ghatkesar police station
-
పోలీస్ స్టేషన్లోహోంగార్డు ఆత్మహత్యాయత్నం
ఘట్కేసర్: ఓ హోంగార్డు ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పరుశురాం కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా , మక్త అనంతారం గ్రామానికి చెందిన మహ్మద్ ఘని హైమద్ చెర్లపల్లి పీఎస్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎదులాబాద్ రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్ 258, 268లో 30 గుంటల భూమి ఉంది. దాయాదులు అఫ్జల్, జబ్బార్ తన భూమి చుట్టూ ప్రహరీ నిర్మించుకోకుండా అడ్డుకుంటున్నారని మంగళవారం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇరువర్గాలను పిలిపించి మాట్లాడారు. అయినా తనకు న్యాయం చేయడం లేదని మనస్తాపానికి లోనైన మహ్మద్ ఘని బుధవారం సాయత్రం బాటిల్లో డీజిల్ తీసుకుని స్టేషన్‌కు వచ్చాడు. నేరుగా ఇన్స్పెక్టర్ క్యాబిన్లోకి వెళ్లిన అతను ఆయన ఎదుటే డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తక్షణమే స్పందించిన ఇన్స్పెక్టర్, ఇతర పోలీసులు అతడి నుంచి డీజిల్ బాటిల్‌ను లాక్కున్నారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ మేరకు అతడిపై ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఘట్కేసర్ ఓఆర్ఆర్ వద్ద బాలిక అనుమానాస్పద మృతి
ఘట్కేసర్: ఫోన్లో మాట్లాడొద్దని తల్లి మందలించడంతో వేదనకు గురైన ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. ఘట్కేసర్ సీఐ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా ఒంద్యాల్ గ్రామానికి చెందిన జమ్మికుంట విష్ణు, పద్మ దంపతుల కుమార్తె (16), కుమారుడితో కలసి అన్నోజీగూడ రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్నారు. కొంతకాలంగా కూతురు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండటాన్ని గమనించి మందలించారు. బాలికలో మార్పు రాకపోగా శుక్రవారం తిరిగి అపరిచితునితో మాట్లాడుతుండటంతో గట్టిగా హెచ్చరించారు. దీంతో వేదనకు గురైన బాలిక శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో వారు నిద్రించాక కిరోసిన్ సీసా తీసుకొని, కుటుంబ సభ్యులు బయటకు రాకుండా గడియపెట్టి సమీపంలోని ఖాళీ ప్రదేశంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. కాలిన గాయాలతో అక్కడికక్కడే మరణించింది. ఉదయం వాకింగ్‌కు వచ్చిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి డాగ్, క్లూస్ టీంలు చేరుకొని ఆధారాలు సేకరించాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఖాళీ ప్రదేశంలో బాలిక మృతదేహం కనిపించడంతో దుండగులు బాలికను సజీవదహనం చేసి ఉండొచ్చనే వదంతులు వచ్చాయి. దీంతో స్థానికులు భారీగా ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సమీపంలోని సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించగా బాలిక కిరోసిన్ సీసాతో ఒంటరిగా వెళ్లడం కనిపించింది. దీంతో పోలీసులు ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. చదవండి: అడ్డగూడూరు ఠాణాలో మహిళ లాకప్‌డెత్? -
ఘట్కేసర్ పీఎస్‌లో ఏఎస్సై ఆత్యహత్య కలకలం
సాక్షి, హైదరాబాద్ : ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఎస్సై ఆత్మహత్య ప్రయత్నం కలకలం సృష్టించింది. అధికారుల వేధింపులే కారణమని తెలిసింది. వివరాలు.. రామకృష్ణ అనే వ్యక్తి ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా విధుల నిర్వహిస్తున్నాడు. ఈనెల 10న ఒక కేసు విషయంలో కొంత మంది వ్యక్తులను పోలీసు స్టేషన్‌కి తీసుకురాగా.. ఆ సమయంలో రామకృష్ణ విధుల్లో ఉన్నాడు. అయితే రామకృష్ణ ఉన్న సమయంలోనే స్టేషన్‌కు తీసుకొచ్చినవారిలో ఒక వ్యక్తి పారిపోయాడని సమాచారం. దీంతో విధుల్లో ఉన్న ఏఎస్సై రామకృష్ణని పై అధికారులు మందలించారు. దీంతో తాను అవమానం గురైనట్లు భావించిన రామకృష్ణ నేడు జెండా పండుగకు హాజరయ్యాడు. అనంతరం ఇంటికి కాల్ చేసి ఇదే నా చివరి కాల్ అని చెప్పి ఫోన్ కట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయపై అలర్ట్ అయిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రామకృష్ణ ఫోన్ సిగ్నల్ ని ట్రాక్ చేసిన పోలీసులు ఘట్ కేసర్ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొనే సమయంలోనే అక్కడికి చేరుకొని రక్షించారు. కాగా రామకృష్ణ ని దగ్గర్లోని క్యూర్ ఆసుపత్రికి తరలించగా.. రామకృష్ణ సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. -
మేడ్చల్‌లో అమానుషం!
