
సాక్షి,బొబ్బిలి: మండలంలోని డొంగురువలస, ఎరకందొరవలస, మోసూరువలస, బట్టివలస, అక్కేనవలస, రాజచెరువువలస, చిలకమ్మవలస, విజయపురి, సిమిడిగుడ్డివలస, మూలవలస తదితర 18 గిరిజన గ్రామాలకు భోగీ పండగ సంగతే తెలియదు. వారెవరూ భోగి, సంక్రాంతి పండగలు చేసుకోరు. వారంతా మైదాన ప్రాంతాలలో ఉన్న గిరిజనులే. బొబ్బిలి పట్టణానికి 5కిలోమీటర్ల దూరంలోనే నివసిస్తున్నారు.
వీరంతా ఇటుక పండగ, పిల్లి పండగలను మాత్రమే నిర్వహిస్తారు. ఆ గిరిజనుల్లో కొందరు క్రిస్మస్ చేసుకుంటారు. అయితే ఇటీవలే సమరసతాసేవాసంస్థ డొంగురువలస, రాజచెరువువలస గిరిజనానికి హిందూమతాన్ని పరిచయం చేయడంతో హిందూ సంప్రదాయాలను ఇటీవల ప్రారంభించినప్పటికీ భోగి, సంక్రాంతి పండగలు నిర్వహించరు.
Comments
Please login to add a commentAdd a comment