతంలో కూడా డబ్బు కోసం బిడ్డను అమ్ముకున్నారని చెప్పారు. గిరిజన ప్రాబల్యం ఎక్కువగా కలిగిన ప్రాంతాల్లో డబ్బుకోసం బిడ్డలను అమ్ముకునే ఘటనలు సాధారణమయ్యాయని తెలిపారు. డబ్బు సంపాదించడానికి ఏ గత్యంతరం లేని వారు ఆకలితో మరణిస్తున్నారని వివరించారు. -
'ఆదివాసీలు, గిరిజనుల పొట్టకొట్టొద్దు'
హైదరాబాద్: ఆదివాసీలు, గిరిజనుల పొట్టకొట్టొద్దు' అని తెలంగాణ వైఎస్ఆర్సీపీ నేత కొండా రాఘవరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఆదివాసీల పోడు భూములపై ప్రభుత్వ పెద్దలు, టీఆర్ఎస్ నేతలు కన్నేయడం దారణమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో గిరిజనులు, ఆదివాసీలకు హక్కు పత్రాలు ఇచ్చారని గుర్తు చేశారు. గిరిజనులు, ఆదివాసీలకు ఇచ్చిన పోడు భూములను ఇప్పుడు టీఆర్ఎస్ నేతలకు లీజుకు ఇస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఆదివాసీల జీవనోపాధిని దెబ్బదీయొద్దని చెప్పారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా? అని కొండా రాఘవరెడ్డి ప్రశ్నించారు. -
'బూటకపు స్వాతంత్య్ర దినంగా పాటించాలి'
చర్ల (ఖమ్మం): సీపీఐ మావోయిస్టు ఖమ్మం జిల్లా కమిటీ పేరుతో పోస్టర్లు ఖమ్మం జిల్లా చర్ల మండలంలో రహదారిపై బుధవారం దర్శనమిచ్చాయి. ప్రజలకు ఇంకా పూర్తి స్వాతంత్య్రం రాలేదని, ఆగస్ట్ 15ను బూటకపు స్వాతంత్య్ర దినంగా పాటించాలని మావోయిస్టులు ఆ ప్రకటనలో ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివాసీలపై అధికంగా అత్యాచారాలు జరుగుతున్నాయని, పీడిత ప్రజలైన ఆదివాసీలకు ఇంకా పూర్తి హక్కులు రాలేదని పేర్కొన్నారు. బ్రిటిష్ వారి నుంచి రాజ్యాధికారం బదిలీ అయినా, పెట్టుబడి, భూస్వామ్య వర్గాల చేతుల్లో పరిమితమైందన్నారు. భారతదేశంలో ఇంకా అన్ని వర్గాలు, ప్రజలకు స్వాతంత్య్రం రానప్పుడు... స్వాతంత్యదినం అని ఎలా అంటారని ప్రశ్నించారు. -
వలస గిరిజనులపై దాడి
మన రాష్ట్ర సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి ఆదివాసీలు ఎందరో ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు వలసవచ్చారు. 35 సంవత్సరాల క్రితం మొదలైన ఈ వలసలు గత పదేళ్లుగా బాగా పెరిగాయి. జీవనోపాధికి వేటనే ఆధారం చేసుకున్న వారు తమ సంచార జీవనంలో భాగంగా ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వలస వెళ్లి అడవిలో తమ ఇండ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు. అలాంటివారు 25 ఏళ్ల క్రితం కొందరు ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చింతూరు, చర్ల, పినపాక, జూలూరుపాడు మండలాల్లోని అడవుల్లో తమ నివాసమేర్పర్చుకొని జీవిస్తున్నారు. వీరికి ప్రభుత్వం ఓటు హక్కు, రేషన్ కార్డులు మంజూరు చేశారు. గత పదేళ్లుగా మావోయిస్టులు, సల్వాజుడుం ప్రైవేటు సైన్యం ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో జరుపుతున్న దాడులు, ప్రతిదాడులతో ఆ ప్రాంతంలో 600 గ్రామాల ప్రజలు పూర్తిగా నిరాశ్రయులై ఖమ్మం జిల్లాలోని అడవుల్లో నివాసమేర్పరచుకొని జీవనం సాగిస్తున్నారు. వారు తాము నివాసమున్న ప్రాంతంలో కొంత భూమిని సాగు చేసుకొని జీవిస్తున్నారు. ఇట్టి భూమిని వదిలిపోవాలని అటవీ అధికారులు వారిని హెచ్చరిస్తూ వారి నివాసాలపై దాడి చేస్తూ వారి ఇళ్లను దగ్ధం చేస్తున్నారు. చర్ల మండలంలోని చెన్నాపురం, ఎర్రంపాడు, భద్రాచలం ప్రాంతాల్లోని వారి నివాసాలకు నిప్పుపెట్టిన అటవీ శాఖాధికారులు మానవత్వాన్ని మరచి ప్రవర్తిస్తున్నారు. వలస గిరిజనులపై దాడి చేస్తూ, అటవీ హక్కుల చట్టాన్ని అపహస్యం చేస్తున్న వారి పద్ధతి తక్షణమే మార్చుకోవాలని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదివాసీలను ఆదుకోవాలని ప్రభుత్వానికి మనవి. - డాక్టర్ ఎ.సిద్దన్న (మాజీ సైనికుడు) కొల్లాపూర్, మహబూబ్‌నగర్ జిల్లా. -
తప్పించుకు తిరిగిన ‘ధన్యుడు’
‘ఎప్పటికెయ్యది ప్రస్తుత/మప్పటికి కా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక, తానొవ్వక,/ తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ!’ నలుగురు నడిచే దారిలోనే వెళుతూ, చనిపోయిన వారి ఔన్నత్యాన్ని ఆకాశానికి ఎత్తివేయడం మన దేశంలో, సంస్కృతిలో కనిపిస్తుంది. అంటే ఒక మనిషిని అంచనా వేయడంలో ఆయన ఆచరణను కొద్దిగా అయినా పరిగణన లోనికి తీసుకునే లక్షణం మనకు దాదాపు లేదనే చెప్పాలి. ఇటీవల పరమ పదించిన ప్రసిద్ధ శాస్త్రవేత్త, రోదసీ శాస్త్ర నిపుణుడు, క్షిపణి ప్రయోగ సాంకేతిక నైపుణ్యంలో ఉద్దండుడు, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విషయంలో ఇలాగే జరగడం ఆ లక్షణం కొనసాగింపే. వెలుగూ... చీకటీ... ఎంతటి వ్యక్తి అయినప్పటికీ మానవీయ సంబంధాల గురించి ఆయన సామా జిక స్పృహ, దృక్పథం; అదే విధంగా మానవతా దృష్టికోణం; ధనస్వామ్య, పాలకవర్గాల నుంచి బహుజనులు ఎదుర్కొంటున్న సమస్యలు- అనుభవి స్తున్న అత్యాచారాల పట్ల ఆయన వైఖరి ఏమిటి అనే కోణాల నుంచి విధిగా అంచనా వేయాలి. అబ్దుల్ కలాం శాస్త్ర పరిశోధనల పట్ల, సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంతో చేసిన దార్శనికతకు సంబంధించి మనకు ఎలాంటి పేచీ ఉండ వలసిన అవసరం లేదు. ఆయన కన్న కలలతో గానీ, ‘కలలు కనండి’ అంటూ దేశ యువతకు ఆయన ఇచ్చిన నినాదంతో గానీ ఎవరికీ విభేదాలు ఉండనవ సరం లేదు. ఆయన దగ్గరకు చేర్చుకుని చిన్నారుల పట్ల చూపిన ముద్దు మురి పాలు, ప్రదర్శించిన అనురాగ ఆప్యాయతలు ముచ్చట గొలిపేవే కూడా. దేశ రక్షణలో అంతర్భాగంగా ఆయన నాయకత్వంలో జరి గిన ప్రయోగాలతో విభేదించవలసిన అవసరం లేదు. కానీ కొన్ని అంశాలలో కలాం వైఖరితో మనం దూరంగా ఉండక తప్పదు. శాస్త్ర విజ్ఞానంతో, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మానవుడు తనలో మరింత ఆత్మీయత, మమేకత్వం పెంచుకోవాలి. మానవీయత పరిఢవిల్లాలి. కానీ ఆయన రాష్ట్రపతి పదవికి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే తరఫున ఎం దుకు, ఏ పరిస్థితులలో పోటీకి దిగవలసివచ్చింది? జాతీయస్థాయిలో మైనా రిటీ పట్లగానీ, వారు పాలకవర్గాల వల్ల అనుభవించిన వేధింపులు, ఎదు ర్కొన్న అత్యాచారాలు, వివక్ష వంటి అంశాల పట్ల కలాం జీవితకాలంలో ఏ రోజూ గొంతెత్తి ఖండించిన ఉదాహరణలు కనిపించవు. కలాం ప్రధానంగా ముస్లిం మైనారిటీ వర్గానికీ, పేదవర్గానికీ చెందిన వారు. అయినా గుజరాత్ లో మోడీ హయాంలో (2002) రెండు వేల మందిపై జరిగిన మైనారిటీల ఊచకోత పట్ల నోటిమాటగా అయినా నిరసన తెలియచేయలేదు. బాల బాలి కల, యువకుల మనసులను ‘రగిలించగలిగిన’వారు కలాం. కానీ తన మెజా రిటీ దళితవర్గానికి చెందిన అభాగ్యుల మీద ఊచకోత జరిగితే తన మనసు ఎందుకు స్పందనతో రగలలేకపోయిందన్నది ప్రశ్న. ఆయన అంత ర్జాతీయ స్థాయి కలిగిన శాస్త్రవేత్త. కానీ రాష్ట్రపతి హోదాలో బాబాలకూ, కుహనా స్వాములకూ భక్తుడెలా కాగలిగారు? కర్ణాటక సంగీతమంటే ఇష్టపడే హృద యమున్న కలాం, నాగపూర్ కేంద్రంగా ఉన్న ఒక మత సంస్థ కేంద్ర కార్యాల యానికి వెళ్లి దాని వ్యవస్థాపకులను పొగ డ్తలతో ఎలా ముంచెత్త గలిగారు? మైలాపూర్ (చెన్నై) తాళ వాద్య కచేరీలలో పాల్గొనే సంస్కృతీ పరునిగా కలాం పేర్గాంచారు. కానీ శాంతి సౌమనస్యాల కంటే దేశాన్ని ఆధునిక ఆయుధీకరణ జరిగినశక్తిగా, అణ్వస్త్ర దేశంగా రూపొందించాలన్న తలంపు ఉన్న వాజపేయి నాయకత్వంలోని ఎన్డీఏ సర్కారుకు ఎందుకు శాస్త్రసాంకేతిక అంశాల సలహా దారుగా పనిచేశారు? ఇవన్నీ కాకున్నా, వాజపేయి ప్రభుత్వం ఏ పరిణామాల ఫలితంగా కలాంను ప్రథమ పౌరుని పదవికి తమ అభ్యర్థిగా ప్రకటించవలసి వచ్చింది? గుజరాత్ మైనారిటీల మీద జరిగిన హత్యాకాండ దరిమిలా పార్టీ ఎదుర్కొన్న తీవ్ర విమర్శల నుంచి బయటపడవేసే యత్నంలో భాగంగానే కలాంను బీజేపీ ‘తురుపు’గా వాడుకుంది! ప్రజా వ్యతిరేకత పట్టలేదు 1997లో వాజపేయి ప్రభుత్వం కలామ్‌కు ‘భారతరత్న’ పురస్కారం అందిం చింది. ఆ ఊపులో కలాం చేసిన పని- తమిళనాడులో కూడంకులమ్ అణు విద్యుత్ కర్మాగారానికి ప్రభుత్వ సలహాదారుగా పచ్చజెండా ఊపారు! ఇది యాదృచ్ఛికమనుకోవాలా? ఐచ్ఛికమనుకోవాలా? ప్రజాబాహుళ్యం నుంచి, స్థానిక శాస్త్రవేత్తలు, ప్రజలు నిరసనలు సాగిస్తున్నా కూడా కలాం అణు విద్యు త్ కేంద్రానికి ఆమోదం తెలిపారు. ఒడిశాలో ‘వేదాంత అల్యూ మినియం’ ప్రాజెక్టు విషయంలో కలాం ప్రభుత్వ చర్యలకు మద్దతు పలికారు. ఇక్కడ కూడా ప్రజలు వ్యతిరేకత, అక్కడి డోంగ్రియా ఆదివాసీ ప్రజల జీవి తాలకు అది ప్రాణాంతకంగా తయారవుతుందని పరిశోధకులూ నిపుణులూ చేసిన హెచ్చరికలు ఉన్నాయి. రాష్ట్రపతి పదవికి ఎంపిక కాకముందు ‘మరణశిక్ష రద్దు కావాలని’ కలాం మాట్లాడారు. ఈ మరణశిక్షలకు గురైన వ్యక్తుల జీవి తాల వెనక, ‘సామాజిక ఆర్థిక కోణాలు’ ఉండి ఉంటాయని వాస్తవికంగా మాట్లాడిన కలాం రాష్ట్రపతి పదవిలో స్థిరపడిన తరువాత భిన్న ధోరణిని కన పరిచారు. 2004లో ధనంజయ్ ఛటర్జీ (పశ్చిమబెంగాల్) అనే నిరుపేద కాప లాదారునికి మరణశిక్ష విధించారు. 1990 నాటి ఒక కేసులో (‘అత్యాచారం, హత్య’) ఈ శిక్ష పడింది. తరువాత కొలది రోజులకే భారత కేంద్ర గణాంక శాఖకు చెందిన ఇద్దరు పరిశోధక పండితులు దేవాసిస్ సేన్గుప్త, ప్రబాల్ చౌధురి జరిపిన సరికొత్త విశ్లేషణ వివరాలను ప్రజాస్వామ్యహక్కుల పరి రక్షణా జాతీయసంస్థ ‘పీపుల్స్ యూనియన్’ బహిరంగ పరచింది: హత్య అభియోగంపై అరెస్టయి, ఉరిశిక్ష పడిన ధనంజయ్ నిర్దోషి అనీ, శిక్ష కోసమే ‘వాస్తవాల’ పేరిట విచారణ కథలు అల్లారనీ అప్పుడు వెల్లడైంది. సాక్ష్యాధా రాలను సృష్టించడంలో పోలీసుల పాత్ర ఉందని పరిశోధకులు ఆరోపించారు. మనసు విప్పిన సందర్భం ఏదీ? కాశ్మీర్ పౌరుడు అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష ‘సమాజ పౌరుల అంతరాత్మను / మన స్సాక్షిని’ (కలెక్టివ్ కాన్షన్స్ ఆఫ్ ది సొసైటీ) తృప్తిపరచడం కోసం అవసరమని ధర్మాధర్మ విచారణ చేయవలసిన న్యాయస్థానమే చెప్పడం మనమూ, మన చట్టాలూ ఎటు ప్రయాణిస్తున్నాయో తెలిసిపోతోంది! అంతేగాదు, చివరికి మొన్న ఉరితీసిన యాకుబ్ మెమన్ విషయంలో కూడా అన్ని వర్గాలకు చెం దిన వారు మతాతీతంగా స్పందించినా, కలాం రాష్ర్టపతిగా కొలువు చాలిం చుకున్నా గాని స్పందించలేకపోయారు! ఈ అంశంలో మాజీ రాష్ర్టపతుల సామాజిక స్పృహకు, ఆర్డినెన్స్‌ల విష యంలో వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడంలో పాటించిన మానవీయ కోణాలకు, కలాం వహించిన వైఖరికి మధ్య తేడా స్పష్టమైపోయింది. చివరికి 1998లో రెండవసారి బీజేపీ హయాంలో జరిపిన అణుశక్తి పాటవ పరీక్ష (పోఖ్రాన్-2) కలాం ఆధ్వర్యంలోనే జరిగినా, దాని వాస్తవ ఫలితాన్ని గురిం చి ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. బాబా అణు పరిశోధన కేంద్రం లగా యితూ పలువురు అణు శాస్త్రవేత్తలు ఈ రెండు ప్రయోగ ఫలితాన్ని చూసి పెదవి విరిచారు. అంతేగాదు, ఇందిరా గాంధీ హయాంలో మొదటి పాటవ పరీక్ష నూరు శాతం విజయవంతం కాగా రెండవ ప్రయోగ ఫలితం తర్వాత అణుశక్తి వినియోగానికి అభ్యంతరాలు పెడుతూ, ఆంక్షలు పెట్టేందుకు ఒప్పం దంపై సంతకాలు చేయించేందుకు అమెరికా పాలకులు భారత పాలకులపై ఒత్తిడి తీసుకురావడమూ తెలిసిందే! పెట్టుబడి వ్యవస్థ ఎజెండా అణుశక్తిని శాంతికాల ప్రయోజనాలకు వినియోగించడంలో ఇక భారత పాల కులు అమెరికా కనుసన్నల్లోనే మెలగవలసి వస్తుంటుంది! మన దేశీయ విదే శాంగ విధానాలు అమెరికా సన్నాయి నొక్కులకు లోబడే జరుగుతాయన్న వాస్తవాన్ని మరవరాదు! భారత పాలనా వ్యవస్థలో రాష్ట్రపతి ఆచరణలో ఒక రబ్బరు స్టాంపుగానే మిగిలిపోయినంత కాలం, పదవిని కోల్పోవడాన్ని తన ఆస్తినే కోల్పోయినట్టుగా ఆ ‘స్టాంపు’ భావించుకున్నంత కాలం ఉరిశిక్షలను గాని, రాజకీయ ఆర్థిక రంగాలలో పెట్టుబడిదారీ వ్యవస్థలో విపరిణామాలను గానీ నివారించగల శక్తి ఆ ‘స్టాంపు’నకు ఉండదు గాక ఉండదు. దళిత నాయ కులు కొందరిని కాంగ్రెస్, బీజేపీ పాలకవర్గాలు పావులుగా వాడుకుని అధి కార స్థానాలకు సంపన్న వర్గాలే ఎగబాకుతున్నాయి. ఈ ప్రత్యక్ష దాడి బొం బాయి నియోజకవర్గం నుంచి దళిత అభ్యర్థిగా డాక్టర్ అంబేడ్కర్ పోటీ చేసి నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మరో దళితుడ్ని రంగంలోకి దిం చింది! ఈ ‘ఆట’కు నేటికీ విడుపులేదని గ్రహించాలి. రాజకీయ శాస్త్రం నుంచి ఆర్థికశాస్త్రాన్ని సామాజిక సమస్యల నుంచి సెక్యులరిజం నుంచి ప్రజానుకూ లమైన ఎజెండా నుంచి శాస్త్రీయ దృక్పథాన్నీ వేరు చేయటం పెట్టుబడి వ్యవస్థ అసలు ఎజెండా! (వ్యాసకర్త మొబైల్: 9848318414) - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
పేదలు, దళిత, ఆదివాసులను దగా చేసిన కేంద్ర బడ్జెట్
బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ బడ్జెట్‌ను ఎంతో గొప్పగా చెబుతున్నప్పటికీ, విశ్లేషించి చూస్తే సంక్షేమంపై వేటు వేసి కార్పొరేట్లకు మరిన్ని రాయితీలు కల్పించే దిశగా సాగింది. మొత్తం బడ్జెట్ రూ.17,77,477 కోట్లు కాగా ఇందులో ప్రణాళికా వ్యయం రూ.4,65,277 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.13,12,200 కోట్లు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.17,415 కోట్లు తక్కువ. 2014-15 ప్రణాళికా వ్యయం రూ.5,75,000 కోట్లతో పోలిస్తే ఈ బడ్జెట్లో ప్రణా ళిక వ్యయం రూ.1,09,723 కోట్లు తగ్గింది. గత బడ్జెట్లో ప్రణాళికా వ్యయం 32 శాతంగా ఉండగా, ఇప్పుడది మన దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 26.17 శాతానికి పడిపోయింది. దీని వలన సంక్షేమ కార్య క్రమాలకు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత ఏర్పడు తుంది. ప్రత్యేకించి బడుగు, బలహీన వర్గాలకు నిధుల కోత వలన అభివృద్ధిలో అన్యాయం జరుగుతుంది. ఇప్పటికీ ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇంకా రోడ్ సౌకర్యం లేని ఆవాస ప్రాంతాలు 1,78,000 వరకు మనదేశంలో ఉన్నాయి. విద్యుత్ వెలుగులు లేని గ్రామాలు 20 వేలకు పైమాటే. రైతుల ఆత్మహత్యలు ఆపేలా విశ్వాసం కలిగించే చర్యలు లేకపోగా, సంక్షోభంలో ఉన్న వ్యవ సాయ రంగాన్ని ఆదుకునే చర్యలు పెద్దగా లేవు. కేంద్ర ప్రభుత్వం నిధులతో సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చేస్తున్న పథకాలకు కేంద్రం నిధులు కుదించే ప్రతిపాదనలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాల వాటా పెంచుకోమని ప్రతిపాదించింది. ఈ బడ్జెట్లో ఎస్సీల అభివృద్ధికి రూ.30,851 కోట్లు, ఎస్టీల అభి వృద్ధికి రూ.19,980 కోట్లు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కేటాయిం పుల కన్నా తక్కువ. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను జనాభా ప్రాతిపది కన ఎస్సీలకు 16.60 చొప్పున రూ.77,235 కోట్లు, ఎస్టీలకు 8.6 శాతం చొప్పున రూ.40,014 కోట్లు చేయాల్సి ఉండగా, ఎస్టీలకు కేవలం 6.63 శాతం, ఎస్టీలకు 4.29 శాతం కేటాయించి మోసం చేసింది కేంద్ర ప్రభు త్వం. మొత్తం ఎస్సీ, ఎస్టీలకు సబ్‌ప్లాన్ నిధులు రూ.1,17,249 కోట్లు రావాల్సి ఉండగా, కేవలం 50,831 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే రూ.66,418 కోట్లు వీరికి న్యాయంగా దక్కాల్సినవి నిరాకరిం చారు. ఎస్సీలకు 60 శాతం నిధులు నిరాకరించగా, ఎస్టీలకు 53 శాతం నిధులను నిరాకరించారు. 2014-15 బడ్జెట్లో ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.43,208 కోట్లు కేటాయిం చగా, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.26,714 కోట్లు కేటాయించారు. కనీసం అరకొరగా కేటాయించిన సబ్‌ప్లాన్ నిధులను కూడా సక్రమంగా ఖర్చు పెట్టకపోగా, దారిమళ్లిస్తున్నారు. భారతదేశంలో దారిద్య్ర రేఖకు దిగు వన ఉన్న వారిలో దళితులు, ఆదివాసులే అత్యధికం. వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధి పట్ల పాలకుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ఈ సంవ త్సరం బీజేపీ ప్రభుత్వం దళితులకు, ఆదివాసులకు ‘‘అచ్చే దిన్’’ చూపిస్తుందని ఆశించిన వారికి నిరుత్సాహం మిగిల్చారు. ఒక అంచనా ప్రకారం గత 30 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు సబ్ ప్లాన్ల ద్వారా రావాల్సిన రూ. ఐదు లక్షల కోట్లను దారిమళ్లించింది. దళిత ఆదివాసుల పిల్లలు పౌష్టికాహార లోపంతో అకాల మర ణాల పాలవుతున్నారు. బాలింతల, శిశు మరణాలు ఈ వర్గాలలో ఎక్కువగా నమోదవుతున్నాయి. వారి కోసం ఏర్పాటైన అంగన్వాడీలు ప్రమాణాలు లేక కునారిల్లుతున్నాయి. వీటిని సంస్కరించాల్సిన ప్రభు త్వాలు అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకుంటున్నాయి. ఈ బడ్జెట్లో కూడా మోదీ ప్రభుత్వం కేవలం 1500 కోట్లు మాత్రమే కేటాయించింది. మరో వైపు ఈ బడ్జెట్లో కార్పొరేట్లకు కార్పొరేట్ పన్నును 30 నుంచి 25 శాతానికి తగ్గించి ఆ వర్గాలను సంతోష పెట్టే ప్రతిపాదనలు చేసింది. 2004-2014 మధ్యలో యూపీఏ ప్రభుత్వం కార్పొరేట్ కంపె నీలకు, పారిశ్రామిక వర్గాలకు దాదాపు 35 లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చింది. అలాగే నేటి మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఐదు లక్షల కోట్ల రూపాయల రాయితీలను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసింది. అత్యధిక జనాభా కలిగిన పేద వర్గాల అభివృద్ధికి జరగాల్సినంత కృషి జరగలేదు. కనీసం వారికి అందాల్సిన నిధులు కూడా దారి మళ్లిస్తున్నారు. - ఆంజనేయులు మద్దులూరి సామాజిక కార్యకర్త, మొబైల్: 80190 70080 -
పదమూడు మంది గిరిజనుల కిడ్నాప్
-
గిరి పుత్రులకు.. మొసళ్ళ భయం!!
-
గిరిజనుల ప్రాణాలకు భరోసా లేదు
పార్వతీపురం/కురుపాం: కొమరాడ మండలంలోని పూర్ణపాడు-లాభేసు వంతెన నిర్మాణం పూర్తి చేసి, గిరిజనుల ప్రాణాలను కాపాడాలని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఆమె అ సెంబ్లీలో ప్రస్తావించిన విషయూలను ఫోన్లో ఇక్కడి విలేకరులకు వివరించారు. 2008లో సుమారు రూ.3.5కోట్ల రాష్ట్రీయ సమ వికాస్ యోజన(ఆర్‌ఎస్‌వీవై) పథకం నిధులతో అప్పటి అటవీశాఖా మంత్రి శత్రు చర్ల విజయరామరాజు పూర్ణపాడు-లాభేసు గ్రామాల మధ్య వంతెన నిర్మాణానాకి శంకుస్థాపన చేశారని, అప్పట్లో దీనినిర్మాణ బా ధ్యతలు గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్లకు అప్పగించారని తెలిపారు. వారు ఏడాది తర్వాత అంచనాల మొత్తం చాల దంటూ నిర్మాణాన్ని నిలుపుదల చేసినట్టు చెప్పారు. అనంతరం రూ.5.25 కోట్ల అంచనా వ్యయంతో ఆర్అండ్ బీ నేచురల్ హెల్పింగ్ హేండ్స్‌కు నిర్మాణ బాధ్యతలు అప్ప గించారని, వారు కూడా పనులు చేపట్టలేకపోవడం తో 2009లో రూ.6కోట్ల నిర్మాణ వ్యయంతో ఆర్అండ్బి రెగ్యులర్‌కు అప్పగించినట్టు వివరించారు. వారు కూడా పనులు చేపట్టలేకపోవడంతో రూ.3.5 కోట్ల నాబార్డు నిధులు విడుదల చేశారన్నారు. దీంతో పాటు ఆర్‌ఎస్‌ఈవై నిధులు 3.5కోట్లు మొ త్తం రూ.7 కోట్ల నిర్మాణ వ్యయంతో పలుమార్లు టెండర్లు జరిగినా..ఇప్పటివరకు పనులు జరగలేదన్నారు. వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో ఏటా వర్షాకాలంలో గిరిజ నులు నరకయూతన అనుభవిస్తున్నారన్నారు. వంతెన లేకపోవడంతో 1996లో కూనేరు వద్ద నాటు పడవ మునిగి 33 మంది మృత్యువాత పడిన విషయూన్ని గుర్తు చేశారు. వంతెన నిర్మాణం పూర్తరుుతే కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం తదితర మండలాలతో పాటు ఒడిశాకు చెందిన ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నా రు. అంతేకాకుండా సుమారు 30 గ్రామాల ప్రజలకు 50 కిలోమీటర్ల మేర దూరం తగ్గి మండల కేంద్రానికి రాకపోకలకు చేసేందుకు వీలవుతుందన్నారు. దీనిపై స్పందించిన స్పీకర్ విషయూన్ని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లారని, తమహయాంలో వంతెన నిర్మాణం పూర్తి చేసేందుకు శతవిధాలా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్టు ఆమె తెలిపారు. -
గిరిజనుల మనసులో ఏముంది!
అండమాన్-నికోబార్ దీవుల్లోని ఆదిమ ప్రజలైన జరావా గిరిజనులు దశాబ్దం కిందట వచ్చిన సునామీ ముప్పును ముందే గుర్తించారు. వారిలో ఏ ఒక్కరూ సునామీ బారిన పడలేదు. వారంతా ఎత్తై ప్రాంతాలకు ముందుగానే వెళ్లిపోవడం ‘నాసా’ శాస్త్రవేత్తలను సైతం నివ్వెరపరచింది. అయితే, జరావా గిరిజనులను పరిహసిస్తున్న ‘ఆధునిక సునామీ’ని కళ్లకు కడుతూ పంకజ్ షెఖ్సరియా తన తొలి ఇంగ్లిష్ నవల ‘ద లాస్ట్ వేవ్- ఏన్ ఐలాండ్ నావెల్’లో స్పృశించారు. ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయనతో ‘సిటీప్లస్’ ఇంటర్వ్యూ.. జరావా గిరిజనుల గురించి ఎందుకు తెలుసుకోవాలి? జరావా గిరిజనులు ఏకాంత జీవితాన్ని కోరుకుంటారు. నగ్నంగా, స్వేచ్ఛగా జీవిస్తారు. అండమాన్ దీవులన్నింటినీ కలుపుతూ నిర్మించిన గ్రేట్ అండమాన్ ట్రంక్‌రోడ్ వారి పాలిట శాపమైంది. ‘సభ్య’సమాజపు యాత్రికులు ఈ రోడ్డుపై పర్యటనలు చేస్తూ గిరిజనుల జీవితాలను దుర్భరం చేస్తున్నారు. ఈ దీవుల్లో రోడ్డు అవసరం లేదని, పడవల ద్వారా ఏ ప్రాంతమైనా చేరుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సైతం అపహాస్యమవుతోంది. జరావాల జీవితాలు.. పర్యావరణం, ప్రకృతిపై ఈ పర్యటనలు ఒక రకంగా దాడే. మన ప్రవర్తన గిరిజనులపాలిటి సాంస్కృతిక సునామీగా పరిణమిస్తోంది! వ్యాసాల నుంచి నవలకు మారడానికి కారణం? రచన, సమాజంతో వ్యక్తి జరిపే సంభాషణ. నాన్ ఫిక్షన్ ఒక టూల్. ఫిక్షన్ మరొక టూల్. పాతికేళ్లుగా వివిధ ఆంగ్ల పత్రికలకు వ్యాసాలు రాస్తున్నాను. ‘ట్రబుల్డ్ ఐలాండ్స్’, ‘ద స్టేట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇన్ నార్త్-ఈస్ట్ ఇండియా’, ‘ద జరావా ట్రైబల్ రిజర్వ్ డోసియర్’ వంటి వ్యాస సంకలనాలు వచ్చాయి. ఫిక్షన్ ద్వారా మనుషుల ఉద్వేగాలను ఎఫెక్టివ్‌గా చెప్పవచ్చు. ‘ద లాస్ట్ వేవ్’ ద్వారా జరావా గిరిజనుల జీవితాలను మైదానప్రాంత పాఠకులకు చేర్చే ప్రయత్నం చేశాను. నవలలో పాత్రల గురించి చెప్పండి? మొత్తం పాత్రలు పదిలోపే. ప్రధానపాత్రలు నాలుగు. హరీష్ అనే జర్నలిస్ట్, సీమ అనే స్థానిక యువతి, మొసళ్ల పరిశోధకుడు డేవిడ్, స్థానిక వృద్ధ గైడ్ అంకుల్ పామె. వీరి ద్వారా పడవలో- రోడ్డుపై - అడవిలో - నడక మార్గంలో అండమాన్ జీవన సౌందర్యాన్ని, వైవిధ్యాన్ని చూపే ప్రయత్నం చేశాను. ఒక తెలుగు సినిమా పాటలో ‘పిట్ట మనసులో ఏముందీ’ అనే చరణం ఉంది. వేధించడం ద్వారా కాదు, ప్రేమించడం ద్వారా గిరిజనుడి మనసులో ఏముందో నాగరికులు తెలుసుకోవాలని ‘ద లాస్ట్ వేవ్’ సూచిస్తుంది! మీ గురించి చెప్పండి? నాన్న ఉద్యోగరీత్యా రాజస్థాన్ నుంచి పుణే వచ్చారు. మాస్ కమ్యూనికేషన్స్ చేశాను. కొన్నేళ్లుగా హైద్రాబాద్‌లో ఉంటున్నాను. తెలుగమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కుమారుడు కబీర్‌కు ఐదేళ్లు. నెదర్లాండ్స్ యూనివర్సిటీలో ‘సమాజంపై సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రభావం’ గురించి పరిశోధన చేస్తున్నాను. స్థానిక-జాతీయ-అంతర్జాతీయ స్థాయిల్లో పర్యావరణ పరిరక్షణకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ (kalpavriksh.org)సభ్యుడిగా ఇరవయ్యేళ్లుగా అండమాన్-నికోబార్‌లను సందర్శిస్తున్నాను. . . : : పున్నా కృష్ణమూర్తి పంకజ్ షఖ్సరియా ‘ద లాస్ట్ వేవ్’ నవలా రచయిత -
ఏడేళ్లుగా చీకట్లో మగ్గుతున్న గిరిజనగ్రామం
-
ఇంద్రవెల్లి మానని గాయాలు..
- ఎన్నికలు వస్తున్నాయి.... పోతున్నాయి... కానీ ఇంద్రవెల్లి గాయం మానలేదు - బాధితుల భయం పోలేదు.. బతుకు భారం తీరలేదు ఇంద్రవెల్లి నుంచి ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికలు వస్తున్నాయి.... పోతున్నాయి.... కానీ ఈ ప్రాంతంలోని ప్రజలకు తగిలిన గాయం మాత్రం మానలేదు. దాని ఆనవాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఎన్నికల్లో ఎంత మంది ఎన్ని హామీలు ఇచ్చినా... తర్వాత అవి నీటిమాటలుగానే మిగిలి పోతున్నాయి. సుమారు 33 ఏళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన సంఘటన రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్త సంచలనం సృష్టించింది. ఆదివాసి గిరిజనులకు అటవి భూమిపై హక్కు కల్పించాలనే డిమాండ్‌లో ఇంద్రవెల్లిలో రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పోలీసు కాల్పులు జరిగి అనేక మంది మృతి చెందారు. పోలీసుల రికార్టు ప్రకారం 13 మందే చనిపోయారని చెప్పుతున్నా... అందుకు నాలుగైదు రెట్ల మించి గిరిజనులు మృతి చెందారని ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి. ఆ రోజు సోమవారం అంగడి (సంత) కావడంతో సమావేశానికి సంబంధం లేని ప్రజలు కూడా పలువురు మృతి చెందారు. వీరిలో ఎక్కువ మంది పిట్టబొంగారం, తాటిగూడ, ఖన్నాపూర్, వడగం వంటి గ్రామాల్లోని ప్రజలే. నాయకులు ఇక్కడికి వచ్చి బాధితులకు అనేక హామీలను ఇవ్వడం.... తర్వాత వాటిని మరచిపో వడం ప్రతి ఎన్నికల్లోనూ జరుగుతున్నది. సాక్షి ప్రతినిధి ఈ గ్రామాల్లో పర్యటించినప్పుడు బాధితుల్లో ఆనాటి సంఘటనపై భయం స్పష్టంగా కనిపించింది. ఆ సంఘటన జరిగిన తర్వాత ప్రజా సంఘాలతో పాటు స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు పలు సార్లు ఈ గ్రామాలను సందర్శించి అధ్యయనం చేశారు. అయితే... దీని వల్ల మాకు మాత్రం వొరిగింది ఏమీ లేదనే అసంతృప్తి ఇక్కడి ప్రజల్లో ఇప్పటికీ ఉంది. ఎవరు వచ్చి ఎన్ని చెప్పినా... మాకు జరిగిన మేలు ఏమీ లేదనే నిరాశలో వారున్నారు. సంఘటన జరిగినప్పుడు చనిపోయిన కుటుంబ సభ్యుల మృతదేహాలను కడసారి కూడా చూడనివ్వలేదని గుర్తు చేసుకుంటున్నారు. పోలీసులే మృతదేహాలకు అంత్యక్రియలను నిర్వహించారని చెప్తున్నారు. అయితే పోలీసులకు తెలియకుండా కొందరు తమ కుటుంబ సభ్యుల మృతదేహాలను తీసుకువచ్చి, గుట్టుగా అంత్యక్రియలను నిర్వహించినట్టు గ్రామస్తులు వివరిస్తున్నారు. మరికొందరు ఇంట్లోనే మృతదేహాలను రెండు మూడు రోజులు ఉంచుకుని వీలు చిక్కినప్పుడు ఎవరికి తెలియకుండా అంత్యక్రియలను నిర్వహించారు. దాంతో పలువురు సకాలంలో చికిత్స అందక కూడా మృతి చెందినట్టు ఇక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. వైఎస్ వచ్చిన తర్వాత పట్టాలు ఇచ్చారు ... కాగా భూముల కోసం మేం చేసిన ఆందోళనను పరిగణనలోకి తీసుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి హాయాంలో న్యాయం జరిగిందని పిట్ట బొంగారం గ్రామానికి చెందిన సిడం భీంరావ్ చెప్తున్నారు. చట్టంలో మార్పు తీసుకువచ్చి మేం సాగు చేసుకుంటున్న భూములపై మాకే హక్కు ఉండేటట్టు వైఎస్సార్ చేశారని ఆయన గుర్తు చేశారు. తద్వారా ఎందరికో మేలు జరిగిం దన్నారు. ఎప్పుడో మా తాతల నాడు భూ పట్టా లు ఇచ్చారు.. మళ్లీ వైఎస్సార్ హయాంలో మేలు జరిగిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
వనంలో వసంతమేదీ..!
* ఎనిమిది జిల్లాల్లో ఆదివాసీల ఓట్లే కీలకం * అయినా వారి అభివృద్ధిపై శీతకన్ను * వైఎస్ హయాంలో గిరిజన వికాసం * 2009లో 19 మంది ఎస్టీలకు టికెట్లిచ్చిన వైఎస్ రాష్ట్ర జనాభాలో తొమ్మిది శాతం ఉండి 8 జిల్లాల్లో నేతల తలరాతలను మార్చగల శక్తి ఉన్నప్పటికీ ఆదివాసీల జీవితాలు ఇంకా చీకట్లలోనే మగ్గిపోతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా వారి బతుకుల్లో మాత్రం వెలుగులు రావడం లేదు. ‘ఓట్ల’వేళ వారిని దగ్గర తీసుకున్నట్టు నటించే నాయకులు తర్వాత వారి గురించి క్షణకాలమైనా ఆలోచించడం లేదు. వైఎస్ హయాంలో వారి సంక్షేమానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా ఆ తర్వాతి వచ్చిన ప్రభుత్వాలు మళ్లీ వారిపై శీతకన్నేశాయి. గడ్డం రాజిరెడ్డి, నిజామాబాద్: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఐదో షెడ్యూల్ కింద 2005లో గిరిజన ప్రాంతాలను గుర్తించినా, రాజకీయంగా చట్టసభల్లో వారికి తగిన ప్రాధాన్యం లభించడం లేదు. ఎస్టీలకు రిజర్వు చేసిన ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్, ఆసిఫాబాద్, ఖానాపూర్ అసెంబ్లీ స్థానాలతోపాటు ముధోల్, నిర్మల్, సిర్పూర్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో ఆదివాసీ, గిరిజనుల ప్రభావం ఎక్కువ. వరంగల్ జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్, ములుగు నియోజకవర్గాలు ఎస్టీలకు కేటాయించినా వర్ధన్నపేట, భూపాలపల్లి, నర్సంపేటలోనూ వారే కీలకంగా మారారు. ఖమ్మం జిల్లాలోని పినపాక, ఇల్లందు, వైరా, అశ్వరావుపేట, భద్రాచలం స్థానాలను ఎస్టీలకు కేటాయించారు. సత్తుపల్లి, మధిర, ఖమ్మం, పాలేరులోనూ గిరిజనులు ప్రభావం చూపనున్నారు. నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడలోనూ ఆదివాసీలు అధిక సంఖ్యలో ఉన్నారు. జనాభాలో 9శాతం.. అభివృద్ధిలో నామమాత్రం 1971లో రాష్ట్ర జనాభాలో 13,24,368 మందితో 3.68 శాతంగా ఉన్న ఆదివాసీ, గిరిజనులు... 2011 నాటికి 59,18,073కు పెరిగా రు. రాష్ర్ట జనాభాతో పోలిస్తే ఇది 9 శాతం. 2005-06 బడ్జెట్లో గిరిజన సంక్షేమం కోసం రూ.309.63 కోట్లు, 2012-13 బడ్జెట్లో రూ.1552 కోట్లు కేటాయించినా గిరిజనుల బతుకులు మాత్రం మారడం లేదు. ఆదివాసీలపై వివక్షను రూపుమాపేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో 15మందికి, 2009లో 19మందికి పార్టీ టికెట్లు ఇచ్చి చట్టసభలకు పంపేందుకు కృషి చేశారు. తల రాతలు మార్చే శక్తిగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎనిమిది గిరిజన జిల్లాల్లో 31,485.34 చదరపు కిలోమీటర్ల పరిధిలోని 5,968 గ్రామాల్లో ఆదివాసీ, గిరిజనులు విస్తరించి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అత్యధికంగా ఖమ్మం జిల్లా జనాభాలో 26.47 శాతం మంది గిరిజనులున్నారు. ఆ తర్వాత ఆదిలాబాద్‌లో 16.74, విశాఖపట్నంలో 14.55, వరంగల్‌లో 14.10, నల్లగొండలో 10.55, విజయనగరంలో 9.55, నిజామాబాద్‌లో 9 శాతం మంది ఆదివాసీ, గిరిజనులున్నారు. వీరి ఓట్లు కీలకం కానుండడంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి రాజకీయ నాయకులు ప్రదక్షణలు చేస్తున్నారు. హామీలు గుప్పిస్తున్నారు. వైఎస్ హయాంలో.. - గిరిజనుల సంక్షేమం కోసం 2006 డిసెంబర్ 13న అటవీహక్కుల చట్టాన్ని ప్రకటించిన వైఎస్ రాజశేఖరరెడ్డి 1 జనవరి 2007 నుంచి దానిని అమల్లోకి తెచ్చారు. దానికి సరిగ్గా ఏడాది తర్వాత ప్రత్యేక చట్టం తెచ్చిన వైఎస్సార్ దీనికింద 11.27లక్షల ఎకరాలను గుర్తించారు. మొత్తంగా ఆయన హయాంలో 4.44 లక్షల ఎకరాలను 1.28లక్షల గిరిజన, ఆదివాసీ కుటుంబాలకు పంపిణీ చేశారు. - దారిద్య్రరేఖకు దిగువన ఉన్న గిరిజన కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అందజేసిన గ్రాంటుకు సమానంగా ఆర్థిక సహాయ పథకం కింద ఏటా రూ. 29 కోట్లను గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా కేటాయిస్తూ 2005 సెప్టెంబర్ 21న వైఎస్ జీవో విడుదల చేశారు. - రాష్ట్రంలోని కొండకోనలపైన, మారుమూల, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 2,351 గిరిజన ఆవాసాలను గుర్తించిన వైఎస్సార్ ఆటవీహక్కుల చట్టం, 2006 కింద త్వరితగతిన వాటిని అభివృద్ధి చేశారు. - ప్రభుత్వశాఖలు తమ ప్రణాళిక బడ్జెట్ నుంచి గిరిజన ఉప ప్రణాళిక (టీఎస్పీ)కు అందజేస్తున్న 6 శాతం నిధులను 6.6 శాతానికి పెంచుతూ 2005 నవంబర్ 7న జీవోఎంఎస్ 17 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. - పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలను 2005-06 ఆర్థిక సంవత్సరంలో సవరించారు. ఈ మేరకు 2005 ఫిబ్రవరి 10న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆ ఒక్క సంవత్సరమే 1,40,466 మంది విద్యార్థులు లబ్ధి చేకూరింది. జన తెలంగాణ వైఎస్ నమూనా ఆదర్శం వైఎస్ రాజశేఖరరెడ్డి అనుసరించి, ఆచరించిన అభివృద్ధి నమూనా తెలంగాణ నవ నిర్మాణానికి అవసరం. 2004 నుంచి 2009 వరకు రాష్ట్రంలో అన్ని వర్గాల వారి సంక్షేమానికి వైఎస్ కృషి చేశారు. మహిళలకు, యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. రైతులకు అన్ని విషయాల్లో అండగా నిలవాలి. పండించిన పంటకు సరైన ధర లభించేలా చూడాలి. సమర్థవంతంగా పాలనను అందించగలిగే విజన్ ఉన్న నాయకుడినే తెలంగాణ సమాజం ఎన్నుకోవాలి. కొన్ని మార్పులతో వైఎస్ నమూనాను అమలు చేస్తే రాష్ట్రం సగర్వంగా తలెత్తుకుని నిలబడగలుగుతుంది. - బి. అనూష, 8వ తరగతి, ఆదర్శ పాఠశాల, చిన్నకోడూరు, మెదక్ జిల్లా. వలసలు లేని పాలన రావాలి వలసలు లేని, రైతు ఆత్మహత్యలు లేని పాలన రావాలి. రైతుల పంటలను ప్రభుత్వమే గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేయాలి. పేదలందరికీ భూమిని పంచాలి. ప్రతి పల్లెకు రక్షిత జలాలను అందించాలి. కామన్‌స్కూలు విధానాన్ని ప్రవేశపెట్టాలి. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించి సామాజిక తెలంగాణ సాధించాలి. యువత రాజకీయాల్లోకి ప్రవేశించి అవినీతి రహిత పాలన అందించాలి. తెలంగాణ అమరవీరుల పేరిట స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయాలి. ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేయాలి. - జంగం శ్రీశైలం, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా -
నీళ్ల కోసం కిలోమీటర్ల మేర నడక
-
మావోయిస్టుల దాష్టికాలతో ఆదివాసీలకు అవస్ధలు
-
వీళ్లకు నీళ్లు లేవు!
సాక్షి, హైదరాబాద్: పంచవర్ష ప్రణాళికలెన్ని వచ్చిపోయినా.. పథకాలెన్ని దిగివచ్చినా... పాలకులెందరు మారినా వేల కోట్లు వెచ్చించినా.. ఏళ్లకు ఏళ్లు ఎదురు చూసినా... ఎన్ని పనులు చేపట్టినా.. రాష్ట్రంలోని గిరిజనుల తలరాతలు మాత్రం మారడం లేదు. గిరి పుత్రుల అభివృద్ధి కోసం ఎన్ని కార్యక్రమాలు, పథకాలు అమలు చేసినా వారికి మౌలిక సౌకర్యాల కల్పన ఎండమావిగానే మిగిలిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని గిరిజనుల పరిస్థితి దయనీయంగా ఉంది. రక్షిత మంచినీరు తాగే గిరిజనుల సంఖ్యను పరిశీలిస్తేనే వారి దుస్థితి కళ్లకు కడుతుంది. గిరిజనుల అభివృద్ధి కోసం కేటాయించాల్సిన నిధుల ప్రతిపాదనను 14వ ఆర్థిక సంఘానికి సమర్పించిన ప్రభుత్వం అందులో ఈ గణాంకాలను ప్రతిపాదించింది. ఈ పరిస్థితి మార్చడానికి తాజాగా రూ. 11.153 కోట్లు మంజూరు చేయాలని అర్థించింది. ప్రభుత్వం సమర్పించిన ఈ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి 100 మందిలో 49.4 మందికి రక్షిత మంచినీరు అందుతుండగా, ప్రతి 100 మంది గిరిజనుల్లో 8.4 శాతం మందికి మాత్రమే రక్షిత మంచినీరు అందుతోంది. ఇక ఫోన్కనెక్షన్ వివరాలను పరిశీలిస్తే రాష్ట్రంలోని ఇతర జనాభాలో ప్రతి 100 మందిలో 48.4 మందికి ఫోన్ అందుబాటులో ఉంది. కానీ 100 మంది గిరిజనుల్లో మాత్రం 8.5 శాతం మందికే ఫోన్ అందుబాటులో ఉంది. ఇక సమాచార వ్యవస్థలో కీలకపాత్ర పోషించే పోస్టాఫీసులు కూడా గిరిజనులకు అందుబాటులో లేవని గణాంకాలు చెపుతున్నాయి. ప్రతి 100 మందిలో 51.9 శాతం మందికి పోస్టాఫీసు అందుబాటులో ఉంటే 100 మంది ఎస్టీల్లో కేవలం 14.5 మందికే పోస్టాఫీసులు అందుబాటులో ఉన్నాయి. ఇక రవాణా సౌకర్యం విషయానికి వస్తే ట్రాన్స్‌పోర్టేషన్ ఉన్న గిరిజనులు 100 మందిలో కేవలం 26.3 శాతం మందే. ఇక వైద్యం, విద్య సదుపాయాల్లో గిరిజనుల పరిస్థితి కొంత మెరుగ్గానే కనిపించినా, ఇతర వర్గాలతో పోలిస్తే బాగా వెనుకబడ్డారు. రాష్ట్రంలోని ప్రతి 100 మందిలో 60.6 మందికి వైద్యసౌకర్యం లభిస్తుంటే, గిరిజనుల్లో మాత్రం 51.9 శాతం మందికి మాత్రమే లభిస్తోంది. ఇక విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా గిరిజన విద్యార్థులకు అందరికీ విద్యాసౌకర్యాలు అందుబాటులోనికి రాలేదని లెక్కలు చూస్తే అర్థమవుతోంది. రాష్ట్రంలో మిగతా జనాభాలో ప్రతి 100 మందికిగాను 94.4 శాతం మందికి విద్యాసౌకర్యాలు అందుబాటులో ఉంటే ప్రతి 100 మంది ఎస్టీల్లో 20.5 శాతం మందికి మాత్రమే విద్యాసౌకర్యాలున్నాయని ఆర్థిక సంఘానికి ఇచ్చిన నివేదికలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పేర్కొన్నారు. వీరి అభివృద్ధికి గాను వచ్చే ఐదేళ్లలో రూ.11,153 కోట్లు ఇవ్వాలని కోరారు.