తప్పిన పెను ప్రమాదం: అరగంటలో రెండుసార్లు | Mumbai: Two Coaches Of Express Train Derailed Twice In 2 Hours | Sakshi
Sakshi News home page

తప్పిన పెను రైలు ప్రమాదం: అరగంటలో రెండుసార్లు

Published Sat, Feb 13 2021 12:37 PM | Last Updated on Sat, Feb 13 2021 1:00 PM

Mumbai: Two Coaches Of Express Train Derailed Twice In 2 Hours - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ముంబై: బాంద్రా టర్మినస్‌ నుంచి రామ్‌నగర్‌ బయలుదేరిన ఎక్స్‌ప్రెస్‌ రైలు బోగీలు రెండు సార్లు విడిపోవడంతో రైళ్ల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పశ్చిమ రైల్వే మార్గంలోని బాంద్రా టర్మినస్‌ నుంచి గురువారం ఉదయం రామ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బయలుదేరింది. కొద్ది సేపటికే పశ్చిమ ఉప నగరంలోని జోగేశ్వరీ–రామ్‌ మందిర్‌ స్టేషన్ల మధ్య కప్లింగ్‌ ఊడిపోయి చివరి రెండు బోగీలు విడిపోయాయి. రంగంలోకి దిగిన సాంకేతిక సిబ్బంది గంటన్నరకుపైగా శ్రమించి వాటిని జోడించి రైలును పంపించారు. దీంతో ఫాస్ట్‌ మార్గంలో లోకల్‌ రైళ్లతో పాటు దూర ప్రాంత ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కూడా నిలిచిపోయాయి. ఆ తర్వాత నగర శివారు ప్రాంతమైన నాయిగావ్‌–వసై రోడ్‌ స్టేషన్ల మధ్య మళ్లీ ఆ బోగీలు విడిపోయాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.

వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ఆ బోగీలను మళ్లీ రైలుకు జోడించకూడదని నిర్ణయం తీసుకున్నారు. వాటి స్థానంలో మరో రెండు ఎల్‌హెచ్‌బీ బోగీలను తెప్పించి జోడించడం కుదరదని అధికారులు గుర్తించారు. దీంతో ఆ రెండు బోగీల్లో ఉన్న ప్రయాణికులను దింపి అదే రైలులో మిగతా బోగీల్లో సర్దుబాటు చేసి పంపించారు. అందుకు మరో 25 నిమిషాల సమయం పట్టింది. రెండుసార్లు జరిగిన ఈ ఘటనపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని పశ్చిమ రైల్వే నిర్ణయం తీసుకుంది.

రైల్వే నియమాల ప్రకారం దూరం నుంచి వచ్చిన ప్రతీ రైలును యార్డులో నిర్వహణ పనులు పూర్తయిన తర్వాతే మళ్లీ పంపించడానికి సిద్ధం చేస్తారు. అంతా సవ్యంగా ఉంటేనే రైలును ప్లాట్‌ఫారం పైకి తెస్తారు. కానీ ఇలా బయలుదేరిన అర గంటలోపే రెండు సార్లు బోగీలు విడిపోవడం వర్క్‌ షాపు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కొత్త టెక్నాలజీతో తయారైన  ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఇలా విడిపోవడం రైల్వే సిబ్బంది నిర్వహణ లోపం, నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
చదవండి: ఇంజన్‌లో ఇరుక్కున్న బైక్‌, ఆగిన రైలు
 ఆమె కోసం ఇల్లు అమ్మేసి... ఆటోలోనే తిండి, నిద్ర

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement