
ఎక్స్‌ప్రెస్ రైల్లో గ్యాస్ లీక్..
తిరుపతి నుంచి పూరి వెళ్తున్న పూరీ ఎక్స్‌ప్రెస్‌లో కలకలం రేగింది.
చిత్తూరు: తిరుపతి నుంచి పూరి వెళ్తున్న పూరీ ఎక్స్‌ప్రెస్‌లో కలకలం రేగింది. జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ప్రయాణికుల్లో ఒకరు అలారమ్ చైన్ లాగడంతో రైలు ఆగింది. ఈ సమాచారాన్ని వెంటనే రైల్వే పోలీసులకు ప్రయాణికులు తెలిపారు.
ఒంగోలు నగరానికి చెందిన అనిల్ కుమార్(40) అనే వ్యక్తి తనతో మూడు చిన్న గ్యాస్ సిలిండర్ల(5 కేజీ)ను పాలిథీన్ బ్యాగులో పెట్టుకుని వచ్చాడు. దాంట్లో ఒకటి లీక్ కావడంతో విషయం బయట పడింది. పోలీసులు అనిల్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదకర వస్తువులతో రైలు ప్రయాణం చేయడంతో రైల్వే యాక్ట్ 164 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.