సాక్షి, ఘట్కేసర్: ఓ తల్లి వేసిన తప్పటడుగులు, ఓ యువకుడి ఆవేశం కలిసి అభం శుభం ఎరుగని ఐదేళ్ల చిన్నారిని బలి తీసుకున్నాయి. తొలుత స్నేహంగా ఉండి తర్వాత తనను నిర్లక్ష్యం చేస్తోందనే అక్కసుతో ఆమె ఐదేళ్ల కుమార్తెను అతడు దారుణంగా హత్య చేశాడు. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచారం మున్సిపాలిటీ ఇస్మాయిల్‌ఖాన్‌గూడ విహారి హోమ్స్‌లో గురువారం జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా అత్మకూర్ మండలంలో గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్న సూరనేని కళ్యాణ్‌రావుకు ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తికి చెందిన అనూష 2011లో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. ఇది కాస్తా ప్రేమకు దారి తీసి ఇరువురూ వివాహం చేసుకున్నారు. 2015లో వీరికి ఆద్య జన్మించింది. తమ కుమార్తె చదువు కోసమని ఇస్మాయల్‌ఖాన్‌గూడ విహారి హోమ్స్‌కు నివాసం మార్చారు. ఈ క్రమంలో ఏడాది క్రితం బజాజ్ ఫైనాన్స్‌లో సెల్‌ఫోన్ తీసుకునేందుకు వెళ్లిన అనూషకు అక్కడ పనిచేసే సిరిసిల్ల జిల్లా ముక్తాబాద్‌కు చెందిన కరుణాకర్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో అతడు ఆమె ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. అప్పుడప్పుడూ తనతోపాటు స్నేహితుడు రాజశేఖర్‌ని కూడా తీసుకొచ్చేవాడు. సర్జికల్ బ్లేడ్‌తో గొంతు కోసి... ఇటీవల అనూష తనతో కంటే రాజశేఖర్‌తోనే ఎక్కువ చనువుగా ఉంటుందని కరుణాకర్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో కళ్యాణ్‌రావు బుధవారం విధి నిర్వహణ నిమిత్తం ఆత్మకూరు వెళ్లగా.. గురువారం రాజశేఖర్.. వాళ్లింటికి వచ్చాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన కరుణాకర్.. రాజశేఖర్‌ని చూసి ఆగ్రహంతో రగిలిపోయాడు. దీంతో అతడు బాత్రూంలో దాక్కోగా.. అనూష, కరుణాకర్ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అనంతరం కోపం పట్టలేని కరుణాకర్.. తన వెంట తెచ్చుకున్న సర్జికల్ బ్లేడుతో చిన్నారి ఆద్య గొంతు కోశాడు. ఇది చూసి అనూష గట్టిగా కేకలు వేయడంతో బయటకు వచ్చిన రాజశేఖర్‌పై కూడా దాడి చేశాడు. తర్వాత తన మెడతోపాటు మణికట్టుపై కోసుకున్నాడు. తొలుత ఈ పరిణామాలకు షాక్‌కు గురైన అనూష వెంటనే తేరుకుని స్థానికుల సహాయంతో ఆద్యను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే, అప్పటికే ఆ చిన్నారి మరణించిందని డాక్టర్లు ధ్రువీకరించడంతో ఆమె షాక్‌కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనూష భర్త కళ్యాణ్‌రావు ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఇటీవల కాలంలో తనను అనూష దూరం పెడుతోందని, అందుకే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు కరుణాకర్ పోలీసు విచారణలో చెప్పినట్టు తెలిసింది. కళ్యాణ్‌రావు, రాజశేఖర్ వాంగ్మూలాలను కూడా పోలీసులు నమోదు చేశారు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్న అనూష చెప్పేవిషయాలను బట్టి ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందని పోలీసులు చెబుతున్నారు. -
సంక్రాంతికి ఊరెళ్తున్నారా... ఇల్లు భద్రం
సాక్షి, ఘట్కేసర్: సంక్రాంతి పండగకు సొంతూర్లకు వెళ్లేవారు తమ ఇళ్లల్లో చోరీలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి కొళ్లగొట్టే గ్యాంగులు పండగ సమయాల్లో కాచుకు కూర్చుంటాయి. పట్టణానికి దూరంగా ఉన్న ఇళ్లు, కాలనీ చివరలో నివాసించే వారు ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్లే ముందు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఘట్కేసర్ డీఐ కిరణ్‌కుమార్ సూచిస్తున్నారు. నివారణ చర్యలే ప్రధానం.. సెంట్రల్ లాక్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి లోపల ద్వారాలు, కిటికీలకు గడియా పెట్టాలి. తాళం కనిపించకుండా కర్టెన్లు వేయాలి. రాత్రికి ఇంటి లోపల, బయట లైట్లు వేలిగేలా చూడాలి. ఆభరణాలు, నగదు బ్యాంకులో భద్రపర్చుకోవాలి, లేదా నమ్మకస్తుల వద్ద భద్రపర్చుకోవాలి. ఊరెళ్లే ముందు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సమాచారం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల పోలీసులు మీ ఇంటిపై ఓ కన్నేసి ఉంచుతారు. రాత్రి పూట గస్తీ పోలీసులను మీ ఇంటిని చూడమని పంపిస్తారు. పోలీసుల సూచనలు పాటించండి పండగలకు సొంతూళ్లకు వెళ్లేవారు పోలీసుల సూచనలు పాటిస్తే చోరీలు జరగకుండా ఆపవచ్చు. మాకు సమాచారం ఇస్తే ఆయా ప్రాంతాల్లో నిఘా పెంచుతాం. ఇంటిలో సీసీ కెమెరాలు బిగించుకోవాలి. కాలనీల్లో అనుమానితులు తిరుగుతుంటే 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వండి. – కిరణ్‌కుమార్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఘట్కేసర్ -
సినీ సహాయ దర్శకుడు, నటుడు అరెస్ట్
సాక్షి, మేడ్చల్ : ఓ వ్యభిచార ముఠా గుట్టును ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. విటులను ఆన్లైన్ ద్వారా ఆకర్షిస్తూ వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు ఘట్కేసర్లోని ఓ ఇంటిపై దాడులు జరిపారు. వెంకటాద్రి టౌన్షిప్ బస్టాండ్ సమీపంలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారంతో ఓ ఇంటిఫై ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సినీ సహాయ దర్శకుడు మూల రాజశేఖర్ రెడ్డి, సినీ ఆర్టిస్ట్ యార్లగడ్డ రవికుమార్ తో పాటు, ముగ్గురు మోడల్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఓటీ పోలీసులు వీరిని ఘట్కేసర్ పోలీసు స్టేషన్లో అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శాడిస్ట్ భర్త అకృత్యం
-
శాడిస్ట్ భర్త అకృత్యం
- భార్య జననావయవాలపై కత్తితో గాట్లు - అనుమానంతో వైద్యపరీక్షలు - ఘట్కేసర్లో వెలుగుచూసిన ఘటన.. కేసు నమోదు ఘట్కేసర్: అనుమానం పెనుభూతమై భార్యతో రాక్షసంగా ప్రవర్తిస్తున్న భర్త ఉదంతం ఇది. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌కు చెందిన పి.ప్రియాంక(25)కు, వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధన్ తండాకు చెందిన భూక్యా రవితో 2005లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఉద్యోగ రీత్యా రవి హైదరాబాద్ శివారు ఘట్కేసర్ మండలం అన్నోజిగూడలో కాపురంపెట్టాడు. అయితే, రవికి భార్య ప్రవర్తనపై అనుమానం ఉంది. దీంతో ఆమెపై చపాతీ కర్రతో దాడి చేయటంతో తలకు మూడు కుట్లు పడ్డాయి. తాళలేక ఆమె పుట్టింటికి వెళ్లగా అక్కడి కెళ్లి మరీ దాడి చేశాడు. ఈ మేరకు అక్కడి పోలీస్‌స్టేషన్‌లో రవిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదైంది. ఇకపై భార్యను తిట్టను, కొట్టను అంటూ పోలీసుల ముందు ఒప్పుకుని భార్యను అన్నోజిగూడకు తీసుకొచ్చి మళ్లీ వేధింపులు ప్రారంభించాడు. ఆమె సున్నిత భాగాల్లో కత్తితో గాట్లు పెట్టడంతోపాటు..వేరేవారితో లైంగిక సంబంధం పెట్టుకుందంటూ వైద్య పరీక్షలు చేయించాడు. ఈ చర్యలతో విసిగిపోయిన ప్రియాంక ఈ నెల 24న పిల్లల్ని వెంటబెట్టుకుని బంధువుల ఇంటికి వెళ్లింది. కుమార్తె ఆచూకీ తెలియడం లేదంటూ తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ పోలీసులు అదృశ్యం కేసు నమోదుచేశారు. దర్యాప్తులో భాగంగా ఆమె జనగాంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఘట్కేసర్ తీసుకొచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
కన్న తల్లే వ్యభిచారం చేయమంటోంది..
♦ పోలీసులను ఆశ్రయించిన యువతి ఘట్కేసర్: యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌ఎఫ్‌సీనగర్‌లో చెందిన యువతి(17)కి ఇంటికి తరుచుగా వచ్చే శ్రీనివాస్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆ యువతి తల్లికి తెలిపింది. దీంతో ఆ యువతి తల్లి అతనికే సహకరించమని డబ్బులు ఇస్తాడని అనడంతో ఒకసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అతని ఆగడాలు మితిమీరడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కారులో అత్యాచారయత్నమంటూ మహిళ ఫిర్యాదు
నడుస్తున్న కారులో ఓ యువతిపై అత్యాచారానికి యత్నించిన ముగ్గురు వ్యక్తులను ఘట్కేసర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదారాబాద్ నుంచి వరంగల్ వస్తున్న క్యాబ్‌లో తనపై అత్యాచారయత్నం చేయబోతున్నారంటూ ఓ మహిళ ఇచ్చిన సమాచారంతో పోలీసులు వేగంగా స్పందించారు. ఘట్కేసర్ దగ్గర క్యాబ్‌ను అడ్డుకుని మహిళను రక్షించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ఉండే మహిళ భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు శ్రీకాంత్ అనే వ్యక్తితో వివాహేత సంబంధం ఉన్నట్లు సమాచారం. అయితే ఆ మహిళ ఖాజీపేటలోని గణేష్ టెంపుల్‌కు ఒంటరిగా వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ తన స్నేహితుల క్యాబ్‌లో వెళ్లి ఆమె తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలో ఒంటరిగా ఎందుకు వెళ్లావు, ఎవరిని కలవడానికి వెళ్లావంటూ ఆమెను కొట్టాడు. దీంతో ఆమె తనపై అత్యాచారయత్నం జరుగుతోందంటూ మెసేజ్ పెట్టిందని పోలీసులు విచారణలో తేల్చారు. మహిళను కొట్టినందుకు శ్రీకాంత్, అతని స్నేహితులపై కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు.