
సాక్షి, అనంతపురం: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం వరకు పెళ్లి భాజాలతో కళకళలాడిన ఆ ఇంట్లో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకెళ్తే.. బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడులో క్షణాల వ్యవధిలో తల్లీ, కొడుకులు మరణించారు. పామిడి ఏఎస్‌ఐగా పనిచేస్తున్న వెంకటస్వామి ఆదివారం కొడుకు పెళ్లయిన వెంటనే గుండెపోటుతో మరణించారు. ఈ మరణవార్త తెలిసిన మరుక్షణమే వెంకటస్వామి తల్లి కోనమ్మ (70) మృతి చెందింది. తల్లీ, కొడుకుల మరణవార్తతో బాధిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
చదవండి: (మంత్రి తలసాని కుమారుడిపై కేసు నమోదు)
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
కొడుకు వివాహం అనంతరం గుండెపోటుతో మృతి చెందిన పామిడి ఏఎస్ఐ వెంకటస్వామి, ఆయన తల్లి కోనమ్మ మృతదేహాలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప, జిల్లా పోలీసు అధికారుల సంఘం నేతలు త్రిలోక్, సుధాకర్ రెడ్డి సంతాపం తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment