జబల్‌పూర్: అవినీతికి పాల్పడడంలో ఏమాత్రం జంకని అధికారులు.. పైఅధికారుల చర్యలకు ఎందుకనో వణికిపోతుంటారు. అయితే ఇక్కడో అధికారి భయపడలేదు.. ఏకంగా బెదిరిపోయాడు. ఆ కంగారులో కరెన్సీ నోట్లను మింగేశాడు.
మధ్యప్రదేశ్ కత్నికి చెందిన రెవెన్యూ అధికారి(పట్వారి) గజేంద్ర సింగ్ బర్ఖేడా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశాడట. దీంతో బాధితుడు లోకాయుక్తకు చెందిన స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్(SPE) అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో ప్లాన్ ప్రకారం గజేంద్ర కోరిన ఐదు వేల లంచంతో బాధితుడు కార్యాలయానికి చేరుకున్నాడు. గజేంద్ర లంచం తీసుకుంటున్న టైంలో ఎస్‌పీఈ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. వాళ్లను చూసి ఆందోళన చెందిన ఆ అధికారి తప్పించుకోవాలనే ఆలోచనతో ఆ నోట్లను కసాబిసా నమిలి మింగేశాడు.
వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు అతన్ని పరిశీలించి క్షేమంగానే ఉన్నట్లు తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
A patwari in Katni in Madhya Pradesh was caught in a bribe-taking act by a team of the Lokayukta's Special Police Establishment. In a desperate attempt to escape, he allegedly swallowed the money he had accepted as a bribe. #AntiCorruption #BriberyCase #Lokayukta #Katni #MP pic.twitter.com/zgYXpbdYGv
— The BothSide News (@TheBothSideNews) July 24, 2023
Comments
Please login to add a commentAdd a comment