
ముంబై: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి తగ్గుతున్న సమయంలో డెల్టా ప్లస్ వేరియంట్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.ఇటువంటి ఆందోళనల మధ్య మహారాష్ట్రలో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ మరణం నమోదైంది. రత్నగిరి జిల్లాలోని సంగమేశ్వర్ ప్రాంతంలో డెల్టా ప్లస్ వేరియంట్ తో 80 ఏళ్ల వృద్ధురాలు మరణించిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా మహారాష్ట్రలో ఇంతవరకు 21 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వాటిలో రత్నగిరిలో తొమ్మిది, జల్గావ్‌లో ఏడు, ముంబైలో రెండు, పాల్ఘర్, థానే, సింధుదుర్గ్ జిల్లాల్లో ఒక్కొక్కటిగా ఉన్నాయి.
మహారాష్ట్రలో ఆక్పిజన్ కొరత తీవ్రంగా ఉంది. పొంచి ఉన్న థర్డ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని రోజుకు 3వేల టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ) ఉత్పత్తిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే లక్ష్యంగా నిర్దేశించారు. ప్రస్తుతం రాష్ట్ర ఎల్ఎంఓ ఉత్పత్తి 1,300 టన్నులు మాత్రమే ఉంది. ఆక్సిజన్ ఉత్పత్తి, నిల్వ సామర్థ్యాన్ని పెంచాల్సిందిగా ఆక్సిజన్ ఉత్పత్తిదారులను సీఎం కోరారు. థర్డ్ వేవ్ విజృంభిస్తుందోన్నఆందోళనల నేపథ్యంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్‌ను కనుగొన్నామని థాకరే చెప్పారు.
చదవండి: ట్విటర్ ఖాతా బ్లాక్... కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment