కాకినాడ - షిర్డీ ఎక్స్ప్రెస్లో దొంగల బీభత్సం
హైదరాబాద్ : షిర్డీ నుంచి కాకినాడ వస్తున్న కాకినాడ - షిర్డీ ఎక్స్ప్రెస్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. మహారాష్ట్రలోని రొట్టేగావ్ రైల్వే స్టేషన్ సమీపంలో దోపిడి దొంగలు ఎస్ 3, ఎస్ 6 బోగీలలో ప్రవేశించారు. అనంతరం బోగీలలోని ప్రయాణికులపై దాడి చేసి.... వారి వద్ద నుంచి 10 తులాల బంగారం, భారీగా నగదుతోపాటు విలువైన వస్తువులను దోచుకున్నారు.
అనంతరం చైన్లాగి దొంగలు పరారైయ్యారు. ప్రయాణికులు దోపిడి దొంగల బీభత్సంపై రైల్వే గార్డుకు సమాచారం అందించారు. దాంతో రోట్టేగావ్ రైల్వే స్టేషన్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలులో భద్రతా సిబ్బంది లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చేశారు.