అనుమానం పెనుభూతమై భార్యతో రాక్షసంగా ప్రవర్తిస్తున్న భర్త ఉదంతం ఇది. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌కు చెందిన పి.ప్రియాంక(25)కు, వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధన్ తండాకు చెందిన భూక్యా రవితో 2005లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఉద్యోగ రీత్యా రవి హైదరాబాద్ శివారు ఘట్‌కేసర్ మండలం అన్నోజిగూడలో కాపురంపెట్టాడు.