సాక్షి, మేడ్చల్ : ఓ వ్యభిచార ముఠా గుట్టును ఎస్‌ఓటీ పోలీసులు రట్టు చేశారు. విటులను ఆన్‌లైన్ ద్వారా ఆకర్షిస్తూ వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఎస్‌ఓటీ పోలీసులు ఘట్‌కేసర్‌లోని ఓ ఇంటిపై దాడులు జరిపారు. వెంకటాద్రి టౌన్‌షిప్ బస్టాండ్ సమీపంలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారంతో ఓ ఇంటిఫై ఎస్‌ఓటీ పోలీసులు శుక్రవారం దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సినీ సహాయ దర్శకుడు మూల రాజశేఖర్ రెడ్డి, సినీ ఆర్టిస్ట్ యార్లగడ్డ రవికుమార్ తో పాటు, ముగ్గురు మోడల్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఓటీ పోలీసులు వీరిని ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment