కన్న తల్లే వ్యభిచారం చేయమంటోంది..
యువతి తల్లి అతనికి సహకరించమని డబ్బులు ఇస్తాడని తెలిపింది..
♦ పోలీసులను ఆశ్రయించిన యువతి
ఘట్‌కేసర్: యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌ఎఫ్‌సీనగర్‌లో చెందిన యువతి(17)కి ఇంటికి తరుచుగా వచ్చే శ్రీనివాస్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆ యువతి తల్లికి తెలిపింది.
దీంతో ఆ యువతి తల్లి అతనికే సహకరించమని డబ్బులు ఇస్తాడని అనడంతో ఒకసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అతని ఆగడాలు మితిమీరడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.