SOT police ride
-
PSL: క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్..
మేడ్చల్(హైదరాబాద్) : బాచుపల్లిలో క్రికెట్ బెట్టింగ్‌కి పాల్పడుతున్న ముఠాపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు తెలిపారు. పోలీసుల ప్రకారం.. ఈ ముఠా పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లపై ఒక్కో రేటు ఫిక్స్ చేసుకుని బెట్టింగ్‌కు పాల్పడుతున్నారని అన్నారు. ఈ గ్యాంగ్ బెట్టింగ్‌ను కొత్త తరహాలో చేస్తున్నారని తెలిపారు. ఆన్‌లైన్‌తో.. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ల ద్వారా బెట్టింగులు జరుగుతున్నాయని అన్నారు. కాగా ఈ ముఠా నుంచి రూ.21 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు తెలిపారు. చదవండి: ఇన్‌స్టా పరిచయం.. ప్రేమ అంగీకరించలేదని ప్రియుడి ఆత్మహత్య -
సినీ సహాయ దర్శకుడు, నటుడు అరెస్ట్
సాక్షి, మేడ్చల్ : ఓ వ్యభిచార ముఠా గుట్టును ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. విటులను ఆన్లైన్ ద్వారా ఆకర్షిస్తూ వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు ఘట్కేసర్లోని ఓ ఇంటిపై దాడులు జరిపారు. వెంకటాద్రి టౌన్షిప్ బస్టాండ్ సమీపంలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారంతో ఓ ఇంటిఫై ఎస్ఓటీ పోలీసులు శుక్రవారం దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సినీ సహాయ దర్శకుడు మూల రాజశేఖర్ రెడ్డి, సినీ ఆర్టిస్ట్ యార్లగడ్డ రవికుమార్ తో పాటు, ముగ్గురు మోడల్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఓటీ పోలీసులు వీరిని ఘట్కేసర్ పోలీసు స్టేషన్లో అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. ఐదుగురి అరెస్ట్
మేడిపల్లి: వ్యభిచార గృహంపై ఎస్వోటీ (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. వ్యభిచార ముఠా గుట్టు రట్టయిన ఈ ఘటన బోడుప్పల్‌లోని సాయి భవానీ నగర్లో చోటుచేసుకుంది. చిలకలగూడకు చెందిన విజయకుమార్ భార్య వల్లపు దాస్నేరి(34), నారాయణగూడకు చెందిన రాపోలు రాధిక(32)లు స్థానికంగా ఒక ఇంటిని అద్దెకు తీసుకుని గత కొన్ని నెలలుగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు శనివారం దాడిచేసి నిర్వాహకులతోపాటు మరో ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం చేస్తున్న ఇద్దరు మహిళలను రెస్క్యూ హోమ్ కు తరలించనున్నట్టు ఎస్వోటీ ఎస్సై ఆంజనేయులు తెలిపారు.