'అభిమానుల తీరు బాధ కలిగించింది' | Hrithik Roshan fans causes locals injured in Jabalpur | Sakshi

'అభిమానుల తీరు బాధ కలిగించింది'

Dec 17 2015 2:47 PM | Updated on Sep 3 2017 2:09 PM

'అభిమానుల తీరు బాధ కలిగించింది'

'అభిమానుల తీరు బాధ కలిగించింది'

మొహంజొదారో షూటింగ్ సందర్భంగా అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించటంపై హృతిక్ రోషన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. హృతిక్ లీడ్ రోల్లో అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్...

మొహంజొదారో షూటింగ్ సందర్భంగా అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించటంపై బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. హృతిక్ లీడ్ రోల్లో అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ సినిమా మొహంజోదారో. ప్రస్తుతం జబల్పూర్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లోకేషన్ లో హృతిక్ కు అభిమానుల మూలంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. హృతిక్ ప్రయాణిస్తున్న వాహనాన్ని అభిమానులు ద్విచక్ వాహనాలపై వెంబడించటంతో కొంతమందికి గాయాలయ్యాయి.

ఈ విషయం పై హృతిక్ స్పందిస్తూ. 'మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ ఇతరులకు హాని కలిగించటం బాధగా ఉంది. మీరు నా దగ్గరికి రాకపోయినా మీ ప్రేమను నేను ఫీల్ అవుతాను' అంటూ వ్యాఖ్యానించాడు.  పూజాహెగ్డే ఈ సినిమాతో బాలీవుడ్కి పరిచయం అవుతోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2016లో ఆగస్టులో రిలీజ్ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement