
ముంబై : భారత్‌లో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య 1,45,380కి పెరగగా, ఒక్క మంగళవారం రోజే 6,535 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 4,167 ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలలో కేసుల పెరుగుదల అంతకంతకూ పెరుగుతుంది. (లాక్‌డౌన్ విఫలం: ప్లాన్ బి ఏంటి..! )
మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటివరకు ఆ రాష్ట్రలో 52,667 కేసులు కేసులు నమోదుకాగా ఒక్క ముంబైలోనే 31,972 కేసులు వెలుగుచూశాయి. అత్యధిక కేసులు రికార్డ్ అవుతుండటంతో బెడ్ల కొరత కూడా ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాల నుంచి వలస కార్మికుల నుంచి కూడా కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
(కరోనా : రాజకీయ సంక్షోభం తప్పదా..! )
Comments
Please login to add a commentAdd a comment