బీదర్-యశ్వంతపూర్ మధ్య మరో కొత్త రైలు అందుబాటులోకి వచ్చింది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలును ఆది వారం బీదర్ రైల్వేస్టేషన్‌లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున్‌ఖర్గే జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు వారంలో మూడు రోజులు నడుస్తుంది.
జహీరాబాద్, న్యూస్‌లైన్: బీదర్-యశ్వంతపూర్ మధ్య మరో కొత్త రైలు అందుబాటులోకి వచ్చింది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలును ఆది వారం బీదర్ రైల్వేస్టేషన్‌లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున్‌ఖర్గే జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు వారంలో మూడు రోజులు నడుస్తుంది. బీదర్ నుంచి సాయంత్రం 6.25 గంటలకు బయలుదేరే రైలు(నంబర్.16572), సా యంత్రం 6.55 గంటలకు జహీరాబాద్‌కు చేరుకుంటుంది. మరుసటిరోజు ఉద యం 7.40 గంటలకు బెంగళూరులో బయలుదేరే రైలు (నంబర్.16571) ఆ తర్వాతి రోజు ఉదయం 8.54 గంటలకు జహీరాబాద్ చేరుకుంటుంది. జహీరాబాద్ నుంచి సో మ, బుధ, శుక్రవారాల్లో మాత్రమే ఈ రైలు బెంగుళూరుకు బయలు దేరుతుంది. బెంగుళూరు నుంచి మంగళ, గురు,ఆదివారాల్లో బయలుదేరి మరుసటి రోజు జహీరాబాద్ చేరుకుంటుంది. సోమవారం నుం చి ఈ కొత్తరైలు అమల్లోకి వస్తుంది. ఆదివారం లాంఛనంగా ప్రారంభించిన ఈ రైలు ప్రతిపాదిత రైల్వే స్టేషన్‌లో ఆగుతూ వెళ్లింది. రైలు ప్రారంభ కార్యక్రమంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీదర్ ఎంపీ ధరంసింగ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉమాశ్రీలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, రైల్వేశాఖ అధికారులు పాల్గొన్నారు.
జహీరాబాద్ వాసులకు మరింత సౌకర్యవంతం
బీదర్- యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించడంతో జహీరాబాద్ ప్రాంత ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతంగా మారింది. రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, తాండూరు పట్టణాలకు వెళ్లే ప్రయాణీకులకు ఈ రైలు ఎంతో ఉపయోగపడనుంది. ప్రస్తుతం జహీరాబాద్ నుంచి తాండూరుకు తగిన రోడ్డు సదుపాయం లేక పోవడంతో ప్రయాణీకులు రైళ్లనే ఆశ్రయిస్తున్నారు. మరో కొత్త రైలును ప్రారంభించడంతో మరింత మేలు జరిగింది. ప్రస్తుతం జహీరాబాద్ మీదుగా ఒకే రైలు బెంగుళూరుకు నడుపుతున్నారు.
కోహీర్, మర్పల్లి ప్రజలకు నిరాశే!
కొత్తగా బెంగుళూరుకు రైలును ప్రారంభించినా మండల కేంద్రాలైన కోహీర్, మర్పల్లి గ్రామాల ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడడం లేదు. ఆయా రైల్వే స్టేషన్లలో రైలుకు హాల్ట్ ఇవ్వక పోవడంతో ఆయా మండలాల ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. జహీరాబాద్ నుంచి కోహీర్ 15 కిలో మీటర్లు, కోహీర్ నుంచి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న మర్పల్లి 10 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. ఆయా స్టేషన్ల మధ్య దూరం తక్కువగా ఉండడం, తగినంత రెవెన్యూ వచ్చే అవకాశం లేనందునే ఆయా రైల్వే స్టేషన్లలో హాల్ట్ ఇవ్వలేదని తెలుస్తోంది.