
సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. ఐదుగురి అరెస్ట్
మేడిపల్లి: వ్యభిచార గృహంపై ఎస్‌వోటీ (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. వ్యభిచార ముఠా గుట్టు రట్టయిన ఈ ఘటన బోడుప్పల్‌లోని సాయి భవానీ నగర్‌లో చోటుచేసుకుంది. చిలకలగూడకు చెందిన విజయకుమార్ భార్య వల్లపు దాస్‌నేరి(34), నారాయణగూడకు చెందిన రాపోలు రాధిక(32)లు స్థానికంగా ఒక ఇంటిని అద్దెకు తీసుకుని గత కొన్ని నెలలుగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.
ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు శనివారం దాడిచేసి నిర్వాహకులతోపాటు మరో ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం చేస్తున్న ఇద్దరు మహిళలను రెస్క్యూ హోమ్ కు తరలించనున్నట్టు ఎస్‌వోటీ ఎస్సై ఆంజనేయులు తెలిపారు.