coaches derailed
-
Madhya pradesh: పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్ రైలు
భోపాల్: మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఇండోర్-జబల్పూర్ (సోమనాథ్) ఎక్స్ప్రెస్కు చెందిన రెండు కోచ్లు పట్టాలు తప్పాయి. ఈ ఎక్స్ప్రెస్ ఇండోర్ నుండి జబల్పూర్కు వస్తున్న క్రమంలో జబల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. శనివారం తెల్లవారుజామున 5. 40 గంటలకు జబల్పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉండడంతో రైలు వేగం చాలా తక్కువగా ఉందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.#WATCH | Two coaches of Indore- Jabalpur Overnight Express derailed in Jabalpur, Madhya Pradesh. No casualties/injuries reported. More details awaited pic.twitter.com/A8y0nqoD0r— ANI (@ANI) September 7, 2024 రెండు కోచ్లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులందరినీ హడావుడిగా రైలు ఎక్కించారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
ముంబయి: మహారాష్ట్రలోని కసర రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు రెండు కోచ్లు పట్టాలు తప్పాయని సెంట్రల్ రైల్వే తెలిపింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో 11 ఎక్స్ప్రెస్ రైళ్లను దారి మళ్లించారు. మరో నాలుగు ఎక్స్ప్రెస్ రైళ్ల రాకపోకలపై ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు. Two coaches of a goods train derailed near Kasara. Kalyan Station Road ART and Igatpuri Station Rail ART were ordered and moved to the accident site: Central Railway CPRO pic.twitter.com/WxUWH2HvFF — ANI (@ANI) December 10, 2023 రైలు పట్టాలు తప్పినప్పటికీ ముంబయి సబర్బన్ రైలు సేవలు ప్రభావితం కాలేదని సెంట్రల్ రైల్వే తెలిపింది. కళ్యాణ్- ఇగత్పురి నుండి అధికారులు రెండు సహాయ రైళ్లను సంఘటనా స్థలానికి పంపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి: కూతుర్ని చంపి రీసార్ట్లో దంపతులు ఆత్మహత్య -
మహారాష్ట్రలో రైలు ప్రమాదం
ముంబై: యూపీ రైలు ప్రమాదం ఘటన మరువకముందే ఆ మరుసటిరోజే మరో రైలు ప్రమాదం జరిగింది. కుర్లా-అంబర్ నాత్ లోకల్ ట్రెయిన్ 5 బోగీలు నేటి ఉదయం దాదాపు ఆరు గంటల సమయంలో పట్టాలు తప్పాయి. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. కల్యాణ్-విట్టల్ వాడి మార్గం మధ్యలో రైలు బోగీలు పట్టాయితప్పాయి. అయితే ప్రమాద నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనతో కల్యాణ్-కర్జాత్ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలో రాకపోకలకు తాత్కాలికంగా నిలిపివేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.