తిరగబడిన మహిళలను లాక్కెళ్తున్న పోలీసులు
సాక్షి, మంచిర్యాల/దండేపల్లి: అటవీ భూముల్లో గిరిజనుల గుడిసెల తొలగింపుతో జోరు వర్షంలోనూ అటవీ, పోలీసు అధికారులు, గిరిజనులకు మధ్య రెండో రోజూ ఘర్షణ కొనసాగింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడ శివారు అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న ఆరు తాత్కాలిక గుడిసెల తొలగింపు తీవ్ర ఉద్రిక్త తకు దారి తీసింది. గుడిసెలు తొలగించేందుకు శుక్రవారం ఉదయమే లక్సెట్టిపేట సీఐ కరీముల్లా ఖాన్ దాదాపు వంద మంది సిబ్బందితో వెళ్లారు.
దీంతో గిరిజనులు కర్రలు, కారం పొడితో అధికారు లపై తిరగబడ్డారు. ఈ సందర్భంగా ఆరుగురు మహిళలను అధికారులు జీపుల్లో తరలి స్తుండగా గిరిజనులు దారిపొడవునా అడ్డుకుని, తమ వారిని విడిచిపెట్టాలని ఆందోళన చేశారు. అధికారులు వారిని పక్కకు నెట్టి మహిళలను తాళ్లపేట రేంజి ఆఫీసుకు తరలించారు. అక్కడ కూడా గిరిజనులు బైఠాయించి, సీపీఎం, వ్యవ సాయ కార్మిక సంఘం, బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన చేప ట్టారు.
ఆది వాసీలను ఇబ్బందులకు గురిచేస్తున్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమా ండ్ చేశారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ హన్మంతరావు.. ఆ మహిళ లను బైండోవర్ చేస్తూ, 6 నెలలపాటు ఎలాంటి గొడవలకు పాల్పడవద్దని, లేకపోతే రూ.50వేల జరిమానా విధిస్తామని హెచ్చ రించి విడిచిపెట్టారు. ఇందులో దోసండ్ల సునీత అనే మహిళ తనను ఒంటరిగా గదిలో నిర్బంధించి అధికారులు చిత్రహింసలకు గురి చేశారని రోదిస్తూ చెప్పింది. రిజర్వు ఫారెస్టులో ఆక్రమణలు చేపడుతున్నారని, గత నెల 1న అటవీ అధికారులు కేసులు నమోదు చేయగా, అప్పటి నుంచి ఇరు పక్షాలమధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment