విశాఖకు ట్యాకర్లతో వెళ్తున్న రైలు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఏర్పడిన ఆక్సిజన్ కొరతను దూరం చేసేందుకు రైల్వే ముందుకువచ్చింది. ఇందులో భాగంగా ఆక్సిజన్ రైలు ముంబైకి సమీపంలోని కలంబోలి నుంచి విశాఖపట్టణం బయలుదేరింది. ఖాళీ ట్యాంకర్లతో బయలుదేరిన ఈ గూడ్స్ రైలు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం నుంచి మహారాష్ట్రకు ఆక్సిజన్ తీసుకురానుంది.
ఇందుకోసం కలంబోలి రైల్వేస్టేషన్ వద్ద సెంట్రల్ రైల్వే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రైల్వే విభాగం ప్రకటించింది. దీంతో విశాఖపట్టణంలోని రైల్వే ప్లాంట్ నుంచి లిక్విడ్ ఆక్సిజన్ మహారాష్ట్రకు తొందర్లోనే అందనుంది. గత సంవత్సరం కూడా కరోనా లాక్‌డౌన్ సమయంలో నిత్యవసర వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు రైల్వే తన సేవలను అందించింది. లాతూర్ కరువు కారణంగా నీటి కొరతను తీర్చేందుకు రైల్వే ద్వారా నీటి ట్యాంకర్లను లాతూరుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